Homeఎంటర్టైన్మెంట్మూవీ రివ్యూమెగా అల్లుడి సూపర్ మచ్చి టీజర్ రిలీజ్.. మరో హిట్ ఖాయం?

మెగా అల్లుడి సూపర్ మచ్చి టీజర్ రిలీజ్.. మరో హిట్ ఖాయం?

పులి వాసు దర్శకత్వంలో త్వరలోనే తెరకెక్కనున్న సినిమా ‘సూపర్ మచ్చి’. ఇక ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ భర్త కళ్యాణ్ దేవ్ హీరోగా నటించాడు. కళ్యాణ్ తొలిసారిగా విజేత సినిమా తో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైనా సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాతో కొంత గుర్తింపు తెచ్చుకోగా మరింత సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నాడు కళ్యాణ్. దీంతో మొత్తానికి సూపర్ మచ్చి సినిమాలో అవకాశం అందుకున్నాడు.

ఇక ఈ సినిమాలో రియా చక్రవర్తి, రచిత రామ్ కీలక పాత్రల్లో నటించారు. ఇదిలా ఉంటే తాజాగా దీపావళి సందర్భంగా ఈ సినిమా నుండి టీజర్ విడుదలైంది. ప్రస్తుతం ఈ టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ గా రూపొందనుంది. ఇక టీజర్ లో చుసినట్లయితే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్, తనికెళ్ల భరణి, పోసాని, ప్రగతి కూడా నటించారు.

ఈ సినిమాను రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై రిజ్వాన్, ఖుషి నిర్మించారు. ఈ సినిమా ఇదివరకే విడుదల అవ్వాల్సి ఉండగా కోవిడ్ కారణంగా వాయిదా పడింది. మొత్తానికి దీపావళి సందర్భంగా టీజర్ ప్రేక్షకుల ముందుకు రాగా ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది. ఇందులో ఇదివరకే పాటలు విడుదల కాగా బాగా రెస్పాన్స్ అందుకుంది. ఇక ఈ సినిమాతో కళ్యాణ్ దేవ్ ఎటువంటి సక్సెస్ అందుకుంటాడో చూడాలి.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular