Parijatha Parvam Movie Review: పారిజాత పర్వం మూవీ రివ్యూ….

సినిమా మీద ఉన్న ఒక ఇష్టంతో ఒక దర్శకుడు క్రైమ్ కామెడీ జానర్ లో తెరకెక్కించిన సినిమానే "పారిజాత పర్వం".. ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Written By: Gopi, Updated On : April 25, 2024 6:05 pm

Parijatha Parvam Movie Review

Follow us on

Parijatha Parvam Movie Review: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రతి వారం వైవిధ్య భరితమైన సినిమాలు వస్తూ ప్రేక్షకులను ఎప్పటికప్పుడు ఎంటర్ టైన్ చేస్తున్నాయి. నిజానికి ఒక సినిమాని తీయాలి అనే ఆలోచన వచ్చిన ప్రతి ఒక్కరు ఆ సినిమాని తెరపైకి తీసుకురావాలి అని చూస్తారు. కానీ అది చాలా కష్టమైన పని అందులో చాలా ఇబ్బందులు ఉంటాయి. అవన్నీ దాటుకుని ఒక దర్శకుడు ఒక సినిమాని తెరపైకి తీసుకొచ్చి రిలీజ్ చేశాడు అంటే ఆల్మోస్ట్ ఆయన ఒక 50% సక్సెస్ అయినట్టే.. తన డ్రీమ్ ను తను ఫుల్ ఫిల్ చేసుకున్నావాడు అవుతాడు. ఇక ఇలాంటి సినిమాల సక్సెస్, ఫెయిల్యూర్ అనేది దర్శకులు మలిచిన విధానాన్ని బట్టి సినిమా సక్సెస్ ఉంటుంది. ఇక అలా సినిమా మీద ఉన్న ఒక ఇష్టంతో ఒక దర్శకుడు క్రైమ్ కామెడీ జానర్ లో తెరకెక్కించిన సినిమానే “పారిజాత పర్వం”.. ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చిన్న సినిమా గా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకుల్లో ఎలాంటి ఇంపాక్ట్ ని క్రియేట్ చేసింది. వైవాహర్ష మెయిల్ లీడ్ గా సాగిన ఈ సినిమా సక్సెస్ అందుకుందా? మిగతా క్రైమ్ కామెడీలకు దీనికి మధ్య ఉన్న తేడాలు ఏంటి? అనేది ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

కథ

ముందుగా ఈ సినిమా కథ విషయానికి ఇది 2002 వ సంవత్సరం టైమ్ పిరియడ్ లో మొదలైన కథ.. శ్రీను (సునీల్) భీమవరంలో చిరంజీవి హీరోగా వచ్చిన ఇంద్ర సినిమాని చూసి మనం కూడా ఎలాగైనా హీరో అయిపోయి డబ్బులతో, పాటు క్రేజ్ ను కూడా సంపాదించాలి అనే ఉద్దేశ్యం తో హైదరాబాద్ కి వస్తాడు. ఇక ఇక్కడ ఆయన చిన్న చిన్న అవకాశాల కోసం ఎంత ప్రయత్నం చేసిన కూడా ఆయనకి ఏ ఒక్క అవకాశం కూడా రాదు. ఇక దాంతో విసిగిపోయిన శ్రీను ఏం చేయాలో అర్థం కాక సతమతమవుతూ ఉంటాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ఒక సెక్యూరిటీ వాడు సినిమాకు సంబంధించిన అసిస్టెంట్ డైరెక్టర్లు అందరూ కృష్ణానగర్ లోని ‘ఓంకార్ బార్’ లోకి వస్తారు. అక్కడ వీలైతే వాళ్ళని పట్టుకో నీకు అవకాశం దొరుకుతుంది అని చెప్పడంతో శ్రీను ఓంకార్ బార్ లో వెయిటర్ గా చేరుతాడు. ఇక అప్పటికే ఆ బార్ లో డాన్సర్ గా ఉన్న పారు(శ్రద్దదాస్) తో తనకు మంచి పరిచయం ఏర్పడుతుంది.

