Odela 2 Movie Review: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఎన్ని సినిమాలు చేసినప్పటికి మంచి కాన్సెప్ట్ లతో సినిమాలు చేసిన వాళ్లకు మాత్రమే మంచి గుర్తింపై తే లభిస్తుంది. ఒకప్పుడు స్టార్ హీరోలతో సినిమా చేసి స్టార్ డైరెక్టర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న సంపత్ నంది ప్రస్తుతం చేస్తున్న సినిమాలతో తన హవాని కొనసాగించలేకపోతున్నాడు. ఇక అందులో భాగంగానే ప్రస్తుతం ఆయన ‘ఓదెల రైల్వే స్టేషన్ 2’ అనే సినిమాకి కథ మాటలు అందిస్తూ సినిమాకి ప్రొడ్యూసర్ గా కూడా కొనసాగుతున్నాడు. మరి ఇలాంటి సందర్భంలోనే ఆయన చేస్తున్న ఈ సినిమా ఈరోజు రిలీజ్ అయింది. మరి ఈ సినిమా ఎలా ఉంది సగటు ప్రేక్షకుడిని మెప్పించిందా? లేదా అనే విషయాలను మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
Also Read: మన ఇండస్ట్రీ నుంచి అలాంటి సినిమాలు ఎందుకు రావడం లేదు…
కథ
ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే ఓదెల రైల్వే స్టేషన్ 2 అనే సినిమా 2022 సంవత్సరంలో ఓటిటి లోకి వచ్చి రిలీజ్ అయింది. అయితే ఈ సినిమా ఎక్కడైతే ఆగిపోయిందో అక్కడి నుంచే ఈ సినిమాని కంటిన్యూ చేశారు. ఇక ఆ సినిమా క్లైమాక్స్ లో చనిపోయిన వ్యక్తి ప్రేతాత్మ గా మారి ఓదెల అనే ఊర్లో ఉన్న జనాన్ని పీడిస్తుంటే ఆ ఊరి దేవుడైన శివుడు నాగ సాధువు అయిన తమన్నా రూపంలో వచ్చి ఎలా కాపాడాడు అనేది తెలియాలంటే మాత్రం మీరు ఈ సినిమా చూడాల్సిందే…
విశ్లేషణ
ఇక ఈ సినిమా విశ్లేషణ విషయానికి వస్తే ఇంతకు ముందు ఆత్మకి పరమాత్ముడికి మధ్య పోటీ జరిగిన సినిమాలు చాలానే వచ్చాయి. వాటిని చూసిన ప్రేక్షకుడు ఈ సినిమాని చూడడంలో కొంతవరకు ఇబ్బంది పడే అవకాశం అయితే ఉంది. ఇక సంపత్ నంది ఏదైతే కాన్సెప్ట్ రాసుకున్నాడో ఆ సినిమాను అస్ ఇట్ ఈజ్ గా తెరమీద చూపించే ప్రయత్నం చేసినప్పటికి ఆ సినిమా ఆశించిన మేరకు ప్రేక్షకుడిని మెప్పించే విధంగా అయితే లేదు. సినిమా టెంపో ఏ విధంగా సాగినప్పటికి అందులో హర్రర్ గొలుపే సన్నివేశాలు కొన్ని ఉన్నప్పటికి సినిమా పూర్తి స్థాయి లో ఎంగేజింగ్ గా తీసుకెళ్లడంలో దర్శకుడు అశోక్ తేజ కొంతవరకు తరబడ్డట్టుగా తెలుస్తోంది.ఈ సినిమా విషయంలో సంపత్ నంది ఇంకాస్త కేర్ తీసుకొని ఉంటే బాగుండేది. అయినప్పటికి కథ విషయంలో ఓకే అనిపించినప్పటికి స్క్రీన్ ప్లే, డైరెక్షన్ లో కొంతవరకు తడబడ్డట్టుగా తెలుస్తోంది…ఇక ఈ సినిమాలో ఆత్మ కి పరమాత్మకు మధ్య జరిగే కొన్ని సీన్లు హైలెట్ గా నిలిచాయి. ఇక తమన్నా ఊరిలోకి ఎంటరయ్యే సీన్స్ కూడా బాగున్నాయి…అయితే కొన్ని చోట్ల సీజీ వర్క్ అంత బాగా సెట్ అవ్వలేదు. అయినప్పటికి అంజనీష్ బ్యాగ్రౌండ్ స్కోర్ మాత్రం చాలా అద్భుతం గా ఉంది…కొన్ని సీన్స్ ను ఎలివేట్ చేయడం లో అది బాగా హెల్ప్ అయింది…
ఆర్టిస్టుల ఫర్ఫామెన్స్
ఇక ఆర్టిస్టుల పర్ఫామెన్స్ విషయానికి వస్తే తమన్నా ఒంటరి పోరాటం చేసిందనే చెప్పాలి. సినిమా మొత్తానికి తనే హైలెట్ గా నిలిచింది. ఆమె చేసిన పాత్ర వల్లే సినిమాకి చాలా మంచి హైప్ వచ్చింది. కొన్ని సీన్స్ లో ఆమె చాలా బాగా నటించింది. ఇక సంపత్ నంది కి ఆమెకి ఉన్న బాండింగ్ వల్లే ఆమె ఈ సినిమాలో నటించింది. ఇక వశిష్ట విలన్ గా నటించి మెప్పించడమే కాకుండా డిఫరెంట్ స్టైల్ లో విలనిజాన్ని పండించాడు. ఇక ఆయనను చూస్తే కొన్ని సీన్స్ లో భయం పుట్టించేలా నటించాడు…మిగతా ఆర్టిస్టులందరు వాళ్ళ పాత్రల పరిధి మేరకు ఓకే అనిపించారు…
టెక్నికల్ అంశాలు
ఈ సినిమా టెక్నికల్ అంశాల విషయానికి వస్తే అంజనీష్ అందించిన మ్యూజిక్ ఈ సినిమా కి బాగా సెట్ అయింది. పాటలు ఒకే అనిపించినప్పటికి బ్యాగ్రౌండ్ స్కోర్ విషయంలో మాత్రం చాలా కేర్ తీసుకున్నాడు. అందుకే కొన్ని సీన్లు బాగా ఎలివేట్ అయ్యాయి…ఇక సినిమాటోగ్రఫీ కూడా చాప్ బాగా సెట్ అయింది…ప్రతి విజువల్ కూడా ప్రేక్షకుడిని మెప్పించే విధంగా ఉండటం తో సినిమా చూసిన ప్రతి ఒక్కరికి విజువల్స్ బాగా నచ్చుతాయి…
ప్లస్ పాయింట్స్
సెకండాఫ్ లో వచ్చే సీన్స్
తమన్నా యాక్టింగ్
కొని హార్రర్ సీన్స్
మైనస్ పాయింట్స్
రొటీన్ కథ
కొన్ని సీన్స్ లో సీజీ వర్క్
రేటింగ్
ఈ సినిమాకి మేమిచ్చే రేటింగ్ 2.5/5
