Prabhas: ఒక సినిమా చేయడానికి ఒక దర్శకుడు చాలా కష్టపడాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఆ కథకి సెట్ అయ్యే హీరోని సెలెక్ట్ చేయడంలోనే ఆ సినిమా సక్సెస్ అనేది ఆధారపడి ఉంటుంది. అందుకే మన దర్శకులు ఒక సినిమా తీయడానికి ఒక స్టోరీ ని రాసుకొని దానికి హీరోని ఎంచుకోవడానికి చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు.ఇక ఇలాంటి క్రమంలోనే చాలామంది దర్శకులు ఇలాంటి ప్రాబ్లం రాకూడదనే ఉద్దేశ్యం తోనే వాళ్ళు ముందుగానే ప్రభాస్ ని హీరోగా ఊహించుకొని కథలు రాసుకుంటున్నారు.
ఇక వాళ్ళు ఈ సినిమాని ప్రభాస్ తో తప్ప వేరే వాళ్ళతో చేయలేము అనే ఉద్దేశ్యం లో ఉంటున్నారు. ఒకవేళ వేరే వాళ్ళతో చేసిన ఈ ప్రాజెక్ట్ వాళ్ళకి సెట్ అవ్వదు అనే రేంజ్ లో ఊహించుకుంటున్నారు.ఇక ఈ క్రమం లో ప్రభాస్ తో సినిమా చేయడానికి ఎన్ని రోజులైనా వెయిట్ చేయడానికి మేము రెడీగా ఉన్నామంటూ ఇండియాలో ఉన్న స్టార్ డైరెక్టర్స్ అందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చేశారు. ప్రభాస్ మాత్రం ఎన్ని సినిమాలు అని చేస్తాడు. ఇక ఇప్పటికే కమిట్ అయిన సినిమాలను పూర్తి చేసే పనిలో ఉన్న ప్రభాస్ రీసెంట్ గా హను రాఘవ పూడి దర్శకత్వంలో కూడా ఒక సినిమాకి కమిట్ అయ్యాడు. ఇక ఇలాంటి పరిస్థితుల్లో తమిళ్ సినిమా డైరెక్టర్ అయిన మురుగదాస్ ప్రభాస్ కి ఒక కథ వినిపించాలని చూడగా, ప్రభాస్ దానికి నో చెప్పినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడున్న సినిమాలను పూర్తి చేయలంటేనే ప్రభాస్ కి మరో మూడు సంవత్సరాలు ఈజీగా పడుతుంది.
ఇక ఇలాంటి క్రమంలో మళ్లీ కొత్త సినిమాలను ఒప్పుకుంటే అవి ఎప్పటి వరకు ఫినిష్ చేస్తాడో ఆయనకి కూడా క్లారిటీ లేకుండా పోతుంది. కాబట్టి ప్రస్తుతం కమిట్ అయిన సినిమాలు ఫినిష్ అయిన తర్వాతే వేరే డైరెక్టర్ల కథలు వింటానని చెప్పినట్టుగా తెలుస్తుంది. ఇక ఈ విషయం లో మురుగదాస్ కొద్ది గా డిస్సాపాయింట్ అయ్యాడని తెలుస్తుంది. మరి ప్రభాస్ కోసం మురుగ దాస్ మూడు సంవత్సరాలు వెయిట్ చేస్తాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. మొత్తానికి అయితే ప్రభాస్ మురగదాస్ కి ఒక భారీ షాకిచ్చాడనే చెప్పాలి.
ప్రస్తుతం మురుగ దాస్ ఫెయిల్యూర్ లో ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఆయనకి అవకాశం ఇచ్చే హీరోలు కరువయ్యారు. దాంతో ప్రభాస్ ఐతే కథ నచ్చితే అవకాశం ఇస్తాడు కాబట్టి ప్రభాస్ కి తన కథను చెప్పి ఒప్పించాలని అనుకున్నాడు. కానీ ప్రస్తుతం ప్రభాస్ ఉన్న బిజీ షెడ్యూల్లో మురుగ దాస్ తో సినిమా చేయడం కష్టమనే చెప్పాలి…
Web Title: Murugadoss is shocked to prabhas reaction
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com