Simbaa Movie Review: ‘ సింబా’ ఫుల్ మూవీ రివ్యూ…

'మురళి మనోహర్ రెడ్డి' ని దర్శకుడిగా పరిచయం చేస్తూ 'సింబా' అనే ఒక సినిమా తీశాడు. అయితే ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది మేకర్స్ అనుకున్న సక్సెస్ ని సాధించిందా లేదా అనే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం...

Written By: Gopi, Updated On : August 9, 2024 10:56 am

Simbaa Movie Review

Follow us on

Simbaa Movie Review: తెలుగు సినిమా ఇండస్ట్రీ ప్రస్తుతం కొత్త పుంతలు తొక్కుతుంది. చిన్న దర్శకులు కూడా మంచి కాన్సెప్ట్ లతో సినిమాలు చేయడమే కాకుండా సూపర్ సక్సెస్ లను అందుకుంటున్నారు. దీనివల్ల ఇండియాలోనే తెలుగు సినిమా ఇండస్ట్రీ గురించి చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు… ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాకి దర్శకుడు ‘సంపత్ నంది ‘ కథ మాటలు అందిస్తూ వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ గా కూడా కొనసాగారు. ఇక గతంలో కూడా గాలిపటం, పేపర్ బాయ్ లాంటి సినిమాలను నిర్మించారు. ఇక ప్రస్తుతం ఇప్పుడు కూడా తన దగ్గర డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో పనిచేసిన ‘మురళి మనోహర్ రెడ్డి’ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ ‘సింబా’ అనే ఒక సినిమా తీశాడు. అయితే ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది మేకర్స్ అనుకున్న సక్సెస్ ని సాధించిందా లేదా అనే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

కథ

ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే హైదరాబాద్ లో ఒక దారుణమైన హత్య జరుగుతుంది. ఇక దానికి తగ్గట్టుగానే పోలీసులు కూడా ఇన్వెస్టిగేషన్ ను చాలా ముమ్మరంగా చేస్తూ ఉంటారు. అనుముల అక్షిక (అనసూయ) స్కూల్ టీచర్ గా పనిచేస్తుంది. అయితే ఆ హత్యకు ఈమెకు సంబంధం ఉందని పోలీసులు గమనిస్తారు. ఇక ఈమెతో పాటుగా ఇన్వెస్టిగెటివ్ జర్నలిస్టు గా పని చేస్తున్న ఫాజిల్ (శ్రీరామ్ మాగంటి) ఇద్దరికీ ఈ హత్యతో సంబంధం ఉందని పోలీసులు వీళ్ళను అరెస్ట్ చేస్తారు. ఇక ఇదిలా ఉంటే వీళ్లు జైల్లో ఉన్నప్పుడే వీళ్ళిద్దరిని చంపడానికి ఒక వ్యక్తి వచ్చి పోలీస్ స్టేషన్ లోనే దారుణమైన హత్యకు గురవుతాడు… అసలు ఈ హత్యల వెనుక ఎవరున్నారు ఆక్షిక, ఫాజిల్ ని ఎవరైనా ఇరికించారా లేదంటే వాళ్లే ఈ హత్యలను చేస్తున్నారా అనే విషయాలు తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే…

విశ్లేషణ

ఈ సినిమా విశ్లేషణ విషయానికి వస్తే ఈ సినిమాకి దర్శకుడుగా వ్యవహరించిన ‘మురళీ మనోహర్ రెడ్డి’ సినిమాను స్టార్ట్ చేసినప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ గా స్టార్ట్ చేశారు. ప్రేక్షకుడికి సినిమా చూడాలి అనే విధంగా ఒక క్యూరియాసిటి కలిగించేలా ఓపెన్ చేసిన విధానం అయితే చాలా బాగుంది. కానీ సినిమా ముందుకు సాగుతున్న కొద్దీ సినిమా మీద ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ముఖ్యంగా బలమైన సీన్లు రాసుకోకపోవడం రొటీన్ వే లో ఇన్వెస్టిగేషన్ సాగడం ఇక మధ్య మధ్యలో ఏం జరగబోతుంది అనేది ఈ సినిమా చూసిన ఆడియన్ ముందుగానే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాడు… నిజానికి ఈ కథని సంపత్ నంది రాశాడు. ఇక సంపత్ నంది గత సినిమాలను కనక చూసుకుంటే ఆయన కెరియర్లో ఆయనకు ఒక్కటి కూడా సరైన సక్సెస్ అయితే లేదు.

