Homeప్రత్యేకంJoruga Husharuga Review: జోరుగా హుషారుగా ఫుల్ మూవీ రివ్యూ...

Joruga Husharuga Review: జోరుగా హుషారుగా ఫుల్ మూవీ రివ్యూ…

Joruga Husharuga Review: ప్రతి వారం సినిమా ఇండస్ట్రీలో కొన్ని సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి అందులో కొన్ని సస్పెన్స్ థ్రిల్లర్స్ గా తెరకెక్కితే మరికొన్ని లవ్ స్టోరీస్ గా మన ముందుకు వచ్చి అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి.ఇక అదే రీతిలో ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా జోరుగా హుషారుగా…ఈ సినిమా లో విరాజ్ అశ్విన్ హీరో గా నటించాడు ఇంతకు ముందు బేబీ సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న విరాజ్ అశ్విన్ సోలో హీరో గా ఈ సినిమాలో నటించి తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ అయితే ఏర్పాటు చేసుకోవాలనే ప్రయత్నం చేశాడు.ఇక మరి ఈ సినిమా సోలో హీరోగా విరాజ్ అశ్విన్ కి మంచి విజయాన్ని అందించిందా..? ఈ సినిమాతో సోలో హీరోగా విరాజ్ అశ్విన్ ఇండస్ట్రీలో సెటిల్ అయిపోయినట్టేనా..? అనే విషయాల మీద క్లారిటీ ఇస్తూనే అసలు ఈ సినిమా ఎలా ఉంది అనే విషయం కూడా మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం…

ఇక ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే సంతోష్ ( విరాజ్ అశ్విన్),ఆనంద్ ( మధునందన్ ) ఇద్దరూ ఒకే ఆఫీస్ లో పని చేస్తూ ఉంటారు.ఇక ఇదే ఆఫీసులో సంతోష్ లవర్ అయిన నిత్య( పూజిత పొన్నాడ) కూడా అతనికి చెప్పకుండా అతని ఆఫీస్ లోనే టీం లీడ్ గా జాయిన్ అవుతుంది. ఇదే ప్రాసెస్ లో వాళ్ళు ప్రేమించుకున్న విషయం ఆఫీస్ లో ఎవరికీ తెలియకూడదు తెలిస్తే వీళ్లిద్దరి జాబ్ పోతుంది అనే ఉద్దేశ్యం తో వీళ్ళిద్దరూ కలిసి ఎవరికి వాళ్లు తెలియనట్టుగా నటిస్తూ ఉంటారు. ఇక ఇదే క్రమంలో ఆనంద్ తనకి ఇంత ఏజ్ వచ్చినా కూడా ఇప్పటికీ పెళ్లి కావట్లేదు అని బాధపడుతూ ఉంటాడు. అయితే అదే ఆఫీస్ లో పనిచేస్తున్న సుచిత్ర( సిరి హనుమంత్) ఆనంద్ ని లవ్ చేస్తుంది.

అయితే వీళ్ళిద్దరి ప్రేమ విషయాన్ని తెలుసుకున్న సంతోష్ వీళ్లిద్దరిని కలపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అయితే ఈ క్రమంలోనే ఆనంద్ వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నాడు అనే ఒక పెద్ద షాకింగ్ న్యూస్ అయితే తెలుస్తుంది. అలాగే సంతోష్ వాళ్ళ నాన్న ఊళ్ళో 20 లక్షల వరకు అప్పు చేసి పెడతాడు ఇప్పుడు అది తీర్చాల్సిన బాధ్యత తన కొడుకు మీద ఉందన్నట్టుగా మాట్లాడుతూ ఉంటాడు. మరి సంతోష్ తన లవర్ ని పెళ్లి చేసుకున్నాడా అలాగే వాళ్ళ నాన్న పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకొని 20 లక్షల అప్పు తీర్చాడా లేదా అనే విషయాలు తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే…

