NTR- Prashanth Neel: ఎన్టీఆర్ అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ లో ప్రశాంత్ నీల్ చిత్రంపై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. నిజానికి సలార్ కంటే ముందే ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ మూవీ ప్రకటించారు. ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ చిత్రీకరణలో బిజీగా ఉండగా ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో సలార్ పట్టాలెక్కించాడు. ఈ లోపు ఎన్టీఆర్ కొరటాల చిత్రాన్ని పూర్తి చేయడంలో నిమగ్నమయ్యారు. ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ మూవీ ఎప్పుడు పట్టాలెక్కుతోందనే సందిగ్ధంలో ఉన్న ఫ్యాన్స్ కి క్లారిటీతో పాటు గుడ్ న్యూస్ చెప్పేశారు.
ఎన్టీఆర్ 31 ఏప్రిల్ 2024లో సెట్స్ పైకి వెళుతుందట. ఈ న్యూస్ ఒకింత షాక్ అని చెప్పాలి. సలార్ మూవీ 2023 డిసెంబర్ లో విడుదల అవుతుండగా ప్రశాంత్ మరో నాలుగు నెలల్లోనే ఎన్టీఆర్ మూవీ పట్టాలెక్కించనున్నాడు. అంటే ప్రీ ప్రొడక్షన్ పనులు ఆల్రెడీ మొదలెట్టినట్లే లెక్క. కెజిఎఫ్ 2 అనంతరం సలార్ చిత్ర షూటింగ్ మొదలుపెట్టిన ప్రశాంత్ నీల్… సలార్ విడుదలైన వెంటనే ఎన్టీఆర్ మూవీ స్టార్ట్ చేయనున్నాడు.
ఓ టాప్ డైరెక్టర్ పాన్ ఇండియా చిత్రాలు ఇలా చకచకా పూర్తి చేయడం ఊహించని పరిణామం. అటు ఎన్టీఆర్ కూడా ఖాళీ లేకుండా పని చేయాల్సి ఉంది. ఆర్ ఆర్ ఆర్ విడులయ్యాక ఏడాది పాటు ఖాళీగా ఉన్న ఎన్టీఆర్ దేవర షూటింగ్ లో నిరవధికంగా పాల్గొంటున్నారు. దేవర 2024 ఏప్రిల్ 5న విడుదల కానుంది. అదే నెలలో విరామం లేకుండా ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీ పట్టాలెక్కిస్తాడన్న మాట.
మరోవైపు వార్ 2 ప్రీ ప్రొడక్షన్ జరుగుతుంది. ఇటీవల హైదరాబాద్ వచ్చిన దర్శకుడు అయాన్ ముఖర్జీ ఎన్టీఆర్ తో ఇదే విషయమై చర్చలు జరిపారు. వార్ 2 ఎన్టీఆర్ ఫస్ట్ బాలీవుడ్ మూవీ. మరో హీరోగా హృతిక్ రోషన్ నటిస్తున్నారు. అలాగే నిన్న కొరటాల శివ దేవర 2 ప్రకటించారు. బ్యాక్ టు బ్యాక్ గుడ్ న్యూస్ తో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
The most awaited project of @tarak9999 & #PrashanthNeel will commence in April, 2024 ❤️🔥
The prestigious high-octane spectacle will create a new benchmark in Indian Cinema 💥💥#NTRNeel 🔥@NANDAMURIKALYAN @MythriOfficial pic.twitter.com/fGa0QSTTvJ
— NTR Arts (@NTRArtsOfficial) October 5, 2023