Lavanya Tripathi: వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి ఇటీవల వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఇటలీ దేశంలో డెస్టినేషన్ వెడ్డింగ్ మూడు రోజులు ఘనంగా జరిగింది. వరుణ్-లావణ్యల పెళ్ళి వేడుకలకు కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. మెగా ఫ్యామిలీ మొత్తం పాల్గొనడంతో నేషనల్ వైడ్ న్యూస్ అయ్యింది. చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్ తో పాటు ఇరు కుటుంబాల బంధువులు పెళ్ళిలో సందడి చేశారు. నవంబర్ 1న లావణ్య మెడలో వరుణ్ తాళి కట్టాడు.
నవంబర్ 5న హైదరాబాద్ లో రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు టాలీవుడ్ మొత్తం హాజరైంది. ప్రముఖులు నూతన జంటను ఆశీర్వదించారు. కాగా పెళ్లై నెల రోజులు కూడా కావడం లేదు. వరుణ్ తేజ్ ఎలాంటివాడో చెబుతూ లావణ్య త్రిపాఠి ఓ పోస్ట్ పెట్టింది. సదరు పోస్ట్ వైరల్ అవుతుంది. ”నా భర్త వరుణ్ దయా హృదయం కలిగిన కేరింగ్ పర్సన్. ఇంకా చాలా మంచి లక్షణాలు ఉన్నాయి. కానీ నేను వాటిని నాలోనే దాచుకుంటాను. మూడు రోజులు మా వివాహం ఒక కలలా, అద్భుతంగా జరిగింది. మమ్మల్ని ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు” అని, ఆమె కామెంట్ చేశారు.
భర్త మీద ప్రేమను బయటపెడుతూ లావణ్య త్రిపాఠి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. కాగా వీరిది ప్రేమ వివాహం. 2017లో మిస్టర్ మూవీ సెట్స్ లో వీరికి పరిచయం అయ్యింది. దర్శకుడు శ్రీను వైట్ల తెరకెక్కించిన మిస్టర్ చిత్రంలో వరుణ్ కి జంటగా లావణ్య, హెబ్బా పటేల్ నటించారు. వీరి ప్రేమకు ఇటలీ దేశంలో బీజం పడింది. అందుకే ఇటలీలో పెళ్లి చేసుకున్నారు.
ఏళ్ల తరబడి లావణ్య, వరుణ్ రహస్యంగా ప్రేమించుకున్నారు. గత రెండేళ్లుగా పుకార్లు మొదలయ్యాయి. అప్పటి కూడా ప్రేమ కథనాలను లావణ్య ఖండించారు. ఈ ఏడాది సడన్ గా నిశ్చితార్థం ప్రకటించారు. జూన్ 9న హైదరాబాద్ లో లావణ్య-వరుణ్ ల ఎంగేజ్మెంట్ జరిగింది. వివాహం అనంతరం లావణ్య నటనకు దూరం కానున్నట్లు సమాచారం. ఆమె నిర్మాతగా మారాలని అనుకుంటున్నారనే వాదన ఉంది. మరోవైపు వరుణ్ రెండు చిత్రాలతో బిజీగా ఉన్నాడు.
View this post on Instagram