Trivikram Srinivas- Star Heroes: త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంటి టాప్ మోస్ట్ డైరెక్టర్ తో సినిమాలు చేయాలని ప్రతి హీరోకి ఉంటుంది.. ఆయనతో సినిమాలు తీసి వేరే లెవెల్ కి వెళ్లిన హీరోలు ఎంతో మంది ఉన్నారు..పవన్ కళ్యాణ్ కి తిరుగులేని బ్లాక్ బస్టర్స్ రెండు ఇచ్చాడు..అల్లు అర్జున్ కి మూడు గుర్తుండిపోయ్యే సినిమాలు ఇచ్చాడు..ఎన్టీఆర్ లో ఊర మాస్ కోణాన్ని మరోసారి బయటకి తీసి ‘అరవింద సమేత’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ ని ఇచ్చాడు..మహేష్ బాబు కి అతడు , ఖలేజా వంటి క్లాసిక్స్ ఇచ్చాడు.

ఇలా చెప్పుకుంటూ పోతే తనతో సినిమాలు చేసిన ప్రతి స్టార్ హీరో కి జీవితాంతం గుర్తుంచుకునే సినిమాలు ఇచ్చాడు..కానీ ఇప్పుడు త్రివిక్రమ్ తో సినిమాలు చెయ్యాలంటే మన స్టార్ హీరోలు వణికిపోతున్నారు..ఎందుకంటే ఆయనతో సినిమాలు తీస్తే ఇంట్లో ఎవరో ఒకరు చనిపోతారు అనే సెంటిమెంట్ పట్టుకుంది..జరిగిన సంఘటనలన్నీ చూస్తూ ఉంటే ఆ సెంటిమెంట్ నిజమేనేమో అని అనిపిస్తుంది.
పవన్ కళ్యాణ్ తో త్రివిక్రమ్ చేసిన తొలి సినిమా ‘జల్సా’..అప్పట్లో ఈ సినిమా ఇండస్ట్రీ రికార్డ్స్ అన్నిటిని తిరగరాసింది..కానీ ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయం లోనే పవన్ కళ్యాణ్ తండ్రి వెంకటరావు చనిపోయారు..తండ్రి మరణం నుండి పవన్ కళ్యాణ్ కోలుకోవడానికి చాలా సమయమే పట్టింది..కొంతకాలం గ్యాప్ తీసుకొని మిగిలిన షూటింగ్ పార్ట్ ని పూర్తి చేసాడు పవన్ కళ్యాణ్..ఇక జూనియర్ ఎన్టీఆర్ తో ‘అరవింద సమేత వీరరాఘవ’ సమయం లో ఎన్టీఆర్ తండ్రి హరి కృష్ణ రోడ్డు ప్రమాదం లో మృతి చెందాడు..ఎన్టీఆర్ ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తండ్రి హరి కృష్ణని తలచుకొని ఏడుస్తూ మాట్లాడడం ఇప్పటికి మనం మరచిపోలేము..ఇప్పుడు రీసెంట్ గా మహేష్ బాబు – త్రివిక్రమ్ కాంబినేషన్ లో మూడవ సినిమా ప్రారంభం అయ్యింది.

మొదటి షెడ్యూల్ పూర్తి అవ్వగానే మహేష్ తల్లి ఇందిరా దేవి గారు కన్నుమూశారు..ఇక రేపో మాపో రెండవ షెడ్యూల్ ప్రారంభం అవుతుంది అనుకునేలోపు తండ్రి కృష్ణ కన్నుమూశారు..ఆ కుటుంబం ఎంత బాధలో ఉందొ ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.. అయితే ఇదంతా యాదృశ్చికంగా జరిగిందే. త్రివిక్రమ్ తో వారి ఇంట్లో మరణాలకు ఎలాంటి సంబంధం లేదు. కానీ ఈ సెంటిమెంట్ టాలీవుడ్ లో జోరుగా ప్రచారం సాగుతోంది. రాబొయ్యే రోజుల్లో త్రివిక్రమ్ తో సినిమాలు చెయ్యడానికి కాస్త భయపడుతున్న పరిస్థితి ఉంటుందని అంటున్నారు. మన హీరోలు.