Homeఎంటర్టైన్మెంట్మైడియ‌ర్ మూవీ మేక‌ర్స్‌.. సాకులు చెప్ప‌డానికి లేదింక‌!

మైడియ‌ర్ మూవీ మేక‌ర్స్‌.. సాకులు చెప్ప‌డానికి లేదింక‌!

Movie Makers
క‌రోనా లాక్ డౌన్ త‌ర్వాత ఆల‌స్యంగా మొద‌లైన ఇండ‌స్ట్రీ సినిమా. అదే స‌మ‌యంలో.. అత్యంత వేగంగా సెట్ రైట్ అయిన రంగం కూడా సినిమానే! అవును.. జ‌న‌వ‌రి 14న సంక్రాంతికి సినిమాలు రిలీజ్ చేయ‌డానికి నిర్మాతలు ఏ విధంగా వ‌ణికిపోయారో అంద‌రికీ తెలిసిందే. ప్రేక్ష‌కులు థియేట‌ర్ కు వ‌స్తారా? మునుపటిలా సినిమాలు చూస్తారా? మ‌ళ్లీ మామూలు రోజులు రావ‌డానికి ఎంత కాలం ప‌డుతుందో? అని తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌య్యారు.

Also Read: స్వచ్ఛమైన ప్రేమకథ.. ఆర్ఆర్ఆర్ లో ‘అల్లూరి సీత’ వ్య‌థ!

ఇప్పుడు మార్చి మ‌ధ్య‌లో ఉన్నాం. అంటే.. కేవ‌లం రెండు నెల‌ల వ్య‌వ‌ధిలోనే సినీ ప్రేక్ష‌కులు సెట్ రైట్ అయిపోయారు. ఈ గ్యాప్ లో మూడు సినిమాల‌ను బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిపారు. సంక్రాంతికి వ‌చ్చిన క్రాక్‌, ఆ త‌ర్వాత వ‌చ్చిన ఉప్పెన‌, ఈ మ‌ధ్య వ‌చ్చిన జాతిర‌త్నాలు. ఈ మూడు చిత్రాలకు అద్భుత‌మైన విజ‌యాన్ని అందించారు. కాసుల వ‌ర్షం కురిపించారు.

ఇక స‌మ్మ‌ర్ సీజ‌న్ కూడా వ‌చ్చేసిన‌ట్టే. త్వ‌ర‌లో మ‌రికొన్ని పేరున్న సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ఈ వారం చావుక‌బురు చ‌ల్ల‌గా, మోస‌గాళ్లు వంటి సినిమాలు బాక్సాఫీస్ త‌లు త‌ట్ట‌బోతున్నాయి. ఆ త‌ర్వాత రెండు పెద్ద సినిమాలు కూడా ఉన్నాయి. ఇందులో నితిన్ హీరోగా న‌టించిన రంగ్ దే కూడా ఉంది. ఈ సినిమా బ‌డ్జెట్ 32 కోట్ల పైనే. అయిన‌ప్ప‌టికీ.. బిజినెస్ మాత్రం బాగానే జ‌రిగింది.

Also Read: ‘ఎవరు మీలో కోటిశ్వరులు’కోసం ఎన్టీఆర్ కు షాకింగ్ రెమ్యునరేషన్!

దీని త‌ర్వాత అంద‌రి క‌ళ్లూ వేచి చూస్తున్న సినిమా వ‌కీల్ సాబ్‌. ప‌వ‌ర్ స్టార్ రీఎంట్రీలో మొద‌టి మూవీగా వస్తున్న ఈ సినిమాపై హై ఎక్స్‌ పెక్టేష‌న్స్ ఉన్నాయి. భారీ బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన ఈ సినిమా.. బిజినెస్ కూడా ఓ రేంజ్ లో సాగింది. ఈ మూవీ గ‌నుక బాక్సాఫీస్ ను కొల్ల‌గొడితే ఇక ఇండ‌స్ట్రీకి తిరుగులేద‌ని చెప్పొచ్చు. ఇప్ప‌టికే ఆ ప‌రిస్థితి వ‌చ్చేసిన‌ప్ప‌టికీ.. అనుమానాలేమ‌న్నా ఉంటే తీరిపోతాయి.

ఇక‌, ఇప్ప‌టి వ‌ర‌కూ ఫ్లాప్ అయిన సినిమాలు కూడా చాలానే ఉన్న‌ప్ప‌టికీ.. అందులో విష‌యం లేద‌న్న సంగ‌తి అంద‌రికీ తెలిసిందే. సో.. మీ సినిమాలో మ్యాట‌ర్ ఉంటే.. మీట‌ర్ వేయ‌డానికి మేం రెడీ అంటున్నారు ఆడియ‌న్స్‌. కాబ‌ట్టి.. ఇక‌, క‌రోనా సాకు చెప్పి, అందువ‌ల్ల సినిమాల‌కు న‌ష్టాలు వ‌చ్చాయ‌ని చెప్పుకోవ‌డానికి లేదు. మీరు సినిమాలో ద‌మ్ముచూపితే.. థియేట‌ర్ కెళ్లే దిల్లు మాకుందని ప్రేక్ష‌కులు ప్ర‌క‌టించారు కావునా.. ఇక‌, స‌త్తా చూపాల్సింది మేక‌ర్సే!

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version