Mughal e azam
Mughal e Azam Movie : ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు చాలా వైవిద్య భరితమైన కథాంశాలతో సినిమాలు వస్తున్నాయి. అలాగే సూపర్ సక్సెసులుగా కూడా నిలుస్తున్నాయి. ఇలాంటి సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు వచ్చిన సినిమాల కంటే దీటుగా ఒకప్పుడు ఒక సినిమా వచ్చి భారీ వసూళ్లను సాధించిందనే విషయం మనలో చాలామందికి తెలియదు. నిజానికి ఇప్పుడు వేస్తున్న సెట్లు, అలాగే సినిమాకోసం క్రియేట్ చేస్తున్న అట్మాస్పియర్ ఇదివరకు ఎప్పుడూ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో చేయలేదని మనం చాలా సార్లు చెప్తూ వచ్చాం. కానీ 1960వ సంవత్సరం లోనే బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక దిగ్గజ చిత్రంగా వచ్చి ఇండస్ట్రీలో ఉన్న రికార్డులు మొత్తాన్ని తిరగరాసిందన్న విషయం మనలో చాలామందికి తెలియదు. ఆ సినిమా ఏంటంటే మొగల్ ఏ ఆజాం…
ఈ సినిమా 1960వ సంవత్సరంలో వచ్చిన ఈ సినిమా విజువల్ వండర్ గా తెరకెక్కింది. నిజానికి అప్పుడున్న టెక్నాలజీని వాడుకొని వాళ్లు అంత గొప్ప మ్యాజిక్ చేయడం అనేది నిజంగా ఒక గొప్ప విషయమనే చెప్పాలి. ఇంకా ఈ సినిమాలో దిలీప్ కుమార్, పృధ్విరాజ్ కపూర్, మధుబాల ప్రధాన పాత్రల్లో నటించారు. నిజానికి ఈ సినిమాలో లాహోర్ సెట్ వేసి మరి ఈ చిత్రాన్ని తీయడం అనేది అప్పట్లో ఒక పెను సంచలనాన్ని సృష్టించింది.
ఆ సెట్ వేయడానికి ఆ రోజుల్లోనే కోటి రూపాయల వరకు ఖర్చు చేశారు అంటే అప్పుడున్న దర్శకుడి యొక్క విజయం ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. ‘ప్యార్ కియా తో డర్నా క్యా’ అనే సాంగ్ కూడా ఈ సినిమాలోనిదే కావడం విశేషం…ఇక అప్పటినుంచి ఇప్పటివరకు కూడా ఈ సాంగ్ ఒక ఊపు ఉపేసిందనే చెప్పాలి. ఇక ఈ సాంగ్ ని రాసిన రచయిత అయిన షకీల్ బదాయుని ఈ పాటని దాదాపు 105 సార్లు ఎడిట్ చేస్తూ మరీ కొత్త వర్షన్స్ రాశారట. ఈ సినిమా దర్శకుడు అయిన నౌషాద్ కూడా ఈ సినిమాని చాలా బాగా తెరకెక్కించడానికి మొదటి నుంచి ప్రయత్నం చేస్తూ వచ్చాడు…
ఇక ఈ సినిమా సూపర్ సక్సెస్ గా నిలవడమే కాకుండా ఇండస్ట్రీ హిట్ గా కూడా మారడం అనేది అప్పట్లో ఒక పెను సంచలనాన్ని క్రియేట్ చేసింది. ఈ పాట ను లతా మంగేష్కర్ తో పాడించి ఇప్పుడు ఒక ట్రెండ్ సెట్టర్ గా నిలిపారు… ఇక ఇప్పుడు ఈ సినిమా ప్రేక్షకులు చూసినా కూడా ఈ సినిమా ఫిదా అయిపోతుంటారు వీలైతే మీరందరూ కూడా ఒకసారి ఈ సినిమాను చూడడానికి ప్రయత్నం చేయండి…
Velpula Gopi is a Senior Reporter Contributes Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
View Author's Full InfoWeb Title: Mughal e azam rs 1 crore to make 64 years ago this song lyrics written 105 times lata mangeshkar sing it