Janhvi Kapoor: అతిలోక సుందరి, అలనాటి అందాల తార అంటూ ‘శ్రీదేవి’ గురించి ఎన్ని చెప్పుకున్నా.. ఆమె అందం గురించి పూర్తిగా వర్ణించలేం. ప్రస్తుతం శ్రీదేవి మన మధ్య లేకపోయినా ఆమె వారసత్వం మాత్రం ప్రేక్షకులను అలరించడానికి పోటీ పడబోతోంది. ఇప్పటికే శ్రీదేవి వారసురాలు జాన్వీ కపూర్ బాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా ఫుల్ బిజీగా ఉంది.

కాగా ఈ అతిలోక సుందరి తనయ విహారయాత్రలకే కాదు.. ఆధ్యాత్మిక యాత్రలకు కూడా వెళ్తుంటుంది. నిన్న తిరుమలలో కొలువై ఉన్న శ్రీ వేంకటేశ్వర స్వామిని ఆమె దర్శించుకున్నారు. ఆదివారం జాన్వీ పుట్టినరోజు సందర్భంగా స్నేహితులు, తన సోదరి, నటి మహేశ్వరితో కలిసి తిరుమల చేరుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఆ ఫోటోలు గమనిస్తే.. జాన్వీ మెట్ల మార్గంలో తిరుమల చేరుకున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి జాన్వీ కపూర్ కి తిరుపతి అంటే బాగా ఇష్టం అట. చిన్నతనంలో ఆమె ఎక్కువగా తిరుపతి వచ్చేది అని తెలుస్తోంది. అందుకే, తన పెళ్లి కూడా తిరుపతిలోనే చేసుకోవాలని జాన్వీ కపూర్ ఫిక్సయ్యింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది.
ఇక జాన్వీ త్వరలోనే తెలుగు సినిమాలో కూడా నటించనుంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాణంలో రానున్న ఓ సినిమాలో జాన్వీ కపూర్ నటించనుంది. ‘శ్రీదేవి’కి ఒక చిరకాల కోరిక ఉంది. తన కూతురిని తెలుగులో కూడా పెద్ద హీరోయిన్ ను చేయాలని శ్రీదేవి ఎప్పుడు ఆశ పడుతూ ఉండేది. ఎలాగూ బాలీవుడ్ లోనే మోస్ట్ క్రేజీ యంగ్ బ్యూటీగా ఫుల్ బిజీగా కెరీర్ ను కొనసాగిస్తోంది జాన్వీ కపూర్.

బాలీవుడ్ బాటలోనే తెలుగులో కూడా ఎంట్రీకి సిద్ధమైంది. అయితే ఈ యంగ్ బ్యూటీకి అందచందాలు ఎక్కువే, అయినా సర్జరీలు కూడా చేయించుకుని మరీ మొత్తానికి తన అందాన్ని పెంచుకుని హీరోయిన్ గా రాణిస్తోంది. మరి తన తల్లి లాగే జాన్వీ కూడా సక్సెస్ అవుతుందో లేదో చూడాలి.