Mufasa The Lion King Movie Review: ది లయన్ కింగ్ పేరుతో ఒక సినిమా వచ్చి ఇండియన్ సైనిక ప్రపంచాన్ని కుదిపివేసిన విషయం మనకు తెలిసిందే. ఇక బాహుబలి లాంటి సినిమాని సైతం ఆ సినిమా రిఫరెన్స్ తోనే తీసుకున్నారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక అలాంటి ‘లయన్ కింగ్’ సినిమాకి ఫ్రీక్వెల్ గా ‘ముఫాస ‘ సినిమా వచ్చింది. ఇక హాలీవుడ్ సినిమా రేంజ్ ఏ విధంగా ఉంటుందో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక అందులో భాగంగానే ఈ సినిమాను కూడా చాలా ఎక్స్ ట్రా ఆర్డినరీ విజువల్స్ తో తెరకెక్కించే ప్రయత్నం చేశారు. ఇక హాలీవుడ్ నుంచి సినిమాలు వస్తున్నాయి అంటే వాటి రేంజ్ ఎలా ఉంటుందో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని అయితే లేదు. మరి ఈ సినిమా ఎలా ఉంది? తెలుగు ప్రేక్షకులను మెప్పించిందా? లేదా అనే విషయాలను మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
కథ
ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే ఇక సింబా కూతురు కియారా కి తన తాత ముఫాస కథను చెబుతుంటాడు… అయితే చిన్నతనంలోనే ముఫాస వరదల్లో చిక్కుకొని తన పేరెంట్స్ నుంచి దూరం అయిపోతాడు. ఇక అక్కడి నుంచి తను ఒక రాజ్యానికి చేరుకుంటాడు. అక్కడ ఎన్నో ఎత్తుగడలు వేస్తూ ముఫాస ను తీవ్రమైన ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటారు…అయితే అక్కడ ముఫాస ఎలాంటి ఇబ్బందులను పడింది. తను ఒక రాజ్యానికి రాజుగా ఎలా ఎదిగాడనేది తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే…
విశ్లేషణ
ఇక ఈ సినిమా విశ్లేషణ విషయానికి వస్తే ఈ సినిమా దర్శకుడు అయిన బెర్రీ జంకిన్స్ ప్రతిఫ్రేమ్ లో విజువల్ వండర్ ని చూపించడమే కాకుండా కంప్లీట్ గా మనల్ని ఆ వరల్డ్ లోకి తీసుకెళ్లడంలో ఆయన చాలావరకు సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. ఇక ఈ కథని డ్రైవ్ చేసిన విధానం కాని ఎక్కడా కూడా ప్రేక్షకుడికి బోర్ కొట్టించకుండా నడిపించిన విధానం చాలా బాగుంది. కంటెంట్ తో సినిమాని ముందుకు తీసుకెళ్తూ వచ్చాడు. ఇక ఈ సినిమాలో ముఫాస కి మహేష్ బాబు వాయిస్ ఇవ్వడం కూడా చాలా వరకు ప్లస్ అయింది.
ఇక మొత్తానికైతే ఆయన వాయిస్ లో ఉన్న డెప్త్ ను వాడుకోవడమే కాకుండా మహేష్ బాబు లో ఉన్న వెటకారాన్ని కూడా చాలా బాగా వా. ఇక మొత్తానికైతే ఈ సినిమా మీద మహేష్ బాబు వాయిస్ చాలా ఇంపాక్ట్ ని చూపించింది. తద్వారా తెలుగు ప్రేక్షకులు కూడా సినిమా చూడడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ముందుకు సాగుతూ ఉండడం విశేషం. ఇక ఏది ఏమైనా కూడా ముఫాస సినిమా అద్భుతంగా ఉండడమే కాకుండా స్క్రీన్ ప్లే ప్రకారం కూడా అవుట్ అండ్ అవుట్ గ్రిప్పింగ్ స్క్రీన్ లను రాసుకొని ప్రేక్షకుడిని ఎంగేజ్ చేస్తూ వచ్చారు… ఇక మహేష్ బాబు తో పాటు ఆలీ, బ్రహ్మానందం ల వాయిస్ లు కూడా చాలా బాగా ప్లస్ అయ్యాయి. నిజానికి ఈ సినిమా తెలుగులో డబ్ చేసిన విధానం అయితే బాగుంది. ఎవరైతే డబ్బింగ్ ఇన్ ఛార్జ్ గా ఉన్నారో వాళ్లంతా ఆ సినిమా టెంప్లేట్ మిస్ అవ్వకుండా చాలా పర్ఫెక్ట్ వే లో డబ్బింగ్ ప్రాసెస్ ని పూర్తి చేసుకున్నారు… ఇక ఈ సినిమాలో కొన్ని ఎమోషనల్ సీన్స్ ప్రేక్షకుడిని మనసుకి హత్తుకునే ఉంటాయి.
ముఫాస అ రాజ్యానికి రాజుగా ఎదిగిన వైనం అయితే ఎలివేషన్స్ తో కూడి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క ప్రేక్షకుడికి అదొక గూస్ బంప్స్ ఎపిసోడ్ గా మారిందనే చెప్పాలి… ముఫాస అనేది ప్రతి ఒక్కరికి ఒక ఎమోషన్ గా మారిపోయింది. కాబట్టి ఆ క్యారెక్టర్ తోనే మనం ట్రావెల్ చేస్తూ ఉంటాము.ఇక మొదటి నుంచి చివరి వరకు ముఫాస పడిన ఇబ్బందులు సాదించిన విజయాలను ప్రేక్షకుడికి చాలా హై ఫీల్ ను ఇస్తు ఉంటాయి…
టెక్నికల్ అంశాలు
ఇక ఈ సినిమా టెక్నికల్ అంశాల గురించి మాట్లాడాలి అంటే ముందుగా మ్యూజిక్ గురించి మాట్లాడాలి. మ్యూజిక్ అద్భుతంగా ఉంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అయితే ఎలివేషన్స్ కి తగ్గట్టుగా చాలా ఎక్స్ట్రాడినరీగా ఇచ్చారనే చెప్పాలి. స్క్రీన్ మీద విజువల్ వండర్ ని చూస్తున్నంత సేపు మ్యూజిక్ తో మనం ఒక వేరే ప్రపంచంలో ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది… సినిమాలో మ్యూజిక్ అనేది చాలా కీలక పాత్ర వహించింది .ఇక ఈ గ్రాఫికల్ వర్క్ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉందని చెప్పాలి. నిజానికి సింహాలు, జంతువులు అన్ని అక్కడ గ్రాఫిక్స్ లో డిజైన్ చేశారా? లేదంటే వాటన్నింటికి ట్రైనింగ్ ఇచ్చి మరి చేపించుకుంటున్నారా అనెంత రియలేస్టిక్ గా పనిచేసింది అంటే సినిమా కోసం వాళ్లు ప్రాణం పెట్టేసారనే చెప్పాలి….
ప్లస్ పాయింట్స్
మహేష్ బాబు వాయిస్
కోర్ ఎమోషన్
ఎలివేషన్ సీన్స్
మైనస్ పాయింట్స్
మొదటి పార్ట్ అంత అనిపించలేదు
కథలో డెప్త్ లేదు…
రేటింగ్
ఈ సినిమాకి మేమిచ్చే రేటింగ్ 2.5/5