https://oktelugu.com/

Bhairathi Ranagal Movie Review: బైరతి రణగల్ ఫుల్ మూవీ రివ్యూ…

ప్రస్తుతం ఆయన హీరోగా రణగల్ అనే సినిమా వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది ప్రేక్షకులను మెప్పించిందా? లేదా అనే విషయాన్ని మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం...

Written By:
  • Gopi
  • , Updated On : November 29, 2024 / 12:07 PM IST

    Bhairathi Ranagal Movie Review

    Follow us on

    Bhairathi Ranagal Movie Review: కన్నడ సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న నటుడు శివరాజ్ కుమార్… ఆయన నుంచి ఒక సినిమా వస్తుందంటే కన్నడ ఇండస్ట్రీ తో పాటు యావత్ పాన్ ఇండియాలో కూడా మంచి క్రేజ్ అయితే ఉంటుంది. ఇక ప్రస్తుతం ఆయన హీరోగా రణగల్ అనే సినిమా వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది ప్రేక్షకులను మెప్పించిందా? లేదా అనే విషయాన్ని మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

    కథ

    ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే శివ రాజ్ కుమార్ మొదట ఒక లాయర్ గా తన కెరీయర్ ను మొదలు పెడతాడు. అక్కడ జరిగిన కొన్ని అన్యాయాలను ఎదిరించలేక న్యాయకోటను వదిలి ఒక డాన్ గా అవతరించాలనే ప్రయత్నం అయితే చేస్తాడు. మరి న్యాయాన్ని కాపాడాల్సిన వ్యక్తి అలాంటి నిర్ణయాన్ని ఎందుకు తీసుకున్నాడు. తద్వారా ఆయన ఎలాంటి ఇబ్బందులకు గురయ్యాడనే విషయాలు తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే…

    విశ్లేషణ

    ఇక ఈ సినిమా విశ్లేషణ విషయానికి వస్తే దర్శకుడు నార్తన్ చాలా తను అనుకున్నాడు అనుకున్నట్టు గా తెరకెక్కించే ప్రయత్నం అయితే చేశాడు. నిజానికి మొదట ఈ సినిమా కొంచెం డల్ గా స్టార్ట్ అయినప్పటికి ఆ తర్వాత శివన్న ఎంట్రీ ఇవ్వడంతో సినిమా పరుగులు పెడుతుంది. మొత్తానికైతే ఒక మాస్ సినిమాగా ఈ సినిమాని మనం అభివర్ణించవచ్చు… దర్శకుడు కూడా ఈ సినిమాలో ఎలాంటి కాన్సెప్ట్ అయితే చెప్పాలి అనుకున్నాడో ఆ విషయాన్ని స్ట్రైయిట్ గా చెప్పే ప్రయత్నం అయితే చేశాడు. కానీ ఆ ప్రాసెస్ లోనే ఆయనకు కొంతవరకు క్యారెక్టర్స్ ని ఎలా వాడుకోవాలి అని ఒక చిన్న కన్ఫ్యూజన్ ఎదురవ్వడంతో అది కొంచెం బోర్ గా సాగుతూ ఉంటుంది. తద్వారా సినిమా మీద నార్తన్ ఎక్కువగా ఫోకస్ చేయలేకపోయాడు.

    రైటింగ్ విషయాల్లో చాలా జాగ్రత్తగా తీసుకుంటూ క్యారెక్టర్స్ ను చాలా ఎస్టాబ్లిష్ గా ఎలివేట్ చేసినప్పటికి సినిమా ఫస్ట్ హాఫ్ అయిపోయేసరికి కొంచెం గాడి తప్పినట్టుగా అనిపిస్తుంది. ఇక కొన్ని ఫైట్స్ తో ముందుకు లాగించినప్పటికీ క్లైమాక్స్ విషయంలో మరి కాస్త జాగ్రత్తలు తీసుకొని ఉంటే సినిమా ఇంకొంచెం బెటర్మెంట్ అయితే ఉండేది. శివ రాజ్ కుమార్ మొదటి నుంచి చివరి వరకు వన్ మ్యాన్ షో చేశాడు. రెండు డిఫరెంట్ షేడ్స్ లో కూడా చాలా అద్భుతంగా నటించాడు.

