
నటీనటులు: కృతి సనన్, పంకజ్ త్రిపాఠి, సాయి తమంకర్, మనోజ్ పవా, సుప్రియ పాఠక్;
సంగీతం: ఏఆర్ రెహమాన్;
సినిమాటోగ్రఫీ: ఆకాశ్ అగర్వాల్;
ఎడిటింగ్: మనీష్ ప్రధాన్; నిర్మాత: దినేశ్ విజాన్,
జియో స్టూడియోస్;
రచన: లక్ష్మణ్ ఉత్కర్, రోహన్ శంకర్;
దర్శకత్వం: లక్ష్మణ్ ఉత్కర్;
విడుదల:నెట్‌ఫ్లిక్స్
కరోనా దెబ్బకు పలు చిత్రాలు ఓటీటీల వేదికగా ప్రేక్షకుల ముందుకు వస్తోన్న సంగతి తెలిసిందే. భారీ చిత్రాలు కూడా ఓటీటీ బాటే పడుతున్నాయి. ఈ క్రమంలో కృతిసనన్, పంకజ్ త్రిపాఠి కీలక పాత్రల్లో లక్ష్మణ్ ఉత్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన కామెడీ ఎంటర్ టైనర్ ‘మిమి’ సినిమా. కాగా నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అయిన ఈ సినిమా ఎలా ఉంది ? అలాగే నటీనటులు నటన ఎలా ఉంది ? లాంటి విషయాలు చూద్దాం.
కథ విషయానికి వస్తే..
అమెరికాకు చెందిన దంపతులు సరోగసి ద్వారా ఓ బిడ్డకు జన్మనివ్వాలని ప్లాన్ చేస్తుంటారు. ఈ క్రమంలో ఫిట్ గా ఉన్న మహిళ కోసం వెతుకుతున్నారని.. డ్రైవర్ భాను ప్రతాప్ పాండే (పంకజ్ త్రిపాఠి)కి తెలియడంతో.. అతను మిమి రాఠోడ్(కృతి సనన్) గురించి ఆ దంపతులకు చెబుతాడు. అలాగే సరోగసి డబ్బు వస్తుందని మిమిని కూడా ఆయన ఒప్పిస్తాడు. దాంతో మిమి ఒప్పుకుంటుంది. అయితే మిమి గర్భం దాల్చాక ఆ బిడ్డ తమకు వద్దని అమెరికా దంపతులు నిర్ణయించుకుంటారు. దాంతో మిమి ఏం చేసింది? ఆమె జీవితం ఎలాంటి మలుపు తిరిగింది ? అనేది మిగిలిన కథ.
విశ్లేషణ :
సరోగసి నేపథ్యంలో ఎన్ని సినిమాలు వచ్చినా.. మిమి మాత్రం చాలా డిఫరెంట్. అలాగే సినిమాలో మంచి భావోద్వేగాలను బాగా మెయింటైన్ చేశారు. ముఖ్యంగా మిమిలో ఇచ్చిన కామెడీ టచ్ చాలా బాగుంది. ఇక హాస్య సన్నివేశాలు అలరించేలా ఉన్నాయి. కథలో లింగభేదంతో పాటు మత విశ్వాసాలు, వర్ణ వివక్షలను కూడా బాగా ఎలివేట్ చేశారు. కాకపోతే కథలో మెయిన్ పాయింట్ నుంచి స్క్రీన్ ప్లే కాస్త పక్కకు వెళ్లిన ఫీలింగ్ కలుగుతుంది. అన్నిటికిమించి అమెరికా దంపతులు సరోగసి ద్వారా బిడ్డకు జన్మనివ్వాలనుకోవడం, ఆ తర్వాత ఆ బిడ్డను వద్దు అనుకోవడం.. దాంతో మిమి జీవితం సమస్యల్లో చిక్కుకోవడం చాలా బాగుంది.
ఇక మిమి పాత్రలో కృతిసనