Movie Reviews: ఒక సినిమా ఫలితాన్ని రివ్యూ నిర్ణయిస్తుందా..? పాజిటివ్ రివ్యూ ఇస్తే కమర్షియల్ గా ఒక చిత్రం వేరే లెవెల్ కి వెళ్లడం, నెగటివ్ రివ్యూ ఇస్తే ఫ్లాప్ అయిపోవడం వంటివి ఒకప్పుడు జరిగేవేమో కానీ, ఇప్పుడు మాత్రం ఆ పరిస్థితులు లేవు. కానీ నిర్మాతలు మాత్రం ఎందుకో రివ్యూస్ ని చూసి వణికిపోతున్నారు. సినిమాలను రివ్యూయర్స్ తొక్కేస్తున్నారని సింపతీ కార్డు వాడుకొని గతకొంత కాలంగా నిర్మాతలు మీడియా ముందు మాట్లాడుతూనే ఉన్నారు. కొంతమంది నటీనటులు అయితే రివ్యూయర్స్ ని బండ బూతులు తిట్టిన సందర్భాలు ఉన్నాయి. అందుకే త్వరలోనే సినీ రివ్యూస్ ఇచ్చే పై నిర్మాతల మండలి కఠినమైన నిర్ణయం తీసుకోబోతుంది అంటూ ఇప్పుడు సోషల్ మీడియా లో ఒక వార్త వినిపిస్తుంది .
Movie Reviews: ‘ఆర్య 2’ రీ రిలీజ్ అడ్వాన్స్ బుకింగ్స్ గ్రాస్ ఏ రేంజ్ ఉందంటే!
ఆ నిర్ణయం ఏమిటంటే ఇక మీదట విడుదల అవ్వబోయే సినిమాలకు రివ్యూలు వారం రోజుల తర్వాతే ఇవ్వాలి అనే రూల్ ని తీసుకొని వస్తే ఎలా ఉంటుంది అని పరిశీలిస్తున్నారు. ఫిలిం ఛాంబర్ కి ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఈ విషయంలో పూర్తి స్థాయి హక్కులు ఇచ్చినట్టు తెలుస్తుంది. సినిమా విడుదలై వారం రోజులు పూర్తి అయ్యే వరకు ఎవరైనా సోషల్ మీడియా లో రివ్యూస్ ఇస్తే వారిపై లీగల్ గా నోటీసులు జారీ చెయ్యొచ్చు. కేరళ కోర్టు తీర్పుని ఇక్కడ కూడా అమలు చేయబోతున్నారని టాక్ వినిపిస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియనుంది. ఒక వ్యక్తి స్వేచ్ఛగా మాట్లాడుకునే హక్కు మనకు ఈ రాజ్యాంగం కలిపిస్తుంది, దానిని ఆపే హక్కు ఎవరికీ లేదంటూ కొంతమంది ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా చెప్పుకొస్తున్నారు. అయినా రివ్యూస్ ఒక సినిమా ఫలితాన్ని నిర్ణయిస్తుంది అనుకోవడం మూర్ఖత్వం అంటూ కామెంట్ చేస్తున్నారు. సోషల్ మీడియా ఈ స్థాయిలో వృద్హి చెందిన తర్వాత కూడా రివ్యూస్ ని ఎవరు అనుసరిస్తున్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఎందుకంటే సినిమా విడుదల తర్వాత బాగుందా లేదా అనే విషయం ట్విట్టర్, ఫేస్ బుక్ ని చూస్తే అర్థమైపోతుంది. ఎందుకంటే ఆడియన్స్ అప్పటికే సినిమాని చూసి తమ అభిప్రాయాన్ని చెప్పేస్తున్నారు. నెగటివ్ రివ్యూస్ ఇచ్చినా ప్రతీ సినిమా కమర్షియల్ గా ఫ్లాప్ అవ్వలేదు. అందుకు ఉదాహరణ ఎన్టీఆర్(Junior NTR) ‘దేవర’, మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) ‘వాల్తేరు వీరయ్య’ చిత్రాలు. ఈ రెండు చిత్రాలకు సోషల్ మీడియా నుండి మొదటిరోజు ఘోరమైన నెగటివ్ టాక్స్ వచ్చాయి. కానీ పబ్లిక్ లో ఆ టాక్ లేదు, ఫలితంగా ఈ రెండు సినిమాలు పెద్ద హిట్ అయ్యాయి. రివ్యూస్ ప్రభావం ఈ రెండు సినిమాలపై ఇసుమంత కూడా చూపలేదు. కేవలం ఈ రెండు సినిమాలు మాత్రమే కాదు, ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఒక సినిమాని చూసిన వ్యక్తి రివ్యూ ఇవ్వడం అనేది ప్రాధమిక హక్కు, దానిని కాదు అనేందుకు ఎవరికీ లేదంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజెన్స్.