Naa Anveshana apology: ప్రముఖ నటుడు శివాజీ(Actor Sivaji) హీరోయిన్స్ దుస్తులను ఉద్దేశించి చేసిన కామెంట్స్ తాలూకా వివాదం రోజురోజుకి పెరుగుతూ పోతూనే ఉంది. దీనికి శుభం కార్డు ఇప్పట్లో పడేలా కనిపించడం లేదు. హమ్మయ్య ఇక అయిపోయింది లే అని అనుకుంటున్న ఎవరో ఒకరు రావడం, నోటికి వచ్చినట్టు మాట్లాడడం, వెళ్లిపోవడం వంటివి జరువుతున్నాయి. మరోపక్క శివాజీ ని ఒక్కడిని చేసి టార్గెట్ చేయడం తో రోజురోజుకు ఆయనకు పబ్లిక్ లో ఇమేజ్ బాగా పెరిగిపోతూ ఉంది. ఇదంతా పక్కన పెడితే, ఈమధ్య కాలం లో తన యూట్యూబ్ ఛానల్ కి వ్యూస్ తగ్గిపోవడం తో ‘నా అన్వేషణ’ ఈ శివాజీ మ్యాటర్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది కాబట్టి, ఈ అంశం పై నోటికి వచ్చినట్టు మాట్లాడితే వీడియోలు బాగా వైరల్ అవుతాయి, మన వ్యూయర్షిప్ మనకి వచ్చేస్తుందని అనుకున్నాడేమో, శివాజీ మ్యాటర్ దగ్గర నుండి ఏకంగా హిందూ దేవుళ్ళ వరకు వెళ్ళిపోయాడు.
ఇప్పుడు సోషల్ మీడియా లో నెటిజెన్స్ నా అన్వేషణ ని ఒక రేంజ్ లో తిడుతున్నారు. దమ్ముంటే ఇండియా కి రా, నీ సంగతి ఏంటో తేలుస్తాం. ఇదంతా పక్కన పెడితే గతం లో శివాజీ, బిగ్ బాస్ 7 కి వెళ్ళకముందు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో మీకు నచ్చిన యూట్యూబర్ ఎవరు అంటే ‘నా అన్వేషణ’ అని శివాజీ అంటాడు. పాపం శివాజీ ఆయన అభిమాని అయితే, అలాంటి వ్యక్తిని పట్టుకొని ‘ నా అన్వేషణ అనే వ్యక్తి నోటికొచ్చినట్టు శివాజీ ని లకారాలతో తిట్టాడు. అయితే నేడు అలా తిట్టినందు క్షమాపణలు చెప్తూ, నా అన్వేషణ మరో వీడియో విడుదల చేసాడు. ఆయన మాట్లాడుతూ ‘ శివాజీ గారు నాకు పెద్ద ఫ్యాన్ అట. ఇది నాకు తెలియదు బాబోయ్ , నిన్ననే ఒక వీడియో చూసాను’ అంటూ శివాజీ గతం లో తన గురించి గొప్ప మాట్లాడిన వీడియో ని చూపించాడు.
అనంతరం ఆయన మాట్లాడుతూ ‘నా కోపాన్ని పక్కన పెట్టి , శివాజీ గారు నేను మిమ్మల్ని అన్న మాటలను వెనక్కి తీసుకుంటున్నాను. మీరు ఎలా అయితే వెనక్కి తీసుకుంటున్నారో ‘సామాన్లు’ అనే పదాన్ని, నేను కూడా మిమ్మల్ని అన్న భూతులను వెనక్కి తీసుకొని క్షమాపణలు చెప్తున్నాను. అయితే ఇప్పుడు నిజాలు మాట్లాడుకుందాం, మీరు ఏదైతే చీర కట్టుకోవాలి అని అమ్మాయిలను అన్నారో, పురాణాల్లోకి వెళ్దాం, త్రేతాయుగం, ద్వాపరయుగాల్లో సీత దేవి కి, ద్రౌపది కి ఏమి జరిగాయి?, వాళ్ళు చీర కట్టుకొనే ఉన్నారు కదా. తప్పుడు ఆలోచనలు ఉన్న మగవాడు చీర కట్టుకున్నా, పొట్టి దుస్తులు వేసుకున్నా ఒకేలా ప్రవర్తిస్తాడు, అలాంటప్పుడు మగవాడి బుద్ధి మారాలి అని చెప్పాలి’ అంటూ చెప్పుకొచ్చాడు. ఇంకా ఆయన ఏమి మాట్లాడాడో ఈ క్రింది వీడియో లో చూడండి.