ఇక అక్కడ జరిగిన కొన్ని గొడవల్లో అనుకోని కొన్ని కారణాలవల్ల శ్రీను ఆ బార్ ఓనర్ ను మర్డర్ చేయాల్సి వస్తుంది. ఇక అప్పటినుంచి శ్రీను కాస్త బార్ శ్రీనుగా మారి సెటిల్మెంట్లు, దందాలు చేస్తూ ఎదుగుతూ ఉంటాడు. ఇక ఇలాంటి క్రమంలోనే చైతు(చైతన్య రావు) దర్శకుడిగా మారి తనని తాను ప్రూవ్ చేసుకోవాలనే ఉద్దేశ్యం లో బార్ శ్రీను కి సంబంధించిన కథ రాసుకొని ప్రొడ్యూసర్ల వెంట తిరుగుతూ ఉంటాడు. ఎంతమంది ప్రొడ్యూసర్ల దగ్గరికి వెళ్లి కథ చెప్పిన ఆయనకి చేదు అనుభవం ఎదురవుతూ ఉంటుంది. ఇక ఇలాంటి క్రమంలో శెట్టి(శ్రీకాంత్ అయ్యంగార్) అనే ఒక ప్రొడ్యూసర్ కి చైతు చెప్పిన కథ నచ్చి సినిమా చేయడానికి ముందుకు వస్తాడు. కానీ చైతు ఈ సినిమా చేయడానికి ఒక కండిషన్ పెడతాడు.

ఈ సినిమాలో హీరోగా తన స్నేహితుడైన హర్ష (వైవా హర్ష) ను హీరో గా పెట్టాలని చెప్తాడు. అతడికి చెవుడు ఉన్నట్టుగా కూడా చెప్తాడు. ఇక దానికి ఆ ప్రొడ్యూసర్ ఒప్పుకోడు. అలా ఆ ప్రాజెక్టు కూడా చైతు నుంచి చేజారిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇక మొత్తానికైతే చైతు శెట్టి భార్యని కిడ్నాప్ చేసి డబ్బులు తీసుకొని ఆ వచ్చిన డబ్బులతో సినిమా చేయాలనే ప్లాన్ వేస్తాడు. మరి ఆయన వేసిన ప్లాన్ కరెక్ట్ గా వర్కౌట్ అయిందా.? అక్కడ నుంచి కథ ఎలాంటి మలుపులు తిరిగింది… ఇక మొత్తానికైతే చైతు తను అనుకున్నట్టుగా దర్శకుడిగా మారి సినిమా తీశాడా? బార్ శీను హీరోగా మారి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడా? లేదా అనే విషయాలు తెలియాలంటే మీరు ఈ సినిమాని చూడాల్సిందే….

విశ్లేషణ

ఇక ఈ సినిమా విశ్లేషణ విషయానికి వస్తే ఈ సినిమాలో దర్శకుడు సతీష్ కుంభంపాటి నడిపించిన ఈ కామెడి కిడ్నాప్ డ్రామా గాని, ఇందులో ఉన్న ఎమోషన్స్ గాని సినిమాను నెక్స్ట్ లెవెల్ లోకి తీసుకెళ్ళయనే చెప్పాలి. ఇక ఇండివిజల్ సీన్స్ గా చూస్తే మాత్రం ఈ సీన్లన్నీ ప్రేక్షకుడికి మంచి కిక్కునిస్తాయి. అలాగే ఫస్ట్ హాఫ్ మొత్తం వైవా హర్ష కామెడీతో నడిపించాడు. ఇక చెవుడు క్యారెక్టర్ లో వైవా హర్ష అద్భుతంగా నటించాడనే చెప్పాలి. హర్ష పొటెన్షియాలిటీ తెలుగు సినిమా ఇండస్ట్రీకి అర్థం కావడం లేదు కానీ ఆయనకి ఒక మంచి క్యారెక్టర్ పడితే ఆ సినిమాని సక్సెస్ చేసే కెపాసిటీ ఉన్న నటుడు వైవా హర్ష…ఇక ఈ సినిమాలో హర్ష కామెడీ తో పాటు కొన్ని చోట్ల ఎమోషన్ ని కూడా పండించాడు. ఇక దర్శకుడు సతీష్ ఈ సినిమాని కొత్తగా ప్రజెంట్ చేయాలనే ప్రయత్నం చేశాడు. అయితే ఫస్ట్ హాఫ్ వరకు అతను అనుకున్నది అనుకున్నట్టుగా తీసుకెళ్ళాడు. ఇక ఇంటర్వెల్ లో ఒక ట్విస్ట్ ఇచ్చాడు.

ఇక సెకండాఫ్ లో కొన్ని ట్విస్ట్ లు రివిల్ అవుతున్న కొద్ది సినిమాలో కామెడీ పర్సంటేజ్ అనేది తగ్గుతూ వచ్చింది. అది ఈ సినిమాకి చాలా పెద్ద దెబ్బ గా మారిందనే చెప్పాలి. ఎప్పుడైతే సినిమా కీ పాయింట్స్ మొత్తం రివిల్ అవుతూ వస్తున్నాయో అలాంటి సమయంలో కామెడీ ని జనరేట్ చేయడానికి అక్కడ స్కోప్ అయితే లేదు. డైరెక్టర్ ఫస్టాఫ్ ని ఎలాగైతే నడిపించాడో అలాగే సెకండాఫ్ కూడా నడిపించినట్టయితే ఈ సినిమా మరొక రేంజ్ లో హిట్టు కొట్టిండేది. ఇక సెకండ్ హాఫ్ లో వచ్చే సీన్లు మాత్రం రోటీన్ క్రైమ్ సినిమా సీన్ల లాగే అనిపించాయి. ఫస్ట్ హాఫ్ లో ఆయన ఎత్తుకున్న పాయింట్ గాని, ఆయన నడిపించిన స్క్రీన్ ప్లే గాని చాలా కొత్త కొరవడికి శ్రీకారం చుట్టినప్పటికీ సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి మాత్రం ఆయన రొటీన్ రొట్ట ఫార్ములా లోకి సినిమాని తీసుకురావడం అనేది చాలా వరకు ఈ సినిమాకి మైనస్ అయిందనే చెప్పాలి. ఇక ఒక విషయంలో మాత్రం దర్శకుడిని కచ్చితంగా మెచ్చుకోవాలి.

అది ఏంటి అంటే ప్రతి సీన్ లో దాని తాలుకు ఇంటెన్స్ మిస్ అవ్వకుండా ఆ సీన్ ను ఓపెన్ చేసిన విధానం గాని దాన్ని ఎండ్ చేసిన పద్ధతి గాని సినిమాకు మంచి బూస్టాప్ ఇచ్చింది. ఇక అలాగే ప్రతి సీను కూడా క్యూరియాసిటి ని రేకెత్తించే విధంగా అనిపించినప్పటికీ అందులో వచ్చే ట్విస్ట్ లు, సినిమాకి అంత పెద్ద ప్లస్ అయితే కాలేదు. ఇక ఈ సినిమాలో కామెడీగా సాగే ఒక ట్విస్ట్ అయితే ఉంటుంది. అది చూస్తే ఇంత సిల్లీ ట్విస్ట్ ని ఎలా రాసుకున్నారు. దర్శకుడికి మైండ్ ఉందా లేదా అనే విధంగా డౌట్ అయితే వస్తుంది…

