Actor Naresh Wife Cheating: తెలుగు సీనియర్ సినీ నటుడు నరేష్ మాజీ భార్య రమ్య రఘుపతిపై గచ్చిబౌలి పీఎస్‌లో కేసు నమోదైంది. నరేష్ పేరుతో డబ్బులు వసూలు చేస్తూ ఘరానా మోసాలకు పాల్పడ్డ ఈ కిలాడీ లేడిపై… ఐదుగురు మహిళలు ఇచ్చిన ఫిర్యాదుతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

హిందూపూర్, అనంతపూర్, హైదరాబాద్ లో భారీగా డబ్బు వసూలు చేసినట్టు రమ్యపై అనేక ఆరోపణలు ఉన్నాయి. నరేష్ కు చెందిన ఆస్తులను చూపుతూ, ఈ ఆస్తులు తనకే చెందుతాయని వారిని నమ్మబలికి చాలా మంది నుంచి ఆమె డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలు వున్నాయి.
కాగా నరేష్ కు రమ్య రఘుపతి 3వ భార్య. మాజీ మంత్రి రఘువీరారెడ్డి తమ్ముడి కుమార్తె అయిన రమ్యతో ఎనిమిదేళ్ల క్రితం నరేష్‌తో వివాహం జరిగింది. గత కొంత కాలంగా వీరు దూరంగా ఉంటున్నట్టు తెలుస్తోంది.
Also Read: భారీ స్కాంలో సీనియర్ నటుడు నరేష్ మాజీ భార్య.. అసలు ఆమె ఏం చేసిందో తెలుసా?
ఇక ఈ ఘటనపై స్పందించిన నరేష్ నాకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. తన దాంపత్య జీవితంలో ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో గత కొంత కాలంగా దూరంగా ఉంటున్నామని.. రమ్మతో వివాహం అనంతరం ఇలాంటి వ్యవహారాలతోనే గతంలో చాలా ఇబ్బందులు పడ్డానని.. అందుకే దూరమయ్యానని తెలిపారు నరేష్.
-నటుడు నరేష్ మాజీ భార్యపై కేసు నమోదు
నరేష్ పేరుతో డబ్బులు వసూలు చేస్తూ మోసాలకు పాల్పడుతున్న రమ్మ రఘుపతిపై ఐదుగురు బాధితుల ఫిర్యాదుతో గచ్చిబౌలి పీఎస్‌లో కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై స్పందించిన నరేష్ ఈ వ్యవహారంలో తనకు ఎలాంటి సంబంధం లేదంటూ స్పష్టం చేశారు.
Also Read: అక్కడమ్మాయి.. ఇక్కడ అబ్బాయి నుంచి భీమ్లానాయక్ వరకూ.. పవన్ ‘పవర్’ ఎంత?
Recommended Video:
[…] Actor Naresh Ex Wife: హైదరాబాద్‌లో మరో భారీ స్కాం వెలుగు చూసింది. ఇప్పటికే కిట్టీ పార్టీల పేరుతో సంపన్న మహిళలను టార్గెట్ చేసుకుని కోట్లు కొల్లగొట్టిన శిల్పా చౌదరి ఉదంతం బయటపడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే తరహాలో పోలీసుల విచారణలో మరో స్కాం బహిర్గతమైంది. సీనియర్ నటుడు నరేష్ మాజీ భార్య రమ్య రఘుపతి అనేక మందిని మోసం చేసి డబ్బులు కూడబెట్టినట్లు తెలుస్తోంది. […]