    ఇక కొన్ని ఎమోషనల్ సీన్స్ లో రవి బాసురూర్ ఇచ్చిన మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్ లో ఉందనే చెప్పాలి. ఆ మ్యూజిక్ తోనే సినిమా మీద మంచి హైప్ అయితే క్రియేట్ అవ్వడమే కాకుండా సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుడికి ఒక రెండు మూడు సిచువేషన్ లో గూజ్ బంప్స్ వస్తాయని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమాని నార్తన్ ఇంకొంచెం బాగా తీసి ఉంటే ప్రేక్షకులందరికి రీచ్ అయ్యేది…

    ఆర్టిస్టుల పర్ఫామెన్స్

    ఇక ఆర్టిస్టుల పర్ఫామెన్స్ విషయానికి వస్తే ఈ సినిమాలో శివరాజ్ కుమార్ మొదటి నుంచి చివరి వరకు చాలా ఎక్స్ట్రాడినరీగా నటించాడు. ముఖ్యంగా న్యాయవాది పాత్రలో ఆయన కనబరిచినటు వంటి నటన అద్భుతం అనే చెప్పాలి. ఇక ఆ తర్వాత డాన్ గా మారిన తర్వాత చేంజ్ ఓవర్ ని చూపించిన విధానం కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. దర్శకుడు ఏదైతే చెప్పాడో ఆ ఫ్లేవర్ ని చెడగొట్టకుండా అద్భుతంగా నటించాడు. ఇక రుక్మిణి వసంత్ కూడా తన పాత్రలో ఒదిగిపోయి నటించింది. అయితే తనకు పెర్ఫార్మ్ చేయడానికి పెద్దగా స్కోప్ లేకపోయినప్పటికి ఉన్నంతలో చాలా బాగా నటించి మెప్పించిందనే చెప్పాలి…

    రాహుల్ బోస్ కూడా తన పాత్రలో మెప్పించడానికి చాలా వరకు ప్రయత్నం చేసి అందులో సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. ముఖ్యంగా దర్శకుడు రాసుకున్న క్యారెక్టర్స్ స్ట్రాంగ్ గా ఉన్నప్పటికీ వాటిని బలంగా చూపించలేకపోవడం వల్ల కొన్ని క్యారెక్టర్స్ అయితే ఎలివేట్ అవ్వలేదు. ఇక మిగిలిన ఆర్టిస్టులందరు తమ వంతు ప్రయత్నం అయితే చేశారు….

    టెక్నికల్ అంశాలు

    ఇక ఈ సినిమా టెక్నికల్ అంశాల విషయానికొస్తే రవి బసురూర్ ఇచ్చిన మ్యూజిక్ మాత్రం ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉంది. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అయితే అదిరిపోయిందనే చెప్పాలి… ఇక సినిమాటోగ్రఫీ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్న దర్శకుడు ప్రతి షాట్ ని చాలా ఎక్స్ట్రాడినరీగా కన్వే చేసే విధంగా సినిమాటోగ్రాఫర్ తో కూర్చొని మరి డిజైన్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఏది ఏమైనా కూడా సినిమాటోగ్రఫీ మాత్రం సినిమాకి నెక్స్ట్ లెవెల్ లో ఉందనే చెప్పాలి…ఇక ఎడిటర్ కూడా చాలా షార్ప్ ఎడిట్ కట్ ఇవ్వడానికి చాలా వరకు మంచి ప్రయత్నం అయితే చేశాడు…

    ప్లస్ పాయింట్స్

    శివ రాజ్ కుమార్
    కొన్ని ఎమోషనల్ సీన్స్
    బిజిఎం

    మైనస్ పాయింట్స్

    కథ
    స్లో నరేశన్
    క్లైమాక్స్

    రేటింగ్
    ఈ సినిమాకి మేమిచ్చే రేటింగ్ 2/5