https://oktelugu.com/

Movie Stars: ఎన్ని కోట్లిచ్చిన ఆ పని చేయబోమంటున్న ఈ సినీ తారలు మీకు తెలుసా?

Movie Stars: చాలా మంది తారలు ప్రస్తుతం..సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే పలు ప్రొడక్ట్స్‌కు బ్రాండ్ అంబాసిడర్స్‌గా వ్యవహరిస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నారు. తమ బ్రాండ్ వాల్యూను పెంచుకోవడంతో పాటు కార్పొరేట్ కంపెనీల రెవెన్యూ పెంచే ప్రయత్నాలూ చేస్తున్నారు. అలా తమకు కూడా అవకాశాలు వచ్చినప్పటికీ ఈ సినీ తారలు మాత్రం తమకు ఆ అవసరం లేదని అంటున్నారు. ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చినా తాము యాడ్స్‌లో నటించబోమని చెప్తున్నారు. వారు ఎవరెవరంటే.. […]

Written By: , Updated On : January 22, 2022 / 12:10 PM IST
Follow us on

Movie Stars

Sai Pallavi

Movie Stars: చాలా మంది తారలు ప్రస్తుతం..సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే పలు ప్రొడక్ట్స్‌కు బ్రాండ్ అంబాసిడర్స్‌గా వ్యవహరిస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నారు. తమ బ్రాండ్ వాల్యూను పెంచుకోవడంతో పాటు కార్పొరేట్ కంపెనీల రెవెన్యూ పెంచే ప్రయత్నాలూ చేస్తున్నారు. అలా తమకు కూడా అవకాశాలు వచ్చినప్పటికీ ఈ సినీ తారలు మాత్రం తమకు ఆ అవసరం లేదని అంటున్నారు. ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చినా తాము యాడ్స్‌లో నటించబోమని చెప్తున్నారు. వారు ఎవరెవరంటే..

Movie Stars

Nandamuri Balakrishna

టాలీవుడ్ సీనియర్ హీరో.. నటసింహం నందమూరి బాలకృష్ణ ఇప్పటి వరకు ఒక్క కమర్షియల్ యాడ్ లో నటించలేదు. జనాలకు ఉపయోగపడే యాడ్స్ లో మాత్రమే తాను నటిస్తానని బాలయ్య చెప్పారు. మరో సీనియర్ హీరో.. డైలాగ్ కింగ్ మోహన్ బాబు.. యాడ్స్‌లో నటించేందుకుగాను నో చెప్పాడు. తాను యాడ్స్ లో అస్సలు నటించబోనని అన్నాడట. చాలా కాలం కిందట కొందరు కార్పొరేట్ కంపెనీల ప్రతినిధులు రిక్వెస్ట్ చేసినప్పటికీ ఆయన నో చెప్పారట. నందమూరి వారి హీరో కల్యాణ్ రామ్ కూడా యాడ్స్‌లో నటించకూడదని నిర్ణయించుకున్నారు.

Movie Stars

Mohan Babu

సీనియర్ హీరోయిన్ గౌతమి..సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్. ఈమె కూడా కమర్షియల్ యాడ్స్ లో నటించడానికి నో చెప్పింది. సహజ నటిగా పేరుగాంచిన వర్ధమాన హీరోయిన్ సాయిపల్లవి కూడా యాడ్స్ కు నో చెప్పింది. సినిమాల్లో సహజ నటనకు ప్రాధాన్యత నిస్తుంది ఈ సుందరి. ఇటీవల ఆమెను ఫెయిర్ నెస్ క్రీమ్ వాళ్లు యాడ్ చేయాలని కోరగా, అందుకు ఆమె నో చెప్పింది.

Also Read: వేశ్యగా మారబోతున్న సీనియర్ యాంకర్ !

Movie Stars

Senior Actress Gautami

మంచు మోహన్ బాబు తనయులు విష్ణు, మనోజ్ లు కూడా యాడ్స్ కు నో చెప్పారు. ‘అల్లరి’ నరేశ్ కూడా కమర్షియల్ యాడ్స్ చేసేందుకుగాను నిరాకరించాడు. మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కూడా కమర్షియల్ యాడ్స్ కు నో చెప్పాడు. ఇకపోతే ఈ తారలు జనాలకు అవసరమయ్యే యాడ్స్ జన హితం కోసం చేస్తే మాత్రం తప్పకుండా అందులో నటిస్తామని చెప్తుండటం విశేషం.

Movie Stars

Sai Dharam Tej

Also Read: ఈ హీరోయిన్స్‌కు వారి తల్లులే నరకం చూపించార‌ట‌.. ఆస్తి కోసం ఇంత దారుణమా..!

Tags