https://oktelugu.com/

Miral Movie Review: మిరల్ మూవీ రివ్యూ…

ప్రేమిస్తే భరత్, వాణి భోజన్ లాంటి నటులు లీడ్ రోల్ లో అయితే నటించారు. అయితే ఈ సినిమా ఎలా ఉంది, సగటు ప్రేక్షకుడిని ఆకట్టుకుందా లేదా అనే విషయాలను మనం ఒకసారి బ్రీఫ్ అనాలసిస్ ద్వారా తెలుసుకుందాం...

Written By:
  • Gopi
  • , Updated On : May 18, 2024 / 12:36 PM IST
    Miral Movie Review

    Miral Movie Review

    Follow us on

    Miral Movie Review: ఒకప్పుడు తెలుగు లో హార్రర్ సినిమాలు విపరీతంగా వచ్చి ప్రేక్షకులను చాలా వరకు ఎంటర్ టైన్ చేస్తూ ఉండేవి. ఈ జానర్ సినిమాలకి సపరేట్ ఫ్యాన్స్ కూడా ఉన్నారు. అయితే గత కొద్ది రోజుల నుంచి తెలుగులో సరైన హర్రర్ ఫిల్మ్ అయితే రావడం లేదు. ఇక ఇప్పుడు తమిళంలో మంచి విజయం సాధించిన మిరల్ అనే మూవీ ని తెలుగులో డబ్ చేశారు. ఇక దీంట్లో ప్రేమిస్తే భరత్, వాణి భోజన్ లాంటి నటులు లీడ్ రోల్ లో అయితే నటించారు. అయితే ఈ సినిమా ఎలా ఉంది, సగటు ప్రేక్షకుడిని ఆకట్టుకుందా లేదా అనే విషయాలను మనం ఒకసారి బ్రీఫ్ అనాలసిస్ ద్వారా తెలుసుకుందాం…

    కథ

    ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే హరి (భరత్), రమ (వాణి భోజన్) ఇద్దరు పెద్దలను ఎదిరించి ప్రేమ పెళ్లి చేసుకుంటారు. వీళ్ళకి ఒక బాబు కూడా ఉంటాడు. కొద్ది రోజులు వీళ్ళు చాలా హ్యాపీగా తమ ఫ్యామిలీ లైఫ్ ని లీడ్ చేసినప్పటికీ ఆ తర్వాత కొన్ని కారణాలవల్ల రమ కి కలలో తనను ఎవరో తరుముతున్నట్టు, వెంటాడుతున్నట్టు, వేధిస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఇక తన మానసిక పరిస్థితి బాగా లేకపోవడం వల్లే తను ఇలా ప్రవర్తిస్తుంది అని హరి అనుకుంటాడు. ఇక ఇదిలా ఉంటే హరి ఒక రోజు సైట్ లో కన్స్ట్రక్షన్ వర్క్ ని చేస్తున్న సమయంలో తన కారు మీద ఒక పెద్ద పిల్లర్ వచ్చి పడుతుంది. దాంతో హరి చాలా పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకుంటాడు. ఇలా వీళ్ళ లైఫ్ అంత చాలా కన్ఫ్యూజన్, క్లారిటీ లేకుండా సాగుతూ ఉండడంతో ఒకరోజు హరి అత్తగారు ఫోన్ చేస్తారు. ఇక్కడ జరుగుతున్న సంఘటనలు తనకు తెలియజేయడంతో ఆమె వీళ్ళిద్దరి జాతకాలు చూపిస్తుంది.

    వీళ్ళ ఊర్లో ఉన్న కుల దైవానికి వచ్చి మొక్కుకుంటే వీళ్ళ గండాలన్ని తొలగిపోతాయి అని చెప్పడం తో హరి, రమ ఇద్దరు వాళ్ల ఊరుకు వెళ్లి అక్కడ ఆ దేవుళ్ళకి దర్శనం చేసుకొని వాళ్లు మొక్కుబడి చెల్లించుకుని తిరుగి సిటీ కి బయలుదేరుతారు. ఈ ప్రయాణంలో సిటీ కి వెళ్తున్న క్రమంలో వీళ్ళ మీద ఒక ముసుగు వేసుకున్న వ్యక్తి దాడి చేస్తాడు. అసలు ముసుగు వేసుకున్న వ్యక్తి ఎవరు.? వీళ్లను ఎందుకు టార్గెట్ చేశాడు.? వీళ్ళను ఎందుకు భయపెడుతున్నాడు అనేది తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే…

    విశ్లేషణ

    ఇక ఈ సినిమా విశ్లేషణ విషయానికి వస్తే దర్శకుడు ఎం. శక్తివెల్ ఈ సినిమాని హార్రర్ జానర్ లో తెరకెక్కించాలనుకొని దాన్ని అధ్యంతం ప్రేక్షకుడికి బోర్ కొట్టించకుండా తీయాలనే ప్రయత్నం అయితే చేశాడు. అయితే అతను ఎంచుకున్న పాయింట్ బాగానే ఉన్నప్పటికీ స్క్రీన్ మీద ప్రజెంట్ చేసేటప్పుడు మాత్రం ఈ సినిమాలో చాలావరకు కన్ఫ్యూజన్స్ అయితే వచ్చాయి. వాటిని సాల్వు చేయడం లో దర్శకుడు ఇబ్బంది పడ్డాడు. ఇక ఆయన ఏమైతే చెప్పాలనుకున్నాడో ఆ పాయింట్ తన మైండ్ లో క్లియర్ గా ఉంది. కానీ అది స్క్రీన్ మీదకు వచ్చేసరికి మాత్రం అంత పర్ఫెక్ట్ గా పోట్రే అయితే కాలేదు. ఇక హర్రర్ ఎలిమెంట్స్ ని క్రియేట్ చేయడంలో దర్శకుడు కొద్దిగా తడబడ్డాడు. ఇక ఈ సినిమా స్టార్ట్ అయిన కొద్దిసేపటికే ప్రేక్షకుడికి కొంతవరకు బోర్ అయితే కలుగుతుంది. అయితే అసలు ఇవన్నీ జరగడానికి గల కారణం ఏంటి అనేది ముందే ఓపెన్ చేసి దానిలో ట్విస్ట్ ను అలాగే ఉంచి ముందుకు తీసుకెళ్తే బాగుండేది. ఇంకా ఎంతసేపు ప్రేక్షకులు సినిమా చూస్తూనే ఉంటాడు తప్ప ఎంగేజ్ చేసే సీన్ ఒకటి కూడా రాదు.

    ఇక ఇంటర్వెల్లో మాత్రం ఒక చిన్న ట్విస్ట్ ఇచ్చి ఇంటర్ వెల్ బ్యాంగ్ పడినప్పటికీ హార్రర్ ఎలిమెంట్స్ కూడా అప్పుడే ప్రేక్షకుడిని కొంతవరకు మెప్పిస్తాయి. ఇక ఆ తర్వాత సెకండ్ హాఫ్ లో మాత్రం ఈ సినిమా ప్రేక్షకుడి ఓపికకు పరీక్ష పెడుతుందనే చెప్పాలి. ఇక క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ లు గానీ ఇదంతా ఎవరు చేస్తున్నారు అనే పాయింట్ రివీల్ చేసే క్రమంలో గాని ప్రేక్షకులకు కొంచెం థ్రిల్లింగ్గా అనిపించినప్పటికీ ఓవరాల్ గా ఈ సినిమా మాత్రం ప్రేక్షకుడికి నచ్చే విధంగా అయితే లేదు… దర్శకుడు పేపర్ మీద స్క్రిప్ట్ రాసుకున్నప్పుడు చాలా బాగా రాసుకున్నప్పటికీ అది ఎగ్జిక్యూషన్ కి వచ్చేసరికి మాత్రం చాలా లాజిక్కులు మిస్ అయినట్టుగా మనకు కనిపిస్తుంది…

    ఆర్టిస్టుల పర్ఫామెన్స్

    ఇక పర్ఫామెన్స్ విషయానికి వస్తే భరత్ ఈ సినిమాలో తనకు సెట్ అయ్యే ఒక క్యారెక్టర్ లో నటించి మెప్పించారు. ఇక వాణీ భోజన్ కన్ఫ్యూజన్స్ తో కూడిన యాక్టింగ్ ని బాగా చేసి సినిమాను నెక్స్ట్ లెవెల్ లో నిలపడానికి చాలా వరకు ప్రయత్నం అయితే చేసింది. ఇక మిగిలిన ఆర్టిస్టులందరూ కూడా కొంతవరకు ఓకే అనిపించినప్పటికీ వాళ్ళ పర్ఫామెన్స్ తో సినిమాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లడంలో మాత్రం చాలా వరకు ఇంపాక్ట్ అయితే చూపించలేదనే చెప్పాలి. ఇక దర్శకుడు రాసుకున్న క్యారెక్టర్స్ లో కూడా పెద్దగా దమ్ము లేకపోవడం తో వాళ్ళ పాత్రలు సినిమాకి ఏ మాత్రం ప్లస్ అయితే అవ్వలేదు.

    టెక్నికల్ అంశాలు

    ఇక టెక్నికల్ అంశాల విషయానికి వస్తే ఎస్ ఎన్ ప్రసాద్ ఇచ్చిన మ్యూజిక్ సినిమాకి చాలా బాగా ప్లస్ అయింది. ఇక బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అయితే కొన్ని సీన్లలో హార్రర్ ఎలిమెంట్స్ కి చాలా బాగా వర్క్ అయిందనే చెప్పాలి. ఇక మొత్తానికైతే ఈ సినిమా టెక్నికల్ గా కొంతవరకు బాగున్నప్పటికీ, ఎడిటింగ్ లో ఇంకాస్త జాగ్రత్తలు తీసుకొని ఉంటే బాగుండేది. ఇక విజువల్స్ పరంగా కూడా ఈ సినిమా సెకండ్ హాఫ్ అంత చీకట్లోనే నడుస్తూ ఉంటుంది. కాబట్టి సినిమాటోగ్రఫీ కూడా ఈ సినిమాకి చాలావరకు హెల్ప్ అయిందనే చెప్పాలి. ఇక ఈ సినిమాకి ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఓకే అనిపించేలా ఉన్నాయి…

    ప్లస్ పాయింట్స్

    భరత్
    బ్యాగ్రౌండ్ మ్యూజిక్

    మైనస్ పాయింట్స్

    డైరెక్షన్..
    హార్రర్ ఎలిమెంట్స్ పెద్దగా ఇంపాక్ట్ చూపించకపోవడం…
    లాజిక్స్ మిస్ అవ్వడం…

    రేటింగ్

    ఈ సినిమాకి మేమిచ్చే రేటింగ్ 1.5/5

    చివరి లైన్

    హార్రర్ సినిమాలో ఉండాల్సిన హార్రర్ ఎలిమెంట్స్ మిస్ అయ్యాయి…