https://oktelugu.com/

Tollywood Disaster Movies: టాలీవుడ్ లో అత్యంత నష్టాలను మిగిల్చిన సినిమాలు

మహేష్ బాబు వంటి అగ్ర కథానాయకుడు, సూపర్ హిట్ డైరెక్టర్ మురుగదాస్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం స్పైడర్. ఈ సినిమా విడుదలకు ముందు ఈ సినిమా పై ఎన్నో అంచనాలు ఉన్నాయి.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : August 5, 2023 / 11:50 AM IST

    Tollywood Disaster Movies

    Follow us on

    Tollywood Disaster Movies: స్టార్ హీరోలపై, దర్శకులపై ఉన్న నమ్మకంతో టాలీవుడ్ లో వచ్చిన భారీ బడ్జెట్ సినిమాలు ఎన్నో. కానీ ఈ సినిమాలన్నీ హిట్టయ్యాయా.. అంతే తప్పకుండా లేదు అనే చెప్పాలి. కొన్ని సినిమాలు మంచి హిట్ సాధించగా మరికొన్ని సినిమాలు పరాజయం పాలై అత్యంత నష్టాలను మిగిల్చాయి. ఆ విధంగా భారీ బడ్జెట్ భారీ ఎక్స్పెక్టేషన్స్ మధ్య వచ్చి భారీ నష్టాలు చవిచూసిన సినిమాలు ఇవి :

    రాధేశ్యామ్

    ప్రభాస్ కెరియర్ లోనే కాదు టాలీవుడ్ కెరియర్ లో కూడా అత్యంత భారీ అపజయాన్ని చవిచూసిన చిత్రం రాధేశ్యామ్. బాహుబలి, సాహో చిత్రాల తర్వాత పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ పొందిన ప్రభాస్ నుంచి వచ్చే చిత్రం అవ్వటంతో రాదే శ్యామ్ పైన భారీ అంచనాలు ఉనిన్నాయి. అంతేకాదు ఈ అంచనాలు అందుకోవటానికి బడ్జెట్ కూడా విపరీతంగా పెట్టారు. అయితే ఈ బడ్జెట్ సినిమాకి పెద్ద శాపంగా మారింది. విడుదలైన మొదటి రోజు నుంచే ఫ్లాప్ టాక్ ను సొంతం చేసుకున్న ఈ చిత్రం బడ్జెట్ లో సగం కూడా రికవరీ చెయ్యలేక చతికిలపడింది. ఈ సినిమా దాదాపు 120 కోట్ల నష్టాన్ని తెచ్చిపెట్టింది అని అంచనా.

    శక్తి

    యమదొంగ, అదుర్స్, బృందావనం వంటి విజయాల తర్వాత జూనియర్ ఎన్టీఆర్ నుంచి భారీ ఎక్స్పెక్టేషన్స్ మధ్య విడుదలైన చిత్రం శక్తి. దర్శకుడు మెహర్ రమేష్ తెరకెక్కించిన ‘శక్తి’ టాలీవుడ్ బడా ప్లాప్స్ లో ఒకటిగా నిలిచింది. భారీ బడ్జెట్ తో అశ్వినీ దత్ ఈ చిత్రాన్ని నిర్మించగా ఈ సినిమా ఆయనకు దాదాపు 25 కోట్ల నష్టాన్ని మిగిల్చింది.

    స్పైడర్

    మహేష్ బాబు వంటి అగ్ర కథానాయకుడు, సూపర్ హిట్ డైరెక్టర్ మురుగదాస్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం స్పైడర్. ఈ సినిమా విడుదలకు ముందు ఈ సినిమా పై ఎన్నో అంచనాలు ఉన్నాయి. కానీ విడుదలైన తరువాత అంచనాల్ని తలకిందులు చేస్తూ ఈ చిత్రం దాదాపు 20 కోట్ల నష్టాన్ని తెచ్చిపెట్టింది.

    రెబల్

    ప్యాన్ ఇండియా హీరో కాకముందు ప్రభాస్ కెరియర్ లో అత్యంత ఘోర పరాజయం చేసిన సినిమా రెబల్. లారెన్స్ దర్శకత్వంలో ప్రభాస్, కృష్ణంరాజు కలిసి నటిస్తున్నారు అని తెలియగానే తెలుగు ప్రేక్షకులు ఈ చిత్రం పైన మంచి ఎక్స్పెక్టేషన్స్ పెంచుకున్నారు. ఇక ఈ చిత్రంలో దీక్ష శెట్ అలానే తమన్నా హీరోయిన్ గా నటించారు. అయితే ఇవేవీ కానీ ఈ సినిమాని ఫ్లాప్ నుంచి తప్పించలేకపోయాయి.

    ఇక ఇవి కాకుండా అజ్ఞాతవాసి, బ్రహ్మోత్సవం, అఖిల్, తుఫాన్ వంటి చిత్రాలు కూడా మంచి అంచనాల మధ్య విడుదలై టాలీవుడ్ లో భారీ అపజయాన్ని మూట కట్టుకున్నాయి.