https://oktelugu.com/

Rajamouli Modern Masters Review: అనామకుడి నుంచి ఆస్కార్ లెవల్ దాకా… రాజమౌళి ‘మోడ్రన్ మాస్టర్స్’ డాక్యుమెంటరీ రివ్యూ…

బాలీవుడ్ డైరెక్టర్ అయిన రాజేష్ ఖన్నా నెట్ ఫ్లిక్స్ వాళ్ళతో కలిసి 'మోడ్రన్ మాస్టర్స్' అనే పేరుతో రాజమౌళికి సంబంధించిన ఒక డాక్యుమెంటరీని తెరకెక్కించాడు. నిజానికి రాజమౌళి గురించి మనందరికీ సినిమాల పరంగా తెలుసు...

Written By:
  • Neelambaram
  • , Updated On : August 3, 2024 12:00 pm
    Modern Masters Rajamouli Review

    Modern Masters Rajamouli Review

    Follow us on

    Rajamouli Modern Masters Review: తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న డైరెక్టర్ రాజమౌళి… ఈయన తనదైన రీతిలో వరుస సక్సెస్ లను అందుకుంటు ముందుకు సాగుతున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన చేసిన ప్రతి సినిమా కూడా సూపర్ సక్సెస్ అవ్వడమే కాకుండా ఇండియాలోనే తనలాంటి దర్శకుడు మరొకరు లేరు అనేంతలా మంచి గుర్తింపును అయితే సంపాదించుకున్నాడు. ఇక ఇదిలా ఉంటే బాలీవుడ్ డైరెక్టర్ అయిన రాజేష్ ఖన్నా నెట్ ఫ్లిక్స్ వాళ్ళతో కలిసి ‘మోడ్రన్ మాస్టర్స్’ అనే పేరుతో రాజమౌళికి సంబంధించిన ఒక డాక్యుమెంటరీని తెరకెక్కించాడు. నిజానికి రాజమౌళి గురించి మనందరికీ సినిమాల పరంగా తెలుసు…కానీ ఆయన వ్యక్తిగత జీవితంలో ఎలా ఉంటాడు ఒక సినిమా తీయడానికి ఎన్ని కష్టాలు పడతాడు. ఆ సినిమా పర్ఫెక్షన్ కోసం తన టీమ్ తో ఎంత సేపు డిస్కస్ చేస్తాడు. షూటింగ్ స్పాట్లో ఎలా ఉంటాడు అనే ఇతర విషయాలను తను చెప్పే ప్రయత్నం అయితే చేశాడు. ఇక దానికోసం కే రాఘవేంద్రరావు, కీరవాణి, రమా రాజమౌళి, ప్రభాస్, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లాంటి వాళ్ళ సహాయం తీసుకొని వాళ్ల నుంచి కొంత ఇన్ఫర్మేషన్ ను కూడా తీసుకున్నాడు. ఇక నిజానికి ఆయనకు సంబంధించిన స్టోరీని కనుక్కొని దాన్ని విజువల్ గా డాక్యుమెంటరీ రూపంలోకి తీసుకురావాలంటే చాలా కష్టం అయినప్పటికీ, రాజేష్ ఖన్నా ఆ ప్రయత్నాన్ని సక్సెస్ ఫుల్ గా చేశారనే చెప్పాలి. దీంట్లో ప్రధానంగా ఆయన శాంతినివాసం సీరియల్ చేస్తున్న సమయంలో ఎలా స్ట్రగుల్ అయ్యారు. సినిమాలు తీయాలి అనుకునే ఆయన మొదట సీరియల్ తీసి అది సక్సెస్ అయ్యాక అప్పుడు సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. ఇక స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో సూపర్ సక్సెస్ ని అందుకున్న ఆయన మగధీర, ఈగ లాంటి గ్రాఫికల్ సినిమాలతో తనను తాను ఎప్పటికప్పుడు మౌల్డ్ చేసుకున్న విధానాన్ని కూడా దీంట్లో డిస్కస్ చేశారు.

    ఒక సినిమాని ఆయన ఎలా చేస్తాడు. ఆడియెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లో స్క్రిప్ట్ ని ఆలోచించినప్పుడు దాంట్లో ఎలాంటి ఎలిమెంట్స్ ఉండాలి. సినిమా ప్రేక్షకుడికి నచ్చే ధోరణి లో తీయాలి అంటే ఎలా తెరకెక్కించాలి అనే పాయింట్లను బేస్ చేసుకొని ఆయన సినిమాల మీద ఎక్కువ దృష్టిని పెడతాడు అనే వాటిని కూడా చూపించారు… ఇక బాహుబలి, త్రిబుల్ ఆర్ సినిమాల సమయంలో ఈఒత్తిడికి గురయ్యాడు. అలాగే బాహుబలి మొదటి పార్ట్ కి మొదట నెగిటివ్ టాక్ వచ్చినప్పుడు ఆయన ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నారు అనే విషయాలతో పాటుగా రాజమౌళి యొక్క వ్యక్తిగత జీవితాన్ని కూడా ఈ డాక్యుమెంటరీలో చూపించే ప్రయత్నం అయితే చేశారు…ఇక డాక్యుమెంటరీ ని తెరపైన చూసేటప్పుడు ప్రేక్షకుడికి ఒక తెలియని ఫీల్ అయితే కలుగుతుంది. ఇక ఇదిలా ఉంటే ఆ డాక్యుమెంటరీ లో వాడిన మ్యూజిక్ ఇంకొంచెం బెటర్ గా ఉంటే బాగుండేది. ఇక ఎడిటర్ కూడా చాలా షార్ప్ గా ఎడిట్ చేసినట్టుగా అర్థమవుతుంది.

    ఇక ప్రొడ్యూసర్ సేఫ్ జోన్ లో ఉండే విధంగా ఆయన ఎలా ఆలోచిస్తాడు. అలాగే సినిమాని ప్రమోషన్ కూడా తను ఏ విధంగా చేయగలుగుతాడు అనే విషయాలను కూడా ఇందులో పొందుపరిచారు… ఇక అన్ని బాగానే ఉన్నప్పటికీ ఇందులో రాజమౌళి దర్శకత్వానికి సంబందించిన విషయాల్లో ఎలా ఆలోచిస్తాడు. దానికోసం ఎంత ప్రాణం పెట్టి చేస్తాడు అనేంతలా పర్ఫెక్ట్ గా చూపించలేకపోయారు…

    ప్లస్ పాయింట్స్

    రాజమౌళి వ్యక్తిగత విషయాల గురించి బాగా చూపించారు…
    మ్యూజిక్ బాగుంది…

    మైనస్ పాయింట్స్

    ఆయన డైరెక్షన్ లో ఎలాంటి మెలుకువలు పాటిస్తాడు అనేది పర్ఫెక్ట్ చూపించలేదు…

    ఈ డాక్యుమెంటరీ మధ్యలో కొంచెం లాగ్ అయినట్టుగా అనిపించింది…

    రేటింగ్
    ఇక ఈ డాక్యుమెంటరీ కి మేమిచ్చే రేటింగ్ 2.25/5