Homeఎంటర్టైన్మెంట్Mrunal Thakur Comments On Dhanush: ధనుష్ లాంటి హీరోని నేను ఇప్పటి వరకు చూడలేదు...

Mrunal Thakur Comments On Dhanush: ధనుష్ లాంటి హీరోని నేను ఇప్పటి వరకు చూడలేదు – మృణాల్ ఠాకూర్

Mrunal Thakur Comments On Dhanush: గత కొంతకాలం గా సోషల్ మీడియా లో ధనుష్(Dhanush K Raja), మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) లపై వస్తున్న వార్తలను మనమంతా చూస్తూనే ఉన్నాం. వీళ్లిద్దరు ప్రేమించుకుంటున్నారని, ఒకే ఇంట్లో డేటింగ్ చేస్తున్నారని , త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అంటూ సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో ప్రచారం జరిగింది. అయితే మృణాల్ ఠాకూర్ పలు సందర్భాల్లో ఈ రూమర్స్ ఎవరు పుట్టించారో అర్థం కావడం లేదు, మా మధ్య అలాంటిదేమి లేదు అంటూ చెప్పుకొచ్చింది. కొన్ని ఇంటర్వ్యూస్ లో ఆమె ధనుష్ తనకు అన్న లాంటి వాడని కూడా కామెంట్స్ చేసిందంటూ వార్తలు వినిపించాయి కానీ అందుకు ఎలాంటి ఆధారాలు లేవు. అయితే రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో మృణాల్ ఠాకూర్ ధనుష్ గురించి చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.

ఆమె మాట్లాడుతూ ‘ ధనుష్ లాంటి హీరో ని నేను ఇప్పటి వరకు చూడలేదు. ఆయన నటించిన రాయన్, మారీ, రంజానా, కెప్టెన్ మిల్లర్, అసురన్ వంటి చిత్రాలను చూశాను. వాటిల్లో ఆయన నటనని చూసి పెద్ద ఫ్యాన్ అయిపోయాను. అసురన్ చిత్రాన్ని అయితే ఎన్ని సార్లు చూశానో లెక్కే లేదు. ఆయన కేవలం ఒక నటుడు మాత్రమే కాదు, గొప్ప దర్శకుడు, లిరిక్ రైటర్, డ్యాన్సర్, సింగర్ కూడా. ఒక మనిషిలో ఇన్ని టాలెంట్స్ ఉండడం చాలా అరుదు. ఒక రోజు నేను ఆయన హీరో గా నటిస్తున్న తేరే ఇష్క్ మెయిన్ షూటింగ్ స్పాట్ కి వెళ్ళాను. నేను చాలా క్యాజువల్ గా ఆయన్ని ఒక కోరిక కోరుతూ, నేను నటిస్తున్న ‘సన్ ఆఫ్ సర్దార్ 2 ‘ మూవీ కి స్పెషల్ స్క్రీనింగ్ జరగబోతుంది., అందుకు మీకు సమయం దొరికితే రాగలరా అని అడిగాను. వస్తాడని అసలు అనుకోలేదు, ఆస్కామత్తుగా మా ప్రీమియర్ షో కి ఆయన విచ్చేసి సప్రైజ్ కి గురి చేసాడు’ అంటూ చెప్పుకొచ్చింది మృణాల్ ఠాకూర్.

అయితే ఇదే మృణాల్ ఠాకూర్ గతం లో నేను స్పెషల్ స్క్రీనింగ్ కి ఆయన్ని ఆహ్వానించలేదు, అజయ్ దేవగన్ సార్ ఆహ్వానించాడు అని చెప్పుకొచ్చింది. గతం లో ఆమె చెప్పిన ఈ మాటలను నమ్మాలా?, లేదా నేడు చెప్పిన మాటలను నమ్మాలా?, దీనిని బట్టీ ధనుష్ తో రిలేషన్ గురించి కూడా ఆమె దాచిపెడుతూ అబద్దం చెప్తుందేమో అని సోషల్ మీడియాలో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular