Flop Movies In Theaters: చాలా మూవీస్ భారీ అంచనాలతో థియేటర్స్‌లో రిలీజ్ అవుతాయి. కానీ ఫ్లాప్ టాక్ ను సొంతం చేసుకుంటాయి. అవే మూవీస్ టీవీ ఛానళ్లలో వచ్చినప్పుడు మాత్రం సూపర్ హిట్ మూవీలా అనిపిస్తుంది. మరి థియేటర్స్‌లో ఎందుకు ఫ్లాప్ అయిందనే డౌట్ మనకు వస్తుంది. ఇందుకు చాలా కారణాలున్నాయి. మూవీ మీద చాలా అంచానాలు పెట్టుకుని థియేటర్స్‌కు పోవడం, మూవీ కాన్సెప్ట్ ను అర్థం చేసుకునే స్థాయి ఆడియన్స్‌కు రాకపోవడం. వీటి వల్ల కొన్ని మూవీలో థియేటర్స్‌లో ఫ్లాప్ గా నిలిచినా.. టీవీ ఛానెళ్లలో హిట్ టాక్ సొంతం చేసుకున్నాయి. అందులో కొన్నింటి గురించి తెలుసుకుందాం.
1997లో రాజశేఖర్, ప్రేమ కాంబినేషన్ లో వచ్చిన ఓంకారం మూవీ. ఇది కూడా దాదాపుగా అర్జున్ రెడ్డి లాంటి మూవీనే. కానీ అప్పట్లో ఈ మూవీ యావరేజ్ టాక్ ను సొంతం చేసుకుంది. మొన్న వచ్చిన అర్జున్ రెడ్డి, ఆర్ఎక్స్ 100 మూవీల కలయికే ఓంకారం అని చెప్పొచ్చు. కానీ అప్పట్లో ఈ మూవీని అర్థం చేసుకునే స్థాయి ఆడియన్స్‌కు లేకపోవడంతో ఈ మూవీ ఫ్లాప్‌గా నిలిచింది.
మగధీర మూవీ తర్వాత ఇక రాంచరణ్ తేజ్ భారీ అంచనాల మీద వచ్చిన ఆరెంజ్. ఒకరిపై లవ్ కొంతకాలమే ఉంటుందనే కాన్సెప్ట్ తో వచ్చిన ఈ మూవీకి ఆడియన్స్ సరిగ్గా కనెక్ట్ కాలేకపోయారు. మగధీర మూవీ తర్వాత ఈ మూవీ రావడంతో రామ్ చరణ్ తేజ్ ను ఆడియన్స్ ఎక్కడో ఊహించుకోవడం వల్ల ఈ మూవీ ఫ్లాప్ టాక్‌ను సొంతం చేసుకుంది. నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్ మూవీని చూసినప్పుడల్లా ఆడియన్స్ కు తమ స్కూల్, కాలేజ్ డేస్ గుర్తు చేసుకుంటారు.
Also Read: ఎన్ని కోట్లిచ్చిన ఆ పని చేయబోమంటున్న ఈ సినీ తారలు మీకు తెలుసా?
కానీ ఈ మూవీ సైతం థియేటర్స్‌లో ఆడలేకపోయింది. ఇక ఖలేజా మూవీ ఎందుకు ఫ్లాప్ అయిందో ఎవరికీ అర్థం కావడం లేదు. ఈ కాన్సెప్ట్ ఆడియన్స్ మైండ్‌కు ఎక్కలేదు. ఇక ఇలాంటి మూవీనే వేదం. అల్లుఅర్జున్ కు తన మూవీస్‌లో వేదం మూవీ చాలా ఇష్టమని ఆలోచించకుండా చెబుతాడు. బన్నీతో పాటు అనుష్క, మనోజ్ మనసుపెట్టి యాక్ట్ చేశారు. కానీ ఈ మూవీ కలెక్షన్స్ పరంగా యావరేజ్ టాక్ ను సొంతం చేసుకుంది.
Also Read: వేశ్యగా మారబోతున్న సీనియర్ యాంకర్ !