ఇక ఈ సినిమా విశ్లేషణ విషయానికి వస్తే ఈ సినిమాని కంప్లీట్ లవ్ స్టోరీ గా తెరకెక్కించాలని దర్శకుడు ప్రయత్నం చేశాడు. ఏదైనా ఆయన ప్రయత్నం బాగున్నప్పటికీ సినిమా స్టోరీలో అంత దమ్ము లేకపోవడం వల్ల సినిమా అధ్యంతం ఒకే ఫ్లో లో సాగుతుంది తప్ప ఎక్కడ కూడా మనకు హై అనిపించే సీన్స్ గాని, హై ఇచ్చే ఎలిమెంట్స్ గాని సినిమాలో కనిపించవు. ఇక ఆఫీస్ చుట్టే సినిమాను తిప్పుతూ ఉంటాడు అదంతా కొంచెం బోరింగ్ గా అనిపిస్తూ ఉంటుంది. నిజానికి దర్శకుడు ఇలాంటి కథని ఎంచుకున్నప్పుడు కొన్ని ట్వీస్టులతో స్క్రీన్ ప్లే ని గ్రిప్పింగ్ గా రాసుకొని ఉంటే అది సినిమా కి బాగా హెల్ప్ అయ్యేది.ప ్రతి సీన్ కూడా బాగా ఎలివేట్ అయ్యేది. అలాగే సీన్ కి సీన్ కి చివర్లో కన్ క్లూజన్ లేకుండా మధ్యలోనే ముగించినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటివన్నీ మొదటి సినిమా డైరెక్టర్లు చేసే తప్పులు వీటిని ఎస్టిమేట్ చేసి వాటిని ముందుగానే బాగా రాసుకోవాలి.ప్రతి సీన్ ని బాగా రాసుకొని ఒక సీన్ ఇంకో సీన్ కి లీడ్ ఇవ్వాలి అనే విషయాలని రైటింగ్ స్టేజ్ లోనే క్లారిటీగా రాసుకోవాలి. అలాంటి మిస్టేక్స్ ఏమీ లేకపోతేనే సినిమా అనేది కరెక్ట్ గా వస్తుంది.ఇక అందులో భాగంగానే రైటింగ్ అనేది చాలా వీక్ గా ఉంది. అక్కడక్కడ చిన్న చిన్న జోకులను రాసి రైటింగ్ స్టాండర్డ్ కొంత వరకు చూపించినప్పటికీ సినిమా మొత్తం అధ్యంతం రైటింగ్ పరంగా పెద్ద గొప్పగా అయితే లేదు. ఇక డైరెక్షన్ పరంగా కూడా సినిమా ఓకే అనిపిస్తుంది తప్ప ఎక్స్ ట్రా ఆర్డినరీ అయితే అనిపించదు…

ఈ సినిమాకి ఎంచుకున్న పాయింట్ ని స్ట్రైయిట్ గా చెప్పే ప్రయత్నం చేశాడు.కానీ చిన్న చిన్న ట్విస్టులను యాడ్ చేసి స్క్రీన్ ప్లే ని రాసుకొని ఉంటే ప్రేక్షకుడిని కొంతవరకు థ్రిల్ కి గురి చేసేది. అలా చేసిన కూడా సినిమా అనేది బాగుండేది. ఎందుకంటే ఒకే ప్లాట్ లో సినిమా ఉండడం వల్ల చూసే ప్రేక్షకుడికి బోర్ కొడుతుంది. ఇలాంటి టైం లో కొన్ని సబ్ ప్లాట్స్ ని వాడుకోవాలి లేదా స్క్రీన్ ప్లే లో కొన్ని ట్విస్ట్ లను అయిన ఆడ్ చేస్తూ కొత్త రకం స్క్రీన్ ప్లే రాసుకోవాలి ఇవన్నీ ఈ సినిమాలో మిస్సయ్యాయి అందుకే ఈ సినిమా ప్రేక్షకుల్ని పెద్దగా ఆకట్టుకోలేదనే చెప్పాలి…

