Samantha: బ్యూటిఫుల్ సమంత.. హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి తెలుగు, తమిళ్ చిత్ర పరిశ్రమలో సక్సెస్ ఫుల్ హీరోయిన్‌గా పదేళ్లు పూర్తి చేసుకుంది. ప్రజెంట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్సే కాదు ఇంటర్నేషనల్ ఫిల్మ్స్‌లోనూ లీడ్ రోల్ ప్లే చేస్తోంది. ఈ సందర్భంగా సమంతను హీరోయిన్‌గా ఇండస్ట్రీ నిలబెట్టి ఆమె కెరీర్‌లో హైలైట్‌గా నిలిచిన చిత్రాల గురించి తెలుసుకుందాం.
26 ఫిబ్రవరి 2010 న సమంత నాగచైతన్య హీరోగా తెరెక్కిన ‘ఏ మాయ చేసావే’ చిత్రంలో కథానాయికగా నటించింది. ఈ చిత్రం తర్వాత ఈ భామ వెనక్కి తిరిగి చూసుకోలేదు. నటిగా పదేళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుని ఇంకా ముందుకు సాగుతోంది. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఏ మాయ చేసావే’ చిత్రంతో ప్రేక్షకులను మాయ చేసి తన వైపునకు తిప్పుకుంది. అందం, అభినయంతో ప్రేక్షకుల మెప్పు పొంది, అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది.
Also Read: ప్చ్.. క్లాసికల్ హీరోయిన్ కి కూడా కరోనా పాజిటివ్ !
సూపర్ స్టార్ మహేశ్ బాబు ‘దూకుడు’ సినిమా సమంతను స్టార్ హీరోయిన్‌గా నిలబెట్టింది. ఇందులో సెటిల్డ్ పర్ఫార్మెన్స్‌తో సమంత అదరగొట్టేసింది. ఆ తర్వాత యాక్షన్ అండ్ థ్రిల్లర్ ఎంటర్ టైనర్ ‘ఈగ’లోనూ సమంత మెరిసింది. దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన ఈ ఫిల్మ్‌లో సమంత ఫిమేల్ లీడ్ రోల్ ప్లే చేసింది. ఇకపోతే సమంతను ఫ్యామిలీ ఆడియన్స్‌కు దగ్గర చేసిన మూవీ..‘సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు’ అని చెప్పొచ్చు. ఇందులో అల్లరి పిల్లగా కనిపించింది. ఇక ‘మనం’ సినిమాతో సమంత.. తనలోని మరో నట కోణాన్ని చూపించింది. ఈ చిత్రంలో సమంతది ది బెస్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్‌లో రెండు చిత్రాల్లో నటించింది ఈ సుందరి. ‘సన్నాఫ్ ఆఫ్ సత్యమూర్తి, అ ఆ’ చిత్రాల్లో ఫిమేల్ లీడ్ రోల్ ప్లే చేసి.. మంచి పేరు సంపాదించుకుంది సమంత. ‘రంగస్థలం’ చిత్రంలో విలేజ్ బ్యాక్ డ్రాప్ రోల్ ప్లే చేసిన సమంత.. ‘ఓ బేబి’ చిత్రంలో మోడ్రన్ గర్ల్‌గా అంటూనే ఎమోషన్స్‌ను పండించింది. ‘మజిలీ’లోనూ సమంత చాలా చక్కగా నటించింది.