Nadhiya: సీనియర్ నటి ‘నదియా’ మెయిన్ లీడ్ గా ఒక వెబ్ సినిమా రాబోతుంది. అయితే, ఈ సినిమా కాన్సెప్ట్ కాస్త ఆసక్తికరంగా ఉంది. ఓ కుర్రాడితో ప్రేమలో పడిన ఆంటీ జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది ? అసలు తప్పటడుగు వేసిన ఆంటీ పరిస్థితి ఎలా మారుతుంది ? అనే కోణంలో ఈ వెబ్ ఫిల్మ్ సాగుతుందని తెలుస్తోంది. అలాగే ఈ సినిమాలో ఆంటీల మీద కుర్రోళ్లకు ఎందుకు అంత ఇంట్రెస్ట్ ఉంటుందనే ప్లేతో ఈ చిత్రం సాగుతుందట.

మరి ఈ వెబ్ సినిమాతో ‘నదియా’ ఎలాంటి రచ్చ చేస్తోందో చూడాలి. పైగా ‘నదియా’ మెయిన్ లీడ్ గా నటిస్తోంది కాబట్టి.. సౌత్ భాషల్లో ఈ సినిమాకి మంచి డిమాండ్ ఉంటుంది. ఇక ఈ బోల్డ్ వెబ్ ఫిల్మ్ చేయడానికి ‘నదియా’ భారీ మొత్తాన్నే తీసుకుంటుంది. డిజిటల్ ప్లాట్ ఫామ్స్ వచ్చాక, సీనియర్ హీరోయిన్లకు అవకాశాలు పెరిగాయి.
ఆ అవకాశాలను క్యాష్ చేసుకోవడానికి వయసు పెరిగిన సీనియర్ హీరోయిన్లు గ్లామర్ విషయంలో, అలాగే ఎక్స్ పోజింగ్ విషయంలో ఎలాంటి మొహమాటాలు పెట్టుకోవడం లేదు. మరి ఈ లేటు వయసులో అందాల ఆరబోతలో హద్దులు దాటడం అంటే డేరింగ్ స్టెపే. అయితే నదియా మళ్ళీ సోలో సినిమాల్లో క్రేజ్ ను తెచ్చుకోవడానికే కాస్త బోల్డ్ స్టెప్ తీసుకుంది.
అయినా నదియా ఇప్పుడు అంటే, ఆంటీ పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది గానీ, ఒకప్పుడు నదియా అంటే.. గ్లామరస్ క్యారెక్టర్లకు, హాట్ హాట్ షోలకు కేరాఫ్. ఆ రోజుల్లో ఆ రేంజ్ లో నదియాకి ఫుల్ క్రేజ్ ఉండేది. పైగా ఎక్స్ పోజింగ్ లో నదియా ఎక్కడా కాంప్రమైజ్ అయ్యేది కాదు. కానీ, నదియా మాత్రం కెరీర్ లో స్టార్ హీరోయిన్ గా ఎదగలేక పోయింది.
సోలో హీరోయిన్ గా ఎక్కువ సినిమాలు చేయలేకపోయింది. చివరకు వయసు అయిపోయాక అత్త పాత్రలతో మళ్ళీ ఫామ్ లోకి వచ్చింది. ఇప్పుడు సోలో హీరోయిన్ గా సినిమాలు కూడా చేస్తోంది. మరి నదియా ఈ సినిమాతో ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.