ఇక నటినటుల పర్ఫామెన్స్ విషయానికి వస్తే విరాజ్ అశ్విన్ తన క్యారెక్టర్ లో ఒదిగిపోయి చాలా మంచి పర్ఫామెన్స్ అయితే ఇచ్చాడు. బేబీ తర్వాత తనకు ఒక మంచి గుర్తింపు ఉన్న క్యారెక్టర్ అయితే పడిందనే చెప్పాలి. యాక్టింగ్ లో వేరియేషన్స్ ని కూడా చూపిస్తూ బేబీ సినిమాకి ఈ సినిమాకి నటన పరంగా బాగా ఇంప్రూవ్ అయ్యాడు…ఇక హీరోయిన్ గా చేసిన పూజిత పొన్నాడ కూడా తనదైన రీతిలో నటనని కనబరుస్తూ తన క్యారెక్టర్ లో తను ఒదిగిపోయి నటించింది…ఇక మధు నందన్, సిరి హనుమంతు, సాయికుమార్, రోహిణి లాంటి వారు వాళ్ల పాత్రల పరిధిని దాటకుండా బాగా ఫాలో అవుతూ ఎక్కడ కూడా ఏ మిస్టేక్స్ లేకుండా వాళ్ళ పాత్రను పోషించారు.ఇక ముఖ్యంగా సాయికుమార్, రోహిణి పాత్రలు ఎమోషనల్ గా ప్రేక్షకుల్ని కొంతవరకు కట్టిపడేసాయనే చెప్పాలి.కొన్ని సీన్లల్లో సాయికుమార్, రోహిణి ఇచ్చిన పర్ఫామెన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉందనే చెప్పాలి…

ఇక టెక్నికల్ విషయాలకు వస్తే మ్యూజిక్ మాత్రం ఈ సినిమాకు ఏమాత్రం హెల్ప్ కాలేకపోయింది. ఇక బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా అనుకున్న రేంజ్ లో లేకపోవడంతో కొన్ని సీన్లు కొంతవరకు బాగా తీయాలని ప్రయత్నం చేసినప్పటికీ బిజిఎం పెద్దగా ఎఫెక్ట్ చూపించకపోవడంతో సీన్లు అన్ని ఎలివెట్ అవ్వకుండా డల్ అయిపోయాయి…సినిమాటోగ్రాఫర్ అయిన మహి రెడ్డి పొందుగుల కొంతవరకు తన విజువల్స్ ని బాగా చూపించే ప్రయత్నం అయితే చేశాడు…ఇక ప్రొడక్షన్ వాల్యూస్ విషయానికి వస్తే కొంతవరకు పర్లేదు అనిపించాయి…ఇక ఎడిటర్ మార్తాండ్ కె వెంకటేష్ చాలా సీనియర్ ఎడిటర్ అయినప్పటికీ కొన్ని సీన్లు లాగ్ అయి బోరింగ్ గా అనిపించాయి వాటిని కొంతవరకు కట్ చేసి ఉంటే బాగుండేది…

ఈ సినిమాలో ఉన్న ప్లస్ పాయింట్స్ ఏంటంటే

విరాజ్ అశ్విన్ యాక్టింగ్
కొన్ని ఎమోషనల్ సీన్స్
కొన్ని సీన్లలో సినిమాటోగ్రఫీ బాగుంది…

ఇక ఈ సినిమాలో ఉన్న మైనస్ పాయింట్స్ ఏంటంటే…

కథ
స్క్రీన్ ప్లే
ఒకే లొకేషన్ లో సీన్లు రిపీట్ అవ్వడం వల్ల అది కూడా సినిమాకి మైనస్ గా మారింది…

ఇక ఈ సినిమాకు మేము ఇచ్చే రేటింగ్ 2/5

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
RELATED ARTICLES

Most Popular