Mrunal Thakur Peddi: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Global Star Ram Charan) హీరో గా నటిస్తున్న ‘పెద్ది'(Peddi Movie) చిత్రం గురించి సోషల్ మీడియా లో ఏ చిన్న అప్డేట్ వచ్చినా అభిమానులు పూనకాలు వచ్చి ఊగిపోతున్నారు. రామ్ చరణ్ ఫ్యాన్స్ కి , అదే విధంగా మెగా ఫ్యాన్స్ కి ఈ చిత్రం ఎంతో ప్రతిష్టాత్మకమైనది. ఎందుకంటే ఈ సినిమా పై అన్ని భాషల్లోనూ మంచి క్రేజ్ ఉంది. ‘చికిరి చికిరి’ పాట క్రియేట్ చేసిన హైప్ అలాంటిది మరీ. కేవలం నేషనల్ లెవెల్ లో మాత్రమే కాకుండా, ఇంటర్నేషనల్ లెవెల్ లో కూడా పాట వైరల్ అయ్యింది. ఈమధ్య కాలం లో ఏ సినిమాకు కూడా ఇలా జరగలేదు. అందుకే ఈ చిత్రం తో రామ్ చరణ్ వెయ్యి కోట్ల గ్రాస్ ని కొల్లగొడుతాడు అనే బలమైన నమ్మకం తో ఉన్నారు ఫ్యాన్స్. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఇప్పుడు అభిమానులకు మంచి కిక్ ని ఇస్తోంది.
ఈ చిత్రం లో ఒక మంచి మాస్ బీట్ ఉండే ఐటెం సాంగ్ ఒకటి ఉందట. ఈ పాట కోసం పలువురు స్టార్ హీరోయిన్లను సంప్రదించారట కానీ, చివరికి మృణాల్ ఠాకూర్ ని ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది. ఈ పాట చేస్తున్నందుకు ఆమెకు దాదాపుగా 4 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ఇస్తున్నారట. ముందుగా ఈ పాట కోసం శ్రీలీల ని సంప్రదించారు. ఇప్పటికే ‘పుష్ప 2’ లో చేసాను, అది నేషనల్ వైడ్ గా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆ తర్వాత నాకు చాలా ఐటెం సాంగ్స్ లో అవకాశాలు వచ్చాయి, కానీ నాకు చేయడం ఇష్టం లేక వదిలేసాను, ఈ ఐటెం సాంగ్స్ పై నాకు ఆసక్తి పోయింది అంటూ సమాధానం ఇచ్చిందట. ఇక ఆ తర్వాత పూజ హెగ్డే ని సంప్రదించారట. ఆమె చేయడానికి ఓకే కానీ, 7 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ అడిగిందట.
అందుకే చివరికి మృణాల్ ఠాకూర్ ని ఫైనల్ చేశారు. ‘రంగస్థలం’ చిత్రం సెకండ్ హాఫ్ కి ‘జిగేలు రాణి’ పాట చాలా పెద్ద హైలైట్ గా నిల్చింది. కథలో సరైన ప్లేస్ మెంట్ లో ఆ పాట పడడం తో థియేటర్ లో ఆడియన్స్ తెగ ఎంజాయ్ చేశారు. ఈ చిత్రం లో కూడా ఐటెం సాంగ్ ఆ రేంజ్ లో హైలైట్ అవుతుందని అంటున్నారు. ఈ పాటకు కూడా జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నాడట. సినిమాలో దాదాపుగా అన్ని పాటలకు ఆయనే కొరియోగ్రఫీ చేస్తున్నాడు. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ హాఫ్ ని ఎడిటింగ్ తో సహా లాక్ చేసాడట డైరెక్టర్ బుచ్చి బాబు. ఇప్పుడు ఆ ఫస్ట్ హాఫ్ సంగీత దర్శకుడు AR రెహమాన్ రీ రికార్డింగ్ వర్క్ ని మొదలు పెడుతాడట. అంతే కాకుండా త్వరలోనే ఈ సినిమా నుండి రెండవ పాట విడుదల కాబోతుంది అట.