https://oktelugu.com/

Citadel Movie Review: సిటాడెల్ ఫుల్ సీరీస్ రివ్యూ…

ఇక ప్రస్తుతం ఆమె వరుణ్ ధావన్ తో కలిసి చేసిన 'సెటాడెల్ ' అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమా ఎలా ఉంది ప్రేక్షకులను మెప్పించిందా? లేదా అనే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం...

Written By:
  • Gopi
  • , Updated On : November 7, 2024 / 12:17 PM IST

    Citadel Full Series Review...

    Follow us on

    Citadel Movie Review:  సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నటువంటి సమంత ప్రస్తుతం తనదైన రీతిలో సినిమాలు చేసుకుంటూ ముందుకు దూసుకెళుతున్న ఈ నటి నాగచైతన్య పెళ్లి చేసుకొని ఆ తర్వాత విడాకులు తీసుకున్న విషయం మనకు తెలిసిందే. ఇక అప్పటినుంచి ఆమె వరుసగా సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగడమే కాకుండా ప్రేక్షకులందరిని మెప్పించే సినిమాలు చేయడానికి ఎప్పుడు ముందు వరుసలో ఉంటున్నారు. ఇక ప్రస్తుతం ఆమె వరుణ్ ధావన్ తో కలిసి చేసిన ‘సెటాడెల్ ‘ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమా ఎలా ఉంది ప్రేక్షకులను మెప్పించిందా? లేదా అనే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

    కథ

    ఇక ఈ సిరీస్ కథ విషయానికి వస్తే హాని బన్నీ అనే ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్లకు నదియా అనే పాప పుడుతుంది… అనుకోకుండా ఆ పాప ఒక ప్రమాదంలో చిక్కుకుంటుంది. హనీ బన్నీ ఇద్దరు విడిపోయినా కూడా పాప కోసం ఒకటై పోరాటం చేసి ఆ పాపను కాపాడటమే వాళ్ల లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతారు. మరి వీళ్ళు సిరీస్ చివర్లో పాపని కాపాడారా లేదా అనే విషయాలు తెలియాలంటే మీరు ఈ సిరీస్ చూడాల్సిందే…

    విశ్లేషణ

    ఇక ఈ సిరీస్ విశ్లేషణ విషయానికి వస్తే ఈ సిరీస్ మొదటి ఎపిసోడ్ లో ఎస్టాబ్లిష్ చేశారు. ఇక రెండో వైపు నుంచి సీరీస్ చాలా ఫాస్ట్ గా మూవ్ అవ్వడమే కాకుండా వరుణ్ ధావన్ సమంతల మధ్య వచ్చే కన్ఫ్లిక్టు లను కూడా చాలా బాగా డిజైన్ చేశారు… అలాగే వరుణ్ ధవన్ సమంతల మధ్య ఉండే రొమాంటిక్ సీన్స్ నెక్స్ట్ లేవల్లో చూపించారు. ఇక వీళ్ళు ఎందుకు విడిపోయారు అనేదానికి సంబంధించిన కన్ క్లూజన్ కూడా చాలా క్లియర్ కట్ గా ఇచ్చే ప్రయత్నం చేశారు… అయితే ఈ సిరీస్ కి అక్కడక్కడ కొంచెం బ్యాగ్రౌండ్ స్కోర్ మైనస్ గా మారినప్పటికి యాక్షన్ ఎపిసోడ్స్ మాత్రం సినిమాలో చాలా హైలెట్ గా నిలిచాయనే చెప్పాలి…

    ప్రతి ఎపిసోడ్ ఎండింగ్ లో ఒక హై మూమెంట్ తో ఎండ్ చేసి సిరీస్ ని చాలా ఉన్నతమైన స్థాయిలో నిలపాలని ప్రయత్నం అయితే చేశారు. అయినప్పటికీ ఈ సిరీస్ లో మాత్రం కొంతవరకు కొన్నిచోట్ల ప్రేక్షకులు నిరాశ చెందక తప్పదనే చెప్పాలి. మేజర్ గా నాన్ లినియర్ స్క్రీన్ ప్లే కాకుండా లీనియర్ స్క్రీన్ ప్లే లో ఓపెన్ చేసి దానికి ఒక రీజనల్ ఎలిమెంట్స్ ని యాడ్ చేసి సిరీస్ లని ముగించేస్తే బాగుండేది… రాజ్ డీకే సిరీస్ ను పోలిస్తే ఇది చాలావరకు తగ్గిందనే చెప్పాలి… ప్రతి విషయంలో చాలా క్షుణ్ణంగా చూసుకుంటూ ముందుకెళ్లే వీళ్ళు ఈ సిరీస్ విషయంలో మాత్రం కొంచెం నిర్లక్ష్యం వహించారనే చెప్పాలి. ఇక ఈ సిరీస్ మొదట కొంచెం ఒకే అనిపించినప్పటికి మధ్యలో చాలా వరకు బోర్ కొట్టేస్తుంది. ఇక చివర్లో కొంతవరకు హై ఎలిమెంట్స్ ను ఆడ్ చేసినప్పటికి అప్పటికే ఈ సిరీస్ ని చూడాలి అనుకున్న ప్రేక్షకుడి మైండ్ సెట్ చేంజ్ అయ్యే అవకాశం అయితే ఉంది…

    ఆర్టిస్టుల పర్ఫామెన్స్

    ఇక ఆర్టిస్టుల పర్ఫామెన్స్ విషయానికొస్తే ఈ సిరీస్ లో వరుణ్ దావన్ తనదైన రీతిలో నటించి మెప్పించే ప్రయత్నం అయితే చేశాడు. ఇక గత సినిమాలతో పోలిస్తే వరుణ్ ధావన్ ఈ సిరీస్ లో చాలా బాగా నటించాడనే చెప్పాలి. ఇక సమంత అయితే నెక్స్ట్ లెవెల్ పర్ఫామెన్స్ ను ఇచ్చింది. ఇక యాక్షన్ ఎపిసోడ్స్ లో కూడా కుమ్మేసిందనే చెప్పాలి. తన నటన ఏ రేంజ్ లో ఉంటుందో ఈ సిరీస్ లో
    చూపించింది. నిజంగా తల్లి బిడ్డల మధ్య వచ్చే ఎమోషన్ సీన్స్ లో మాత్రం చాలా ఇష్టపడి నటించిందనే చెప్పాలి. ప్రస్తుతం తను చేస్తున్న సినిమాల విషయం ఎలా ఉన్నా కూడా ఈ సిరీస్ తో మాత్రం ఆమె ప్రేక్షకులందరిని మెప్పించే ప్రయత్నం చేసింది. ఇక ఈ సిరీస్ లో గ్లామర్ షో కూడా ఎక్కువగానే చేసిన సమంత పర్ఫామెన్స్ లో మాత్రం ఎక్కడ తగ్గలేదనే చెప్పాలి…ఇక మిగిలిన ఆర్టిస్టులు అందరూ వాళ్ళ పాత్రల పరిధి మేరకు ఓకే అనిపించేలా నటించి మెప్పించారు. ఇక మొత్తానికైతే ప్రతి ఒక్కరు ఈ సిరీస్ ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేశారు…

    టెక్నికల్ అంశాలు

    ఇక టెక్నికల్ అంశాల విషయానికి వస్తే ఈ సినిమాలో మ్యూజిక్ అంత పెద్దగా ప్రేక్షకులను మెప్పించలేదు. ఇక బ్యాగ్రౌండ్ స్కోర్ అయితే మరి దారుణంగా ఉందనే చెప్పాలి… ఇక విజువల్స్ పరంగా చూసుకుంటే ఈ సినిమా కొంతవరకు పర్లేదు అనిపించినప్పటికి తనదైన రీతిలో విజువల్స్ ని అందించలేకపోయారనే చెప్పాలి. ఇక మొత్తానికైతే ఈ సినిమా కంటెంట్ పరంగా అయిన విజువల్స్ పరంగా అయిన ప్రేక్షకుడిని చాలా వరకు నిరాశ పరించిందనే చెప్పాలి. ఇక ఈ సినిమాను సక్రమంగా పూర్తి చేసినప్పటికి అక్కడక్కడ మధ్యలో కొన్ని సీన్స్ బోర్ కొట్టించేలా ఉన్నాయి వాటిని కూడా కరెక్ట్ గా కట్ చేసి ఉంటే బాగుండేదనే అభిప్రాయమైతే ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరికి కలుగుతుంది…

    ప్లస్ పాయింట్సవరుణ్ ధావన్ సమంత యాక్టింగ్ బాగుంది…
    రొమాంటిక్ సీన్స్ బాగున్నాయి…
    పాప ఎమోషన్ బాగా వర్కవుట్ అయింది…

    మైనస్ పాయింట్స్

    కథ
    స్క్రీన్ ప్లే
    మ్యూజిక్

    రేటింగ్

    ఈ సీరీస్ రేటింగ్ విషయానికి వస్తే 2.25/5