ఎంతసేపు రొటీన్ కమర్షియల్ సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తాడు. కానీ ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ ని ఎంచుకున్నప్పుడు అందులో రొటీన్ అంశాలు లేకుండా ఆ స్టోరీకి తగ్గట్టుగా కొత్త సీన్లు రాసుకుంటే మనం చెప్పాలనుకున్న పాయింట్ ఆడియన్స్ కి చాలా ఈజీగా రీచ్ అవుతుంది. అలా కాకుండా ప్రతిదాంట్లో రొటీన్ రొట్ట ఫార్ములా కథ, స్క్రీన్ ప్లే రాసుకుంటే సినిమాను ఎవరు చూస్తారు. నిజానికి సంపత్ నంది అంత గొప్ప దర్శకుడు ఏం కాదు ఏదో ఫ్లోక్ లో దర్శకుడుగా వచ్చాడు. అంతే తప్ప ఆయన పెద్దగా టాలెంటెడ్ డైరెక్టరైతే కాదు. ఇక ఆ విషయం ఈ సినిమాలు చూస్తేనే మనకు అర్థమైపోతుంది. తనతో పాటు ఇండస్ట్రీకి వచ్చిన అనిల్ రావిపూడి హరీష్ శంకర్ లాంటి వాళ్ళు మంచి టాలెంటెడ్ డైరెక్టర్స్ గా గుర్తింపు సంపాదించుకుంటే ఈయన మాత్రం ఇప్పటికీ ఒక మీడియం రేంజ్ హీరోతో సినిమా చేయడానికి కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాడు. ఇక ఇలాంటి సందర్భంలో ఆయన రాసిన కథతో ఆయన దగ్గర అసిస్టెంట్ గా చేసిన వ్యక్తికి డైరెక్షన్ అప్పగించి సినిమా చేయించడం అనేది అంత పర్ఫెక్ట్ విషయమైతే కాదు.

ఇక పేపర్ బాయ్, ఓదెల రైల్వే స్టేషన్, గాలిపటం లాంటి సినిమాలు ఎలాగైతే బిలో ఆవరేజ్ గా నిలిచాయో ఈ సినిమా అంతకంటే దారుణంగా ఉందనే చెప్పాలి. ఇక జగపతిబాబు క్యారెక్టర్ ని ముందుగానే పోస్టర్స్ లో గాని, ఈవెంట్స్ లో గాని ఎలివేట్ చేశారు. కాబట్టి ఆయన పాత్ర అనేది సినిమా చివరి వరకు హోల్డ్ చేస్తూ వచ్చారు. ఇక ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరికి ఈ హత్యల వెనుక ఉన్నది జగపతిబాబు అని క్లియర్ గా అర్థం అవుతుంది. ఎందుకంటే ఆయన సినిమాలో ఉంటె మాత్రం చిన్న క్యారెక్టర్ అయితే చేయలేడు. ఒక మంచి క్యారెక్టర్ అయితేనే ఆయన చేయడానికి ఒప్పుకుంటారు. కాబట్టి సినిమాలో జరుగుతున్న హత్యలన్నింటికీ మూల కారణం ఆయనే అని చాలా స్పష్టంగా తెలిసిపోతుంది… మొత్తానికైతే ఇది ప్రేక్షకుడిని ఇంపాక్ట్ చేసే సినిమా అయితే కాదు…

ఆర్టిస్టుల పర్ఫామెన్స్

ఇక ఆర్టిస్టులో పర్ఫామెన్స్ విషయానికి వస్తే అనసూయ తన పాత్రలో సెటిల్డ్ పెర్ఫార్మన్స్ అయితే ఇచ్చింది. ఇక శ్రీనాథ్ కూడా ఒక మంచి పర్ఫామెన్స్ ను ఇచ్చి సినిమాని ముందుకు తీసుకెళ్లడంలో ఆయన కూడా తన వంతు ప్రయత్నం అయితే చేశాడు. జగపతిబాబు కనిపించేది తక్కువ సమయం అయినప్పటికీ ఆయన క్యారెక్టర్ లో ఉన్న ఆర్క్ ను చాలా బాగా ఎస్టాబ్లిష్ చేస్తూ ఆయన నటించాడు…

టెక్నికల్ అంశాలు

ఇక ఈ సినిమా టెక్నికల్ అంశాల విషయానికి వస్తే మ్యూజిక్ డైరెక్టర్ కృష్ణ సౌరబ్ ఇచ్చిన బ్యాగ్రౌండ్ స్కోర్ ఒకటే బాగుంది. సాంగ్స్ పెద్దగా ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయలేకపోయాయి. ఇంకా సినిమాటోగ్రాఫర్ అందించిన విజువల్స్ కొంతవరకు పర్లేదు అనిపించినప్పటికీ సినిమా కథ లోనే పెద్దగా కొత్తదనం లేకపోవడంతో టెక్నీషియన్స్ కూడా వాళ్ల పూర్తి ఎఫర్ట్ పెట్టి వర్క్ చేసినట్టుగా కనిపించడం లేదు…

ప్లస్ పాయింట్స్

జగపతి బాబు , అనసూయ యాక్టింగ్…
సెకండాఫ్ లో వచ్చే కొన్ని సీన్స్…

మైనస్ పాయింట్స్

కథ
స్క్రీన్ ప్లే
బోరింగ్ సీన్స్

రేటింగ్

ఇక ఈ సినిమాకి మేమిచ్చే రేటింగ్ 1.5/5

చివరి లైన్
కొత్తదనం ఏమీ లేని ఒక బోరింగ్ సినిమా…