https://oktelugu.com/

Adolescence Web Series Review: ‘అడాల సెన్స్’ ఫుల్ సిరీస్ రివ్యూ…

Adolescence Web Series Review 'అడాల సెన్స్' అనే ఒక బ్రిటిష్ సిరీస్ ప్రస్తుతం ఓటిటి ని షేక్ చేస్తోంది...ఇంతకీ ఈ సీరీస్ లో ఏముంది అనేది మనం ఒకసారి తెలుసుకుందాం...

Written By: , Updated On : March 25, 2025 / 10:56 AM IST
Adolescence Web Series Review

Adolescence Web Series Review

Follow us on

Adolescence Web Series Review: కొన్ని సినిమాలు చూస్తున్నంత సేపు ప్రేక్షకులు కొన్ని రకాల ఎమోషన్స్ ని ఫీలవుతూ ఉంటారు. మరికొన్ని సినిమాలు చూస్తున్నంత సేపు మన నిజ జీవితంలో మనం చేసే కార్యకలాపాలన్నీ మన ముందు కనిపిస్తుంటాయి… ఇంకా కొన్ని సినిమా చూసినప్పుడు మాత్రం మనం తెలియని ఒక భావోద్వేగానికి గురి అవుతూ ఉంటాం…ఇక అలాంటి వెబ్ సీరీస్ ఒకటి ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది… ‘అడాల సెన్స్’ అనే ఒక బ్రిటిష్ సిరీస్ ప్రస్తుతం ఓటిటి ని షేక్ చేస్తోంది…ఇంతకీ ఈ సీరీస్ లో ఏముంది అనేది మనం ఒకసారి తెలుసుకుందాం…

కథ

ముందుగా ఈ సిరీస్ కథ విషయానికి వస్తే ఒక 13 సంవత్సరాల కుర్రాడిని జమీని పోలీసులు ఒక హత్య నేరం కింద అరెస్టు చేస్తారు…కోర్టు కూడా కుర్రాడు అని చూడకుండా ఆయనకు శిక్ష ను విధిస్తుంది. దీనివల్ల ఆ కుర్రాడు, అతని పేరెంట్స్ ఎలా సఫర్ అయ్యారు. నిజంగానే ఆ కుర్రాడు మర్డర్ చేశాడా..? లేదంటే అనుకోకుండా ఆ కేస్ లో ఇరుక్కున్నాడా అనేది తెలియాలంటే మీరు ఈ సిరీస్ చూడాల్సిందే…

Also Read: నన్నెందుకు టార్చర్ చేస్తున్నారు అంటూ రిపోర్టర్ ప్రశ్నపై హీరో సుహాస్ ఫైర్!

 

విశ్లేషణ

ఇక విశ్లేషణ విషయానికి వస్తే దర్శకుడు ఈ సిరీస్ లో ఉన్న నాలుగు ఎపిసోడ్స్ ని కేవలం సింగిల్ షాట్ లో చేశాడు… ఎడిటర్స్ తో పని లేకుండా చేసిన ఫుటేజ్ ను చేసినట్టుగా అప్లోడ్ చేశారు. మరి మొత్తానికైతే దర్శకుడి యొక్క గట్స్ కి మెచ్చుకోవచ్చు అలాగే ఈ సినిమాలో ఎక్కడ కూడా ఒక జర్క్ వచ్చే షాట్ కానీ లేకుండా చాలా వరకు జాగ్రత్తలు తీసుకున్నారు. ఇక ఒకే షాట్ లో నాలుగు ఎపిసోడ్ల సిరీస్ మొత్తాన్ని చేయడం అనేది మామూలు విషయం కాదు. ఇక ప్రతి ఎపిసోడ్లో ఏదో ఒక వాతావరణాన్ని తెలియజేస్తూ సినిమాని ముందుకు నడిపే ప్రయత్నం అయితే చేశాడు.

మరి మొత్తానికైతే ఇందులో పిల్లాడు ఎలా సఫర్ అవుతున్నాడు. వాళ్ల పేరెంట్స్ తమ కొడుకు మర్డరర్ గా మారతారని మాకు ముందే ఎందుకు తెలియలేదు. వాడిని మేము ఎందుకు మార్చలేకపోయాం అంటూ సఫర్ అయ్యే సన్నివేశాలని చాలా వరకు హృదయానికి హత్తుకునే విధంగా తెరకెక్కించాడు. ఈ సిరీస్ మొత్తం ఒక ఫ్లోలో సాగడమే కాకుండా ఇది చూసిన ప్రతి ఒక్కరికి ఒక మంచి మెసేజ్ కూడా అందిస్తుంది. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు ఎవరైనా సరే ఈ సిరీస్ ని చూసే విధంగా ఎలాంటి అశ్లీలమైన దృశ్యాలు లేకుండా చాలా చక్కగా తెరకెక్కించారు.

ఇక సిరీస్ మొత్తాన్ని సింగిల్ షాట్ లో ఎలా తీశారు అనే కోణంలో ఒకసారి, ఈ సినిమా ఎమోషన్స్ ను ఓన్ చేసుకుంటూ మరోసారి ఈ సిరీస్ మొత్తాన్ని రెండుసార్లు చూడాల్సిన అవసరమైతే ఉంటుంది.మొత్తానికైతే ప్రతి ఎపిసోడ్ ప్రేక్షకుల హృదయాన్ని హత్తుకునేలా ఉంటుంది… ఇక ఈ సిరీస్ కి మ్యూజిక్ కూడా చాలా వరకు ప్లస్ అయింది…

ఆర్టిస్టుల పర్ఫామెన్స్

ఆర్టిస్టుల పర్ఫామెన్స్ విషయానికి వస్తే 13 సంవత్సరాల కుర్రాడిగా చేసిన జమీ మిల్లర్ చాలా అద్భుతమైన నటనను కనబరిచాడు. పిల్లోడు అయినప్పటికి అన్ని రకాల ఎమోషన్స్ ని పండిస్తూ ప్రేక్షకుల హృదయాలను దోచుకోవడంలో తను చాలా వరకు సక్సెస్ అయ్యాడు. మొత్తానికైతే ఆయన మెచ్యూర్డ్ పర్ఫామెన్స్ ని ఇచ్చాడనే చెప్పాలి. ఎక్కడా కూడా తడబడకుండా సీన్ కి ఏం కావాలో అలాంటి ఒక ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టడంలో ఆయన చాలావరకు సక్సెస్ అయ్యాడు…

ఇక తన పేరెంట్స్ గా చేసిన నటీనటుల యాక్టింగ్ కూడా నేచురల్ గా అనిపించింది. కొడుకు జైలు కెళ్తే పేరెంట్స్ ఎలాగైతే సఫర్ అవుతారో అలాంటి ఒక నేచురల్ పర్ఫామెన్స్ ని ఇస్తూ అతన్ని విడిపించుకోవడానికి వాళ్ళు ఏం చేశారు అనే డైలమను వ్యక్తం చేస్తూ కూడా వాళ్ళు చాలా మంచి పర్ఫామెన్స్ అయితే ఇచ్చారు…

టెక్నికల్ అంశాలు

ఇక టెక్నికల్ అంశాల విషయానికి వస్తే ఈ సినిమా మొత్తాన్ని సింగిల్ షాట్ లో తీశారు. కాబట్టి సినిమాటోగ్రాఫర్ సినిమాకి చాలావరకు నైపుణ్యాన్ని చూపిస్తూ సినిమా మొత్తాన్ని ఒక ఫ్లోలోకి తీసుకొచ్చారు. ఇలాంటి సినిమాలు చేస్తున్నప్పుడు చాలావరకు జాగ్రత్తలు తీసుకుంటూ సినిమాలు చేయాల్సి ఉంటుంది…అలాగే మ్యూజిక్ డైరెక్టర్ కూడా చాలా చక్కని మ్యూజిక్ అందించారు…

ప్లస్ పాయింట్స్

కథ
జమీ మిల్లర్ యాక్టింగ్
డైరెక్షన్

మైనస్ పాయింట్స్

కొన్ని మెలో డ్రామా సీన్స్

రేటింగ్

ఈ సినిమాకి మేమిచ్చే రేటింగ్ 2.75/5

 

 

Adolescence | Official Trailer | Netflix