https://oktelugu.com/

Nabha Natesh : అవకాశాల కోసం ఇంతటి తెగింపా… నభా నటేష్ హాట్ ఫోటో షూట్!

నభా తీరు చూసిన జనాలు ఆఫర్స్ కోసం అమ్మడు ఇలా తెగిస్తుందని అంటున్నారు.

Written By:
  • NARESH
  • , Updated On : August 23, 2023 / 04:36 PM IST
    Follow us on

    Nabha Natesh : నభా నటేష్ కెరీర్ అనూహ్యంగా తారుమారైంది. ఈ కన్నడ బ్యూటీ చేతిలో ఒక్క ఆఫర్ లేదు. కనీసం వెబ్ సిరీస్లు వంటి డిజిటల్ కంటెంట్ ఆఫర్స్ కూడా రావడం లేదు. 2015లో నభా నటేష్ చిత్ర పరిశ్రమకు వచ్చింది. వజ్రకాయ ఆమె డెబ్యూ మూవీ. శివరాజ్ కుమార్ హీరోగా నటించారు. ఇక తెలుగులో నన్ను దోచుకుందువటే చిత్రంతో అడుగుపెట్టింది. నన్ను దోచుకుందువటే మూవీ ఆశించిన స్థాయిలో ఆడలేదు. అయితే ఇస్మార్ట్ శంకర్ మూవీతో భారీ బ్రేక్ వచ్చింది.

    దర్శకుడు పూరి జగన్నాధ్ తెరకెక్కించిన ఇస్మార్ట్ శంకర్ వరల్డ్ వైడ్ రూ. 75 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. రామ్ పోతినేని హీరోగా నటించాడు. నిధి అగర్వాల్ మరొక హీరోయిన్. ఇస్మార్ట్ శంకర్ లో నభా తెలంగాణ పోరీ క్యారెక్టర్ లో జీవించింది. ఆ చిత్రం విజయంలో నభాకు తెలుగులో ఆఫర్స్ క్యూ కట్టాయి. రవితేజకు జంటగా డిస్కో రాజా చిత్రం చేసింది. ఈ సినిమా ఆడితే ఆమె కెరీర్ మరోలా ఉండేది. డిస్కో రాజా అట్టర్ ప్లాప్ కావడంతో నభా నిరాశకు గురైంది.

    ఇక నితిన్ కి జంటగా మ్యాస్ట్రో మూవీ చేసింది. హిందీ చిత్ర రీమేక్ గా ఇది తెరకెక్కింది. నేరుగా ఓటీటీలో విడుదల కావడంతో నభా కెరీర్ కి ఈ మూవీ అంతగా ఉపయోగపలేదు. 2021 సంక్రాంతి రిలీజ్ అల్లుడు అదుర్స్ దారుణ పరాజయం చూసింది. ఆ దెబ్బతో నభాకు టాలీవుడ్ లో దారులు మూసుకుపోయాయి. నభాకు ఒక్క దర్శకుడు కూడా ఆఫర్ ఇవ్వడం లేదు. దానికో తోడు నభా నటేష్ కి సర్జరీ జరిగిందట.

    ఆమె భుజం ఎముక విరగడంతో సర్జరీ చేశారట. కోలుకునే సమయంలో మానసికంగా శారీరకంగా నభా నటేష్ వేదనకు గురయ్యారట. ఈ ప్రమాదం కారణంగానే గ్యాప్ వచ్చిందని నభా నటేష్ చెప్పుకొస్తోంది. ఇక ఆఫర్స్ లేని నభా నటేష్ సోషల్ మీడియాలో మాత్రం రచ్చ చేస్తుంది. తాజాగా డెనిమ్ స్కర్ట్, జాకెట్ ధరించి బోల్డ్ ఫోటో షూట్ చేసింది. నభా తీరు చూసిన జనాలు ఆఫర్స్ కోసం అమ్మడు ఇలా తెగిస్తుందని అంటున్నారు.