ఆర్టిస్టుల పర్ఫామెన్స్

ఈ సినిమాలో వైవా హర్ష, సునీల్ యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉంది. ఇక వీళ్ళిద్దరూ సినిమాని వాళ్ళ భుజాల మీద మోసుకొని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేశారు. కానీ సెకండ్ హాఫ్ లో దర్శకుడి విజన్ కి బ్రేక్ పడినట్టుగా అయింది. కథను ఎక్కడికి తీసుకెళ్లాలో అర్థం కాక రొటీన్ సినిమా ఎలిమెంట్స్ ని ఇన్ క్లూడ్ చేస్తూ తీసుకెళ్లడం అనేది అంత ఎఫెక్ట్ అనిపించలేదు. అయిన కూడా హర్ష, సునీల్ మాత్రం ఈ సినిమాని చాలావరకు ముందుకు తీసుకెళ్లారు… ఇక చైతన్య రావు కూడా తన డీసెంట్ యాక్టింగ్ తో మెప్పించాడు. ఇక శ్రద్ధాదాస్ చాలా రోజుల తర్వాత ఒక మంచి క్యారెక్టర్ లో నటించింది. ఆమెకి స్కోప్ తక్కువగా ఉన్నప్పటికీ ఆమె ఆ సీన్లతోనే తన ఇంపాక్ట్ అయితే చూపించుకోగలిగింది. ఇక ఆమెకి మరో రెండు మూడు సినిమాల్లో అవకాశం వచ్చే ఛాన్స్ లు కూడా ఉన్నాయి…శ్రీకాంత్ అయ్యంగార్ పాత్ర సినిమాకి చాలా ప్లస్ అయింది. ఆయన ఏ క్యారెక్టర్ నైనా ఈజీగా చేసే సత్తా ఉన్న నటుడు అనే విషయం మరొకసారి ప్రూవ్ అయింది. ఇక హీరోయిన్ మాళవిక సతీషన్ పాత్ర సినిమాలో కొద్దివరకే ఉన్నప్పటికీ ఆమె కనిపించిన ప్రతిసారి స్క్రీన్ మీద గాని, ప్రేక్షకుల్లో గానీ ఒక హై ఫీల్ వచ్చినట్టుగా అనిపిస్తూ ఉంటుంది.

టెక్నికల్ అంశాలు

ఇక టెక్నికల్ అంశాల విషయానికి వస్తే ఈ సినిమాకు మ్యూజిక్ అందించిన ‘ రీ ‘ మ్యూజిక్ కొంత వరకు పర్లేదు అనిపించినప్పటికీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం ఈ సినిమాకి ఏమాత్రం హెల్ప్ అవ్వలేదు. ఎంతసేపు తను ఒకే ట్రాక్ ని వాడుతూ సినిమా బ్యాగ్రౌండ్ మ్యూజిక్ పరంగా కొంతవరకైతే మ్యానేజ్ చేశారనే చెప్పాలి. ఇక ప్రతి సీనుకి కొత్త రకమైన మ్యూజిక్ ని ఆడ్ చేసుకుంటూ వెళ్తే సీన్ కంటెంట్ బట్టి ఆ ఫ్రెష్ ఫీల్ వచ్చేది. కానీ ఆయన ఒకే ట్రాక్ బ్యాగ్రౌండ్ స్కోర్ గా వాడటం వల్ల అది సినిమాకి ఏ రకంగానూ ప్లస్ అవ్వలేదు..బాలా సరస్వతి సినిమాటోగ్రఫీ కూడా కొంతవరకు పర్లేదు అనిపించింది… ఇక ఈ సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఓకే అనిపించేలా ఉన్నాయి…

ప్లస్ పాయింట్స్

కామెడీ సీన్స్
హర్ష, సునీల్ యాక్టింగ్

మైనస్ పాయింట్స్

ట్విస్ట్ లు ఎక్కువ అవ్వడం వల్ల సినిమాలో ఉన్న కామెడీ క్వాలిటీ అనేది సెకండ్ హాఫ్ లో కొంచెం తగ్గింది…

రైటింగ్ లో ఇంకొంచెం పదునుపెట్టి ఉంటే బాగుండేది అనిపించింది.

సెకండాఫ్ అంత గందరగోళంగా సాగింది.

రేటింగ్
ఇక ఈ సినిమాకి మేమిచ్చే రేటింగ్ 2.25/5

చివరి లైన్
ఫస్టాఫ్ లో ఉన్న కామెడీ సెకండాఫ్ లో మిస్ అయింది.