https://oktelugu.com/

Miss you Movie Review: ‘మిస్ యూ ‘ ఫుల్ మూవీ రివ్యూ…

తమిళ్ సినిమా ఇండస్ట్రీ నుంచి కొన్ని సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇక ఏది ఏమైనా కూడా ఈరోజు ఆయన హీరోగా చేసిన 'మిస్ యు' అనే సినిమా థియేటర్ లోకి వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది ప్రేక్షకులను మెప్పించిందా? లేదా అనే విషయాన్ని మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం...

Written By:
  • Gopi
  • , Updated On : December 14, 2024 / 09:17 AM IST

    Miss you Movie Review

    Follow us on

    Miss you Movie Review: ‘ఈ మధ్యకాలంలో సిద్ధార్థ్ హీరోగా వచ్చిన సినిమాలేవి పెద్దగా ప్రేక్షకులను అందించడం లేదు. ఆయన సినిమాలను కూడా ఎక్కువగా చేయడం లేదు. ఒకవేళ చేసినా కూడా ఆ సినిమాలు ప్రేక్షకులను మెప్పించే విధంగా అయితే ఉండడం లేదు. ఇక ఇంతకుముందు శంకర్ డైరెక్షన్ లో వచ్చిన ‘భారతీయుడు 2’ సినిమాలో ఒక కీలకమైన పాత్రలో నటించిన సిద్ధార్థ్ ఆ సినిమా కూడా డిజాస్టర్ అవ్వడంతో ఆయనకు తెలుగులో అవకాశాలైతే రావడం లేదు. ఇక తమిళ్ సినిమా ఇండస్ట్రీ నుంచి కొన్ని సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇక ఏది ఏమైనా కూడా ఈరోజు ఆయన హీరోగా చేసిన ‘మిస్ యు’ అనే సినిమా థియేటర్ లోకి వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది ప్రేక్షకులను మెప్పించిందా? లేదా అనే విషయాన్ని మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

    కథ

    ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే డైరెక్టర్ అవ్వాలని కలలు కనే వాసు (సిద్దార్థ్) అనుకోని కారణాల వల్ల ఆయనకు ఒక యాక్సిడెంట్ అయితే జరుగుతుంది. దాంతో ఆయన రెండు సంవత్సరాల గతం మర్చిపోతాడు. ఇక దాంతో ఆయన ఏం చేయాలో తెలియక బాబీ (కరణకారన్) తో కలిసి బెంగళూరు వెళ్తాడు. అక్కడే జాబ్ చేసుకుంటూ ఉంటాడు అప్పుడే అతనికి సుబ్బలక్ష్మి (అధిక రంగనాథ్) పరిచయం అవుతుంది.

    ఇక వాళ్ల పరిచయం కాస్త ప్రేమగా మారుతుంది. వీళ్ల ప్రేమ విషయాన్ని వాసు తన ఇంట్లో చెప్పి పెళ్లికి ఒప్పిస్తానని సుబ్బలక్ష్మితో చెబుతాడు. ఇక మొత్తానికైతే వాసు వాళ్ళింట్లో సుబ్బలక్ష్మితో పెళ్లికి ఒప్పుకోరు. వాళ్ళు ఒప్పుకోకపోవడానికి కారణమేంటి? వీరిద్దరి మధ్య ఇంతకుముందు గత స్టొరీ ఏదైనా ఉందా? దాని వల్ల సుబ్బలక్ష్మి తో పెళ్ళికి నో చెప్తున్నారా? ఇక మొత్తానికైతే సుబ్బలక్ష్మి వాసు పెళ్లి చేసుకున్నారా? లేదా అనే విషయాలు తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే…

    విశ్లేషణ

    ఇక విశ్లేషణ విషయానికి వస్తే ఈ సినిమాను దర్శకుడు రాజశేఖర్ మొదటి నుంచి కూడా చాలా ఎగేజింగ్ గా తీసుకెళ్ళే ప్రయత్నం చేశాడు. కానీ కథ ఇంతకుముందు చాలాసార్లు మనం చూసినట్టు ఉండడంతో ప్రేక్షకుడు నెక్స్ట్ ఏం జరగబోతుందనేది చాలా ఈజీగా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాడు. దానివల్ల కథనం అనేది గ్రిప్పింగ్ గా రాలేదు. దాంతో రాజశేఖర్ ఎంత డైరెక్షన్ పరంగా ప్రయత్నం చేసిన కూడా సినిమా అనేది ప్రేక్షకుల్ని ఆకట్టుకునే విధంగా అయితే లేదు.

    మరి దానికి అనుగుణంగానే ఈ సినిమా నాని హీరోగా వచ్చిన హాయ్ నాన్న సినిమాను పోలి ఉన్నప్పటికి ఇదొక మర్డర్ మిస్టరీ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. కాబట్టి దీనికి కొంతవరకు వేరియేషన్ అనేది చూపించే ప్రయత్నమైతే చేశాడు. మరి ఏది ఏమైనా కూడా మిస్ యు అనే సినిమా సిద్ధార్థ్ కి పెద్దగా కలిసి రాలేదనే చెప్పాలి… ఇక ఇది ఏమైనా కూడా ఈ సినిమాని పెద్దగా ఎంగెజింగ్ తీసుకెళ్ళకపోవడం తో ప్రేక్షకులు ఈ సినిమాను చూడాలనే ఇంట్రెస్ట్ కూడా కోల్పోతున్నారు…

    ఇక కొన్ని కొన్ని సీన్లు ప్రేక్షకులను మెప్పించినప్పటికి ఓవరాల్ గా సినిమా మాత్రం ప్రేక్షకుడిని ఎంగేజ్ అయితే చేయదు. ఇక దానికి కారణం ఏదైనా కూడా ఈ సినిమా విషయంలో దర్శకుడు కొంచెం జాగ్రత్తలు తీసుకుని ఉంటే బాగుండేది…ఫస్ట్ హాఫ్ లో వచ్చే చాలా సీన్లు లాగ్ అనిపిస్తుంటాయి. ఇక సెకండ్ హాఫ్ లో సినిమా స్టోరీ పెద్దగా ప్రేక్షకుడికి కనెక్ట్ కాదు. స్టోరీ మొత్తాన్ని ప్రేక్షకులు ఈజీగా గెస్ చేయొచ్చు. ఇక అక్కడక్కడ కొన్ని ట్విస్టులు ఉన్నప్పటికి ప్రేక్షకులను మైమరిపింపచేసే కథ కథనం లేకపోవడంతో ఈ సినిమా ప్రేక్షకుడికి కనెక్ట్ కాలేకపోయింది….

    ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్

    ఇక ఆర్టిస్టుల పర్ఫామెన్స్ విషయానికి వస్తే ఈ సినిమాలో సిద్ధార్థ్ చాలా మంచి పర్ఫామెన్స్ ఇచ్చాడు. ఇక తన గత సినిమాల మాదిరిగానే అద్భుతంగా నటించినప్పటికి ఈ సినిమాలో కంటెంట్ బలంగా లేకపోవడంతో ఈ సినిమాలో చాలావరకు సీన్లు బోరింగ్ ఉండటం తో సిద్ధార్థ్ యాక్టింగ్ ఎంత చేసినా కూడా అది ప్రేక్షకులకు ఎక్కలేదు.. ఇక ఈ సినిమాకి ఇదే భారీగా మైనస్ అయిందనే చెప్పాలి… ఇక హీరోయిన్ ఆశిక రంగనాథ్ చేసిన యాక్టింగ్ కూడా బాగుంది. సిద్ధార్థ్ ఆశిక రంగనాథ్ మధ్య వచ్చే లవ్ సీన్స్ ప్రేక్షకుడిని కొంతవరకు సినిమా మీదకి కనెక్ట్ చేసే విధంగా తీసుకెళ్లినప్పటికి ఓవరాల్ గా సినిమాలో అయితే నటినటుల పర్ఫామెన్స్ ఎంత బాగా చేసిన కూడా సినిమా మీద ఇంపాక్ట్ చూపించలేకపోయింది…

    టెక్నికల్ అంశాలు

    ఇక ఈ సినిమా టెక్నికల్ అంశాల విషయానికొస్తే జిబ్రాన్ అందించిన మ్యూజిక్ అసలేం బాలేదు. బ్యాగ్రౌండ్ స్కోర్ లో కొంతవరకు వైవిధ్యాన్ని ప్రదర్శించినప్పటికి ఓవరాల్ గా మ్యూజిక్ విషయంలో జిబ్రాన్ ఫెయిల్ అయ్యాడనే చెప్పాలి. ఇక సినిమాటోగ్రఫీ కూడా కొంతవరకు విజువల్స్ ని భారీగా చూపించే ప్రయత్నం చేసినప్పటికి అవి ఏవి కూడా ప్రేక్షకుడిని మెప్పించకపోవడంతో ప్రేక్షకుడు వాటి నుంచి డిస్ కనెక్ట్ అవుతూ ఉంటాడు..ఇక ఎడిటింగ్ కూడా సోసో గానే ఉంది…ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్నంతలో ఓకే అనిపించాయి…

    ప్లస్ పాయింట్స్

    సిద్ధార్థ్, అషికా రంగనాథ్ యాక్టింగ్
    ట్విస్టులు

    మైనస్ పాయింట్స్

    కథ
    కథనం
    బోరింగ్ సీన్స్

    రేటింగ్

    ఈ సినిమాకి మేమిచ్చే రేటింగ్ 1.5/5