Raj Tarun Comments
Raj Tarun : యంగ్ హీరో రాజ్ తరుణ్ పేరు మీడియాలో మారుమ్రోగింది. లావణ్య అనే యువతి ఆయనపై కేసు పెట్టింది. లావణ్య కథనం ప్రకారం… ఫేస్ బుక్ లో రాజ్ తరుణ్ కి 2008లో పరిచయమైంది లావణ్య. హీరో కావాలనే కలతో రాజ్ తరుణ్ హైదరాబాద్ కి వచ్చారు. అప్పట్లో రాజ్ తరుణ్ షార్ట్ ఫిల్మ్స్ చేసేవాడు. ఇద్దరి మధ్య పరిచయం ప్రేమకు దారి తీసింది. 2010లో లావణ్యకు లవ్ ప్రపోజల్ పెట్టాడు. అందుకు లావణ్య అంగీకరించింది. పదేళ్లకు పైగా రాజ్ తరుణ్-లావణ్య ఒకే ఇంట్లో సహజీవనం చేశారు.
లావణ్యను రాజ్ తరుణ్ గుడిలో వివాహం చేసుకున్నాడు. కొన్ని నెలలుగా రాజ్ తరుణ్ లావణ్య ను దూరం పెడుతున్నాడు. తిరగబడర సామీ మూవీలో రాజ్ తరుణ్ కి జంటగా నటించిన మాల్వి మల్హోత్రాకు దగ్గరైన రాజ్ తరుణ్ లావణ్యను వదిలించుకోవాలని అనుకుంటున్నాడట. పోలీసులు న్యాయం చేయాలని లావణ్య… నార్సింగ్ పోలీస్ ఆశ్రయించింది. రాజ్ తరుణ్-మాల్వి మల్హోత్రాలతో పాటు ఆమె తమ్ముడు మీద కేసు పెట్టింది. మీడియా ముందు ఆమె హల్చల్ చేసింది.
లావణ్య ఆరోపణలను రాజ్ తరుణ్ ఖండించారు. ఆమెను వివాహం చేసుకోలేదని, తమ మధ్య లైంగిక సంబంధం కూడా లేదని రాజ్ తరుణ్ అంటున్నారు. రాజ్ తరుణ్ తనకు రెండు సార్లు అబార్షన్ కూడా చేయించాడని లావణ్య చెప్పడం కొసమెరుపు. ఈ వివాహం నేపథ్యంలో రాజ్ తరుణ్ మీడియా ముందుకు రావడం లేదు. ఆయన నటించిన పురుషోత్తముడు మూవీ ప్రమోషన్స్ లో పాల్గనలేదు.. తిరగడబర సామీ మూవీ విడుదలకు ముందు పాత్రికేయుల సమావేశంలో పాల్గొన్నారు.
తాజాగా రాజ్ తరుణ్ మరోసారి లావణ్య వివాదం పై స్పందించారు. ఆయన మాట్లాడుతూ… నిజం ఏమిటనేది నాకు తెలుసు. వంద రకాల సాక్ష్యాలు ముందు పెట్టినా, ఎవరి అభిప్రాయం వారికి ఉంటుంది. నాకు నేను సంతోషంగా ఉన్నానా? లేదా? అన్నదే ముఖ్యం. ప్రస్తుతం వివాదం కోర్టులో ఉంది. అక్కడే తేలుతుంది. నా వద్ద చాలా ఆధారాలు ఉన్నాయి. మనుషులు ఎవరూ తప్పులు చేయరు. పరిస్థితులు వారి చేత తప్పులు చేయిస్తాయి… అన్నారు.
ఈ వివాదం అంటుంచితే రాజ్ తరుణ్ వరుస చిత్రాలు విడుదల చేస్తున్నాడు. వారం వ్యవధిలో రాజ్ తరుణ్ నటించిన పురుషోత్తముడు, తిరగబడరసామీ విడుదలయ్యాయి. రాజ్ తరుణ్ లేటెస్ట్ మూవీ భలే ఉన్నాడే సెప్టెంబర్ 7న విడుదల కానుందని సమాచారం.
Web Title: My happiness is important to me on the lavanya controversy says raj tarun latest comments