Mufasa The Lion King: 2019 వ సంవత్సరం లో విడుదలైన ‘ది లయన్ కింగ్’ చిత్రం హాలీవుడ్ బాక్స్ ఆఫీస్ తో పాటు, మన ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని కూడా షేక్ చేసి, సంచలనాత్మక వసూళ్లను రాబట్టిన సంగతి తెలిసిందే. కేవలం జామ్ కెమెరాన్ చిత్రాలకు, లేదు హాలీవుడ్ మర్వెల్ సూపర్ హీరోల సినిమాలకు మాత్రమే సాధ్యం అనుకున్న బిలియన్ డాలర్ల క్లబ్ లోకి ‘ఏనిమేషన్’ చిత్రం క్యాటగిరీ లో ఈ సినిమా నిలబడడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ చిత్రం సీక్వెల్ కోసం అభిమానులు చాలా కాలం నుండి ఎదురు చూసారు. వాళ్ళ ఎదురు చూపులకు తెరదించుతూ రీసెంట్ ‘ముఫాసా : ది లయన్ కింగ్’ చిత్రాన్ని ప్రకటించారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ సినిమా నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో విడుదలైంది. తెలుగు వెర్షన్ లో ‘ముఫాసా’ క్యారక్టర్ కి సూపర్ స్టార్ మహేష్ బాబు డబ్బింగ్ చెప్పిన సంగతి తెలిసిందే.
Babu Voice @urstrulyMahesh #Mufasa #MufasaTheLionKing pic.twitter.com/XSGNzVoeof
— Bandari Nikhil (@MBcultNikhil_06) December 19, 2024
ఆయన డబ్బింగ్ చెప్పిన తర్వాత ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో మంచి క్రేజ్ ఏర్పడింది. పలు చోట్ల ఆయన అభిమానులు కటౌట్స్, బ్యానర్స్ కూడా ఏర్పాటు చేసారు. ఇదంతా పక్కన పెడితే నిన్న రెండు తెలుగు రాష్ట్రాల్లో కొన్ని సెలెక్టివ్ స్క్రీన్స్ లో ఈ చిత్రానికి పైడ్ ప్రీమియర్ షోస్ వేశారు. ఈ ప్రీమియర్ షోస్ నుండి ట్విట్టర్ లో ఎలాంటి టాక్ వచ్చిందో ఒకసారి ఈ కథనం లో చూద్దాము. ఇది ఒక లైవ్ యానిమేషన్ చిత్రం. ఇందులో కనిపించే జంతువులన్నీ సహజం గా కనిపిస్తాయి. వాటిని మనం నిజ జీవితం లో ఎలా అయితే చూస్తామో, అదే విధంగా వెండితెర మీద కనిపిస్తాయి. అలాంటి జంతువులకు మన టాలీవుడ్ ఆర్టిస్టులు డబ్బింగ్ చెప్తే ఎంతో థ్రిల్లింగ్ గా ఉంటుంది కదూ. ఆ థ్రిల్లింగ్ అనుభూతిని ఈ చిత్రం ఆడియన్స్ కి థియేటర్స్ లో అందించింది.
‘ముఫాసా’ క్యారక్టర్ కి సూపర్ స్టార్ మహేష్ బాబు డబ్బింగ్ చెప్పగా, ‘పుంబా’ క్యారక్టర్ కి బ్రహ్మానందం, ‘టీమాన్’ క్యారక్టర్ కి కమెడియన్ అలీ వంటి వారు డబ్బింగ్ చెప్పారు. మహేష్ బాబు డబ్బింగ్ ‘గుంటూరు కారం’ చిత్రంలోని యాసని గుర్తు చేస్తుంది. కానీ ముఫాసా క్యారక్టర్ లో ఉన్నటువంటి ఎమోషన్స్ ని ఆయన చాలా చక్కగా తన గాత్రంతో ఎలివేట్ చేసాడని ఈ సినిమా ని చూసిన ఆడియన్స్ చెప్తున్నారు. అయితే చిత్రం మాత్రం పార్ట్ 1 రేంజ్ లో లేదని, చాలా స్లో స్క్రీన్ ప్లే ఉండడం వల్ల థియేటర్ లో ఉన్నంతసేపు బోర్ కొట్టిందని నెటిజెన్స్ అధిక శాతం అంటున్నారు. ఈ సినిమాకి నెగటివ్ టాక్ రావడంతో ఓవర్సీస్ లో ‘గేమ్ చేంజర్’ కి లైన్ క్లియర్ అయ్యినట్టే అని, ప్రీమియర్స్ కి భారీ షోస్ దొరుకుతాయని నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఒక్కసారి ట్విట్టర్ లో ఎలాంటి టాక్ ఉందో మీరే చూడండి.
Even Babu couldn’t save this.#MufasaTheLionKing https://t.co/p2hfQL8L4C pic.twitter.com/MlTL7y0AcP
— T @ रु ణ్ ! (@mass_boy1) December 19, 2024
#MufasaTheLionKing — Pointless prequel with no style or substance
Full review https://t.co/1fmmeDTMOB
✍️ @SammySamarth | (via @htcity)
— Hindustan Times (@htTweets) December 19, 2024
Review | Mufasa: The Lion King (2024)
“#MufasaTheLionKing is surprisingly brilliant. It is fun, visually stunning, and incredibly poignant, making it a welcome addition to the legacy of Pride Rock.” Read more:⤵️https://t.co/eW4nezdiMV
— Future Of The Force (@futureotforce) December 19, 2024
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
Read MoreWeb Title: Mufasa the lion king movie twitter review in telugu
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com