Nagababu: మెగా బ్రదర్ నాగబాబును నిన్న రాత్రి నుండి విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. నాగబాబుది ఐరన్ లెగ్ అని నెగిటివ్ కామెంట్స్ చేసున్నారు. అదేంటో నాగబాబు ఈ మధ్య తిట్టించుకోవడానికే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నాడా అనిపిస్తోంది. నిన్న జరిగిన ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ లో ఇండియా టీం భారతీయుల మనోభావాలను భంగపరుస్తూ అతి ఘోరంగా ఓడిపోయిన బాగోతం గురించి తెలిసిందే.

అయితే, ఇండియా గెలుస్తుందని నిన్న చాలామంది బెట్టింగ్స్ వేసి నష్టపోయారు. దీనికితోడు ఇండియా టీం అపజయాన్ని ఎవరూ ఊహించలేదు. దాంతో సహజంగానే ఆ ఓటమిని కొంతమంది జీర్ణించుకోలేకపోయారు. సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్లతో విరుచుకుపడ్డారు. పనిలో పనిగా నాగబాబు పై కూడా మండిపడ్డారు. నాగబాబును ఎందుకు విమర్శించారు అంటే.. నిన్న జరిగిన ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ లైవ్ గా చూసేందుకు నాగబాబు దుబాయ్ వెళ్ళాడు.
ఇక నాగబాబుతో పాటు ఆయన తనయుడు వరుణ్ తేజ్ కూడా వెళ్ళాడు. ఈ సందర్భంగా వరుణ్ తేజ్ స్టేడియంలో ఉన్న సమయంలో తన తండ్రితో ఫోటో దిగి పోస్ట్ పెట్టాడు .ఇప్పుడు ఆ ఫోటోనే నాగబాబు పై ట్రోల్ కి ముఖ్య కారణం అయింది. ఇండియా ఓటమికి నాగబాబునే కారణం అని, అతనిది ఐరన్ లెగ్ అని విమర్శలు చేస్తున్నారు. ఇటివలే నాగబాబు మా ఎలక్షన్స్ లో కీలక పాత్ర పోషించి ప్రకాష్ రాజ్ ప్యానల్ ని సపోర్ట్ చేశాడు.
కానీ, ప్రకాష్ రాజ్ ఓడిపోయాడు. పైగా ఆ ఓటమికి కారణం.. నాగబాబునే అంటూ ఆరోపణలు వచ్చాయి. అందుకు తగ్గట్టుగానే మా ఎన్నికల నేపథ్యంలో నాగబాబు కూడా కాస్త అతి వ్యాఖ్యాలు చేశాడు. ఈ క్రమంలోనే నాగబాబుది ఐరన్ లెగ్ అని ప్రచారం చేశారు. ఇలాంటి పరిస్తుతుల్లో నిన్న జరిగిన ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ లైవ్ గా చూసేందుకు స్టేడియం కి వెళ్ళాడు నాగబాబు.
నాగబాబు మ్యాచ్ ను దగ్గర ఉండి చూశాడు కాబట్టే ఓడిపోయింది అని పిచ్చి కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి నెటిజన్లు నాగబాబు ఐరన్ లెగ్ వల్లే ఇలా జరిగిందని తను ఎవరిని సపోర్ట్ చేస్తే వాళ్ళు ఓడిపోవడం ఖాయం అని ట్రోల్స్ చేస్తూ నాగబాబును ఆడుకుంటున్నారు.