Bachhala Malli Movie Review: ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది హీరోలు కొత్తగా ట్రై చేస్తూ వాళ్ళకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడంలో చాలావరకు ప్రయత్నం చేస్తున్నారు. ఇక అల్లరి నరేష్ కూడా అదే ఫార్మాట్ లో ముందుకు సాగుతున్నాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక మొదట్లో కామెడీ సినిమాలు చేస్తూ మంచి విజయాలను అందుకున్న అల్లరి నరేష్ కొన్ని సంవత్సరాలనుంచి సీరియస్ సినిమాలతో ప్రేక్షకులను మెప్పిస్తు వస్తున్నాడు. ఇక అదే రీతిలో ఇప్పుడు ‘బచ్చల మల్లి ‘ అనే సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా ఎలా ఉంది ప్రేక్షకులను మెప్పించిందా? లేదా అనే విషయాలను మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
కథ
ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే మల్లి (అల్లరి నరేష్) కుర్రాడు చిన్నప్పుడు చాలా బాగా చదువుకుంటూ మంచి పేరు సంపాదించుకుంటూ ఉంటాడు. ఇక ఇలాంటి క్రమంలోనే పదోవ తరగతిలో అతను ఫస్ట్ ర్యాంక్ సాధిస్తాడు…ఇక తన కెరియర్ సాఫీగా సాగుతుంది అనుకుంటున్న సందర్భంలో వాళ్ల నాన్న తీసుకున్న ఒక నిర్ణయం అతని కెరియర్ మొత్తాన్ని స్పైల్ చేస్తుంది. వాళ్ల నాన్న తీసుకున్న డిసిషన్ పట్ల ఆయన తీవ్రమైన మనస్థాపానికి గురవ్వడంతో అప్పటినుంచి చదువును వదిలేసి ఇష్టం వచ్చినట్టుగా తిరుగుతూ గల్లీలో జరిగే ప్రతి గొడవలో ఇన్వాల్వ్ అవుతూ ఉంటాడు.
ఇక అలాగే తాగుడుకు అలవాటు పడిపోయి తనకు నచ్చినట్టుగా చేస్తూ ముందుకు సాగుతూ ఉంటాడు. మరి ఇలాంటి క్రమంలోనే కావేరి (అమృత అయ్యర్) అనే ఒక అమ్మాయి పరిచయం అవుతుంది. మరి వీళ్ళ పరిచయం ఎక్కడిదాకా వెళ్ళింది. మళ్లీ చెడు వ్యసనాలను వదిలిపెట్టి మల్లి మంచి వ్యక్తిగా మారిపోయాడా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మీరు ఈ సినిమా చూడాల్సిందే…
విశ్లేషణ
ఇక ఈ సినిమా విశ్లేషణ విషయానికి వస్తే ఈ సినిమా ద్వారా నరేష్ మరొకసారి కొత్త టెంపులెట్ లో యాక్టింగ్ చేసి తనదైన రీతిలో సత్తా చాటుకునే ప్రయత్నం చేశాడు. నిజానికి నరేష్ యాక్టింగ్ అద్భుతంగా ఉంది. అయితే సుబ్బు మంగదేవి దర్శకత్వం ఈ సినిమాకి చాలా బాగా కుదిరినప్పటికి పుష్ప సినిమా టెంపులెట్ లోనే ఈ సినిమాని తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. అందువల్లే ఈ సినిమా చూస్తున్నప్పుడు అక్కడక్కడ మనకు పుష్ప ఫ్లేవర్ అయితే కనిపిస్తూ ఉంటుంది. కారణం ఏదైనా కూడా పుష్ప అనేది హిట్ ఫార్ములా కాబట్టి ఆ ఫార్ములా లోనే సినిమాని తెరకెక్కించినట్టుగా తెలుస్తోంది.
అయితే దర్శకుడు ఒక సిన్సియర్ అటెంప్ట్ ఇచ్చే ప్రయత్నం చేసినప్పటికి అల్లరి నరేష్ సినిమాలకి డబ్బులు ఎక్కువగా పెట్టాలా వద్దా అని ఆలోచించుకొని ప్రొడ్యూసర్ ఈ సినిమాకు డబ్బులు పెట్టినట్టుగా మాత్రం అర్థం అవుతుంది. ఎందుకంటే ప్రొడక్షన్ వాల్యూస్ అంతా రిచ్ గా లేకపోవడం వల్ల సినిమాని అనుకున్న వే లో దర్శకుడు తీయలేకపోయాడనేది చాలా క్లారిటీగా కనిపిస్తూ ఉంటుంది. ఇక ప్రతి ఫ్రేమ్ లో దర్శకుడు కూడా ఏదో ఒకటి చెప్పాలనే చాల డీటెయిల్ గా స్క్రీన్ ప్లే ను రాసుకొని ముందుకు సాగినప్పటికి దాన్ని విజువల్ గా మాత్రం తెరమీద కన్వే చేయడంలో ఆయన కొంతవరకు తడబడ్డాడు…అయితే అల్లరి నరేష్ చాలా ఈజ్ తో తన క్యారెక్టర్ ని పోషించినప్పటికి కథలో కాన్ఫ్లిక్ట్ ఇంకొంచెం బెటర్మెంట్ తో రాసుకొని ఉంటే బాగుండేది… స్క్రీన్ ప్లే కూడా చాలా టైట్ స్క్రీన్ ప్లే రాసుకొని ఉంటే సినిమా మొత్తాన్ని చాలా ఎంగేజింగ్ గా చెప్పే ప్రయత్నం చేసేవారు. అయితే దర్శకుడు బాగా రాసుకొని సినిమాను కూడా చాలా బాగా తీయాలనే ఉద్దేశ్యంతో సినిమాని స్టార్ట్ చేశాడు. మరి మధ్యలో ప్రొడ్యూసర్ దగ్గర డబ్బులు లేవా లేకపోతే అల్లరి నరేష్ సినిమాకి ఇంతకంటే ఎక్కువ పెడితే రికవరీ అవ్వవా అనే ఉద్దేశంతో ఆలోచించుకొని మరి ఆయన ఎక్కువగా డబ్బులు అయితే పెట్టినట్టుగా కనిపించలేదు.
దాని వల్ల ప్రొడక్షన్ వాల్యూస్ చాలా వరకు ఫెయిల్ అవ్వడంతో దర్శకుడు అంత పర్ఫెక్ట్ గా సినిమాను డెలివరీ చేయలేకపోయాడు. ఇక విశాల్ చంద్రశేఖర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అక్కడక్కడ సినిమాకి ప్లస్ అయినప్పటికి హై మూమెంట్స్ తో కూడిన ఎలిమెంట్స్ ని ఇప్పుడు చాలా బాగా డీల్ చేసినప్పటికి ఇంకా కొన్ని ఎలివేషన్స్ తో కొన్ని ప్లాట్ పాయింట్స్ ని బాగా రాసుకొని ఉంటే బాగుండేది అనే ఫీలింగ్ అయితే సినిమా చూసిన ప్రతి ఒక్కరికి కలుగుతుంది….
ఆర్టిస్టుల పర్ఫామెన్స్
ఇక ఆర్టిస్టులు పర్ఫామెన్స్ విషయానికి వస్తే అల్లరి నరేష్ ఈ సినిమాలో మల్లి క్యారెక్టర్ లో పర్ఫెక్ట్ గా ఒదిగిపోయి నటించాడు. ఎవరిని పట్టించుకోకుండా ఆయన ఆ క్యారెక్టర్ కి 100% ఎఫర్ట్ పెట్టీ అద్భుతంగా నటించాడు… ఇంతకుముందు ఆయన పోషించిన క్యారెక్టర్స్ అన్నీ ఒకేతైతే ఈ సినిమాలో ఆయన నటించిన క్యారెక్టర్ మాత్రం మరొక ఎత్తుగా మారిందనే చెప్పాలి. ఇక హీరోయిన్ అమృత అయ్యర్ కూడా తన పాత్ర పరిధి మేరకు ఓకే అనిపించింది. ఇక ఇయర్ స్టార్టింగ్ లో ‘హనుమాన్ ‘ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న తను ఈ ఇయర్ ఎండింగ్ లో ఈ సినిమాలో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఇక ఈ సినిమాలో కూడా చాలా మంచి పర్ఫామెన్స్ ను ఇచ్చి ప్రేక్షకులందరిని మంత్రముగ్ధుల్ని చేస్తుంది… ఇక మిగిలిన ఆర్టిస్టులు అయిన రావు రమేష్, రోహిణి, హరితేజ, వైవా హర్ష , ప్రవీణ్ లాంటివారు వాళ్ళ పాత్రల పరిధి మేరకు ఓకే అనిపించేలా నటించి మెప్పించారు…
టెక్నికల్ అంశాలు
ఇక ఈ సినిమాకి మ్యూజిక్ అందించిన విశాల్ చంద్రశేఖర్ సాంగ్స్ పరంగా అంతా బాగా మెప్పించినప్పటికి బ్యాగ్రౌండ్ స్కోర్ తో కొంతవరకు ఓకే అనిపించాడు. ఇక కొన్ని ఎమోషనల్ సీన్స్ లో ఆయన అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాకి చాలా వరకు ప్లస్ అయింది. అయితే అక్కడక్కడ మెలో డ్రామాగా సాగిన సినిమాలో ఆయన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆ సీన్స్ కి ఎంతలా అవసరమో అంతవరకే అందించాడు…
ఇక సినిమాటోగ్రాఫర్ అయిన రిచర్డ్ ఎమ్ నాథన్ తనదైన రీతిలో సినిమాటోగ్రఫ్ అందించి విజువల్ గా ఈ సినిమాకి ఒక బ్యూటీ నైతే తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు… ఇక ఎడిటర్ కూడా తన సాధ్యమైనంత వరకు సినిమాలో డిఫరెంట్ షాట్స్ ఉండే విధంగా ఎడిట్ చేసి సినిమాను గ్రిప్ంగ్ గా మార్చడానికి ప్రయత్నం అయితే చేశాడు…
ప్లస్ పాయింట్స్
అల్లరి నరేష్ యాక్టింగ్
కొన్ని ఎమోషనల్ సీన్స్
మైనస్ పాయింట్స్
మెలో డ్రామా సీన్స్
అనవసరపు సీన్స్
కథలో ప్యూర్ ఎమోషన్ లేకపోవడం…
రేటింగ్
ఈ సినిమాకి మేమిచ్చే రేటింగ్ 2.5/5