Ram Charan- Allu Arjun Multistarrer: ఈ మధ్య మల్టీస్టారర్ సినిమాల సందడి ఎక్కువైంది. ఒకప్పుడు ఒక స్టార్ హీరో.. మరో హీరోను కలిపి సినిమాలు తీసేవారు. కానీ ట్రెండ్ మారింది.. ఇప్పుడు ఇద్దరు స్థార్ హీరోలు ఒకేసారి వెండితెరపై కనిపిస్తున్నారు. దీనిని ఆల్రెడీ జక్కన్న ఫ్రూవ్ చేశాడు. రామ్ చరణ్, ఎన్టీఆర్ లు కలిసి ఆర్ఆర్ఆర్ లో కనిపించారు. సినిమా రిజల్ట్స్ ఎలా ఉన్నా ఫ్యాన్స్ కు మాత్రం గూస్ బంప్స్ తెప్పించాడు రాజమౌళి. ఇప్పుడు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ పరిశ్రమ షాక్ తినే మరో న్యూస్ చెప్పాడు. త్వరలో మెగా కంపెనీ నుంచి మల్టీస్టారర్ ఉండబోతుందని అంటున్నాడు. అలాగే టైటిల్ కూడా ఫిక్స్ చేశాడట. ఆ వివరాలేంటో చూద్దాం.

తెలుగు చిత్ర పరిశ్రమలోని అగ్రనిర్మాతల్లో అల్లు అరవింద్ ఒకరు. తండ్రి అల్లు రామలింగయ్య అండదండలతో ఇండస్ట్రీకి వచ్చిన ఆయన సక్సెస్ ఫుల్ నిర్మాతగా పేరు తెచ్చుకున్నారు. గీతా ఆర్ట్స్ ను స్ట్రాట్ చేసి ఆ బ్యానర్ పై ఎన్నో విజయవంతమైన సినిమాలు తీశాడు. ఆయన బ్యానర్ పై నిర్మించే సినిమాలు హిట్టు కొడుతాయని కొందరి దర్శకుల నమ్మకం. ఓ వైపు సినిమాలు తీస్తూనే ‘ఆహా’ అనే ఓటీటీ వేదికను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు అల్లు అరవింద్. ఈ నేపథ్యంలో ఆయన మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన విషయాలు బయటపెట్టారు.
ఇప్పటి వరకు ఇద్దరు వేర్వేరు స్టార్లను ఒకే వెండితెరపై చూశాం. కానీ త్వరలో ఇద్దరు మెగాస్టార్ వారసులు అంటే రామ్ చరణ్, అల్లు అర్జున్ లు ఒకేసారి సిల్వర్ స్క్రీన్ ను పంచుకోబోతున్నారట. మీరు ఫ్యూచర్లో ఇంకా ఎలాంటి సినిమాలు ఆశిస్తున్నారు..? అని కొందరు మీడియా ప్రతినిధులు అడగ్గా.. అల్లు అరవింద్ రిప్లై ఇస్తూ.. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అర్జున్, రామ్ చరణ్ కలిసి నటిస్తే బాగుంటుంది.. ఈ మల్టీ స్టారర్ మూవీకి పదేళ్ల కిందటే ‘నేను -చరణ్- అర్జున్ ’ అనే టైటిల్ అనుకున్నాం. ప్రతీ సంవత్సరం దానిని రెన్యూవల్ చేస్తూ వస్తున్నాం.. ఎప్పటికైనా వారితో కలిసి సినిమా చేస్తాం.. అని తెలిపారు.

గీతా ఆర్ట్స్ బ్యానర్ పై మెగాస్టార్ హీరోలే కాకుండా ఇతర హీరోలు నటించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఈ బ్యానర్ పై ఏకంగా ఇద్దరు మెగా వారసులు కనిపిస్తే ఫ్యాన్స్ కు పండుగ మాములుగా ఉండదు. ఇదివరకు వంశీ పైడిపల్లి తీసిన ‘ఎవడు’ అనే సినిమాలో అల్లు అర్జున్, బన్నీ ఇద్దరూ కనిపిస్తారు. కానీ ఒకేసారి కనిపించరు. ఇప్పుడు ఇద్దరు ఒకేసారి వెండితెరపై కనిపిస్తే థియేటర్లు దద్దరిల్లే అవకాశం ఉందని అనుకుంటున్నారు. అయితే ఎలాంటి కథను రెడీ చేస్తున్నారని కొందరు అడగగా.. ఇంకా అనుకోలేదని అల్లు అరవింద్ రిప్లై ఇచ్చారు. దీంతో ఈ సినిమా ఎలా ఉంటుందోనన్న ఆసక్తి నెలకొంది.