
మెగా స్టార్ చిరంజీవితో ఒక్క సినిమా చేయాలని తపనపడే వారు ఎందరో ఉన్నారు. ఇండస్ట్రీలోని చాలా మంది దర్శకుడు చిరంజీవి కోసం ఏళ్లు ఎదురుచూస్తుంటారు. అలా చిరంజీవితో పనిచేయాలని ఎదురుచూసిన సంగీత దర్శకుల్లో థమన్ ఒకరు. ఎప్పటికైనా చిరంజీవి సినిమాకు పనిచేయాలని థమన్ చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు.
ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఇటీవలే ‘వకీల్ సాబ్’ మూవీ చేసిన థమన్ తాజాగా మెగాస్టార్ సినిమా అవకాశాన్ని కూడా చేజిక్కించుకున్నాడు. తాజాగా మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన ‘లూసిఫర్’ సినిమా ఏ రేంజ్ లో సక్సెస్ సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను చిరంజీవి రిమేక్ చేస్తున్నాడు. ‘ఆచార్య’ తర్వాత లూసిఫికర్ రిమేక్ ను చేస్తున్నాడు.
చిరు153 పేరుతో ఇప్పుడు ఈ సినిమా రూపొందుతోంది. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై రాంచరణఫ్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. తమిళ దర్శకుడు మోహన్ రాజా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా థమన్ ను ఎంచుకున్నారు. ఈ క్రమంలోనే సినిమాకు సంబంధించిన ఆసక్తికర అప్డేట్ ను థమన్ ఇచ్చారు.
‘లూసిఫర్’ రిమేక్ కోసం తాను చిరంజీవి సార్ తో కలిసి పనిచేస్తున్నానని.. తాజాగా ఈ సినిమాలో ఒక సాంగ్ రికార్డింగ్ కూడా పూర్తి చేసినట్టు చెప్పి మెగా అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు.
చిరంజీవి గారు స్వయంగా విషెస్ చెప్పారని.. ఆయన అభిమానిగా ఈరోజును జీవితంలో మర్చిపోలేనని.. ఇది ఎంతో ప్రత్యేకంగా అంటూ థమన్ ట్విట్టర్ లో ఎమోషన్ అయ్యారు. ఈ అవకాశం ఇచ్చిన దర్శకుడు మోహన్ రాజాకు, చిరంజీవికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సినిమా రెగ్యులర్ సినిమా షూటింగ్ ఆగస్టు 13 నుంచి ప్రారంభం కాబోతోందని థమన్ తెలిపారు.
A day to Remember for life ❤️ We Completed Our Song for #Chiru153 that warm wishes from our dear #MEGASTAR @KChiruTweets gaaru himself 🎵♥️ Was Something Very Very Special to me As a biggest FAN boy 😍 thanks to @jayam_mohanraja
Shoot starts TOM 🎬 📢 @KonidelaPro
Godbless 😊 pic.twitter.com/DRVdp93f7V— thaman S (@MusicThaman) August 12, 2021