https://oktelugu.com/

OTT Movies : ఓటీటీ లవర్స్ కోసం మైండ్ బ్లోయింగ్ కంటెంట్.. ఈ వారం హాట్ స్టార్, ప్రైమ్, నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కానున్న సిరీస్లు/ సినిమాలు!

క్రైమ్ థ్రిల్లర్ మాన్స్టర్స్ నెట్ఫ్లిక్స్ లో సెప్టెంబర్ 19 నుండి స్ట్రీమ్ అవుతుంది. నికోలస్ చావెజ్, కూపర్ కోచ్ ప్రధాన పాత్రలు చేశారు. ఆద్యంతం ఆసక్తిరేపే మలుపులు, యాక్షన్ ఎపిసోడ్స్ తో మాన్స్టర్స్ సాగుతుంది.

Written By:
  • S Reddy
  • , Updated On : September 19, 2024 / 12:54 PM IST

    OTT Movies

    Follow us on

    OTT Movies  : వారాంతం వచ్చిందంటే ఓటీటీ ప్రియులకు పండగే. అదిరిపోయే కంటెంట్ అందుబాటులోకి వస్తుంది. ఈ వారం మరింత ప్రత్యేకం. ప్రముఖ డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్, హాట్ స్టార్, జియో సినిమాలో అలరించే సినిమాలు, సిరీస్లు స్ట్రీమింగ్ కి సిద్ధమయ్యాయి.

    తలైవెట్టియాన్ పాల్యం

    హిందీలో సక్సెస్ అయిన పంచాయత్ సిరీస్ కి రీమేక్ గా తెరకెక్కింది తలైవెట్టియాన్ పాల్యం. ఈ సిరీస్ గ్రామంలో ఓ యువకుడు ఎదుర్కొన్న సవాళ్ల నేపథ్యంలో తెరకెక్కింది. హ్యూమరస్ గా సాగే సోషల్ సబ్జెక్టు అని చెప్పొచ్చు. సెప్టెంబర్ 20 నుండి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ కానుంది.

    హిజ్ త్రీ డాటర్స్

    హాలీవుడ్ మూవీ హిజ్ త్రీ డాటర్స్ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కి సిద్ధమైంది. క్యారీ కూన్, నటాషా లయోని, ఎలిజబెత్ ప్రధాన పాత్రలు చేశారు. హిజ్ త్రీ డాటర్స్ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా. అనారోగ్యంతో బాధపడుతున్న తండ్రి బాధ్యత తీసుకున్న ముగ్గురు కూతుళ్ళ కథ. సెప్టెంబర్ 20 నుండి స్ట్రీమ్ కానుంది.

    డార్క్నెస్: ఆగత ఆల్ అలాంగ్

    మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగమైన వన్దా విజన్ భాగంగా డార్క్నెస్: ఆగత ఆల్ అలాంగ్ తెరకెక్కింది. ఈ సూపర్ హీరో డ్రామా హాట్ స్టార్ లో స్ట్రీమ్ సెప్టెంబర్ 19 నుండి స్ట్రీమ్ అవుతుంది. యాక్షన్ లవర్స్ కి ఫీస్ట్ అని చెప్పొచ్చు.

    మాన్స్టర్స్

    క్రైమ్ థ్రిల్లర్ మాన్స్టర్స్ నెట్ఫ్లిక్స్ లో సెప్టెంబర్ 19 నుండి స్ట్రీమ్ అవుతుంది. నికోలస్ చావెజ్, కూపర్ కోచ్ ప్రధాన పాత్రలు చేశారు. ఆద్యంతం ఆసక్తిరేపే మలుపులు, యాక్షన్ ఎపిసోడ్స్ తో మాన్స్టర్స్ సాగుతుంది.

    ది పెంగ్విన్

    బ్యాట్ మెన్ సిరీస్ నటుడు కాలిన్ ఫరెల్ నటించిన యాక్షన్ అండ్ క్రైమ్ డ్రామా ది పెంగ్విన్. హెచ్బిఓ ఒరిజినల్ మాక్స్ లో సెప్టెంబర్ 20 నుండి స్ట్రీమ్ అవుతుంది.

    ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో

    ది గ్రేట్ ఇండియన్ కపిల్ షోకి ఉన్న ఆదరణ గురించి తెలిసిందే. సీజన్ 2 నెట్ఫ్లిక్స్ లో సెప్టెంబర్ 21నుండి స్ట్రీమ్ కానుంది. దేవర ప్రమోషన్స్ లో భాగంగా ఎన్టీఆర్ కపిల్ షోలో పాల్గొననున్నారు. నెట్ఫ్లిక్స్ లో ఈ టాక్ షో ప్రసారం కానుంది.

    జో తేరా హై ఓ మేరా హాయ్

    హిందీ చిత్రం జో తేరా హై ఓ మేరా హై జియో సినిమాలో సెప్టెంబర్ 21 నుండి స్ట్రీమ్ కానుంది. ఈ కామెడీ డ్రామాలో పరేష్ రావల్, అమిత్ సియాల్ రాజ్ త్రివేది దర్శకుడు.