తమిళ్ స్టార్ హీరో కార్తీకి తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉంది. ఆయన నటించిన చాలా సినిమాలు తెలుగులో విజయంతంగా ఆడాయి. లాక్ డౌన్ తర్వాత ‘సుల్తాన్’ అంటూ.. భారీ యాక్షన్ థ్రిల్లర్ తో వచ్చేశాడు. మంచి ప్రమోషన్ చేయడంతో సినిమా విడుదలకు ముందే భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి, ఆ అంచనాలను సుల్తాన్ అందుకున్నాడా? లేదా? అన్నది చూద్దాం.
కథః
విలన్ల నుంచి తన గ్రామాన్ని కాపాడిన ఓ యువకుడి కథే ఈ చిత్రం. ఇష్టారాజ్యంగా చెలరేగిపోయే రౌడీ మూకలను ఒంటరిగా ఎదుర్కొంటాడు సుల్తాన్. ఈ క్రమంలో అతనికి ఎదురైన అడ్డంకులు ఏంటీ? వాటిని ఎలా అధిగమించాడు? అన్నది థియేటర్లోనే చూడాలి.
కథనంః
కార్తీ గత సినిమాలన్నీ జాయ్ ఫుల్ గా ఉంటాయి. అతని స్మైల్ కు సైతం ఫ్యాన్స్ ఉన్నారు. కాబట్టి.. ఫస్టాఫ్ మొత్తం ఈ యాంగిల్ తోనే నడిపించాడు దర్శకుడు. ఫన్ రైడ్ గా సాగిపోతూ ఉంటుంది. అయితే.. కొన్ని సన్నివేశాలు ఎక్కడో చూపించినట్టుగా అనిపించినప్పటికీ.. వాటికి కొత్తదనం అద్దడంతో మంచి ఫీల్ అనిపిస్తుంది. సినిమాలో ప్రీ ఇంటర్వెల్ సీన్స్ ఆసక్తికరంగా ఉన్నాయి. ఇక, ఆన్ స్క్రీన్ పై కార్తీ-రష్మిక జోడీ చెలరేగిపోయింది. వారిద్దరి మధ్య కెమిస్ట్రీ కేక ఎట్టించింది. సెకండ్ హాఫ్ లోకి ఎంటరైన తర్వాత ఎమోషనల్ గా సాగుతుంది కథ.
పెర్ఫార్మెన్స్ః
ఈ సినిమాలో యాజ్ యూజువల్ గా కార్తీ అదరగొట్టేశాడు. తనదైన యాక్టింగ్ తో దుమ్ములేపాడు. రౌడీలను ఎదుర్కొనే ధీరోదాత్తుడిగా కార్తీ అద్భుతంగా నటించాడు. ఈ కథకు కార్తీ బాడీ సరిగ్గా సరిపోయింది. ఇక, హీరోయిన్ రష్మిక అందం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. కోలీవుడ్లో ఈ సినిమాతోనే ఎంటరైన బ్యూటీ.. మంచి ఎంట్రీ మూవీ దొరికిందనే చెప్పాలి. ఇతర పాత్రల్లో నటించిన నెపోలియన్, యోగిబాబు, నవాబ్ షా, శరత్ తమ పాత్రలకు న్యాయం చేశారు. ఇక, ఈ సినిమాకు మరో ప్రధాన బలం బ్యాగ్రౌండ్ మ్యూజిక్. యువన్ శంకర్ రాజా అదరగొట్టేశాడు. అయితే.. వివేక్, మెర్విన్ పాటలు మాత్రం అంతగా ఆకట్టుకోవు. మొత్తానికి ఈ సినిమా ఫన్ అండ్ ఎమోషనల్ రైడ్ గా సాగిపోయింది.
అయితే.. తమిళనాట ఈ సినిమాకు ఎదురు లేనప్పటికీ.. తెలుగులోకి వచ్చే సరికి ఇది డబ్బింగ్ సినిమా. ఎదురుగా వైల్డ్ డాగ్ మూవీ ఉంది. మరి, ఆడియన్స్ ఎటువైపు మొగ్గుచూపుతారన్నదే ప్రశ్న. దానిపైనే ఈ సినిమా రిజల్ట్ ఆధారపడి ఉంటుంది.
బలాలుః
కార్తీ నటన, కొన్ని సన్నివేశాలు, బ్యాగ్రౌండ్ మ్యూజిక్
బలహీనతలుః
రొటీన్ కథ, సాగదీత సన్నివేశాలు
లాస్ట్ లైన్ః ‘సుల్తాన్’ గెలుపు ఈజీకాదు
రేటింగ్ః 2.5/5