Mrunal Thakur And Anushka Sharma: పాన్ ఇండియా లెవెల్ లో యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్స్ లో ఒకరు మృణాల్ ఠాకూర్(Mrunal Thakur). సీరియల్ హీరోయిన్ గా కెరీర్ ని మొదలు పెట్టిన మృణాల్ ఠాకూర్, ఆ తర్వాత సినిమా హీరోయిన్ గా ఎదిగింది. బాలీవుడ్ లో ఉన్నంత కాలం హీరోయిన్ గా మీకు పెద్ద గుర్తింపు రాలేదు కానీ, టాలీవుడ్ లో మాత్రం ఆమెకి మంచి గుర్తింపు లభించింది. ‘సీతా రామం’ చిత్రం తో మన తెలుగు ఆడియన్స్ కి పరిచయమైన మృణాల్ ఠాకూర్, ఆ తర్వాత ‘హాయ్ నాన్న’ చిత్రం తో మరో భారీ బ్లాక్ బస్టర్ ని అందుకుంది. ఈ రెండు సినిమాల తర్వాత ఆమె విజయ్ దేవరకొండ తో చేసిన ‘ది ఫ్యామిలీ స్టార్’ కమర్షియల్ గా పెద్ద హిట్ కాకపోయినా, మృణాల్ ఠాకూర్ కి మాత్రం మొదటి రెండు సినిమాల ద్వారా వచ్చిన బ్రాండ్ ఇమేజ్ ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నది.
Also Read: అక్కడ ‘ఓజీ’ రిలీజ్ లేనట్టే..పవన్ కళ్యాణ్ అభిమానులకు చేదు వార్త!
అయితే ఈమధ్య కాలం లో ఈమె కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుంది. రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో ప్రముఖ ఇండియన్ క్రికెటర్ విరాట్ కోహ్లీ(Virat Kohli) సతీమణి, బాలీవుడ్ టాప్ హీరోయిన్స్ లో ఒకరైన అనుష్క శర్మ(Anushka Sharma) పై నోరు జారింది. ఆమె మాట్లాడుతూ ‘సల్మాన్ ఖాన్ సూపర్ హిట్ చిత్రం సుల్తాన్ లో హీరోయిన్ రోల్ ముందుగా నాకే వచ్చింది. కానీ అప్పటికీ నేను కొన్ని కారణాల చేత ఆ సినిమా చేయలేకపోయాను. దీంతో వేరే హీరోయిన్ ని ఆ సినిమాలోకి తీసుకున్నారు. కానీ ఇప్పుడు ఆమె సినిమాలు లేఖ ఖాళీగా ఉంది. నేను చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీ గా ఉన్నాను’ అంటూ చెప్పుకొచ్చింది. అనుష్క శర్మ పేరు బయటకు తీయకపోయినప్పటికీ కూడా పరోక్షంగా సుల్తాన్ మూవీ హీరోయిన్ అంటే అనుష్క శర్మ పేరునే వస్తుంది కాబట్టి, ఆమె పై మృణాల్ ఠాకూర్ ఏడుస్తుందని సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
మృణాల్ ఠాకూర్ కి ఇలా నోరు జారడం కొత్తేమి కాదు. గతం లో బిపాస బసుపై కూడా ఇలాగే నోరు పారేసుకుంది. ఈమె వ్యాఖ్యలపై బిపాస బసు రెస్పాన్స్ ఇస్తూ వ్యంగ్యంగా ఒక నవ్వు నవ్వి వదిలేసింది. కానీ ఆ విషయం లో నెటిజెన్స్ మాత్రం మృణాల్ ఠాకూర్ పై ఒక రేంజ్ లో మండిపడ్డారు. నెగిటివిటీ తట్టుకోలేకపోయిన మృణాల్ ఠాకూర్ చిన్నతనంతో తెలిసి తెలియక మాట్లాడానని, దయచేసి నన్ను క్షమించండి అంటూ నెటిజెన్స్ ని వేడుకుంది. ఈ ఘటన జరిగిన కొన్నాళ్లకే ఇప్పుడు ఆమె అనుష్క శర్మ పై నోరు జారింది. అనుష్క శర్మ సినిమాలకు దూరంగా ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్ మీదనే ఎక్కువగా పెడుతుంది. ఆమె సినిమాలు మీద ద్రుష్టి పెడితే మృణాల్ ఠాకూర్ కి వచ్చే ఒకటి రెండు సినిమాలు కూడా రావంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ మండిపడుతున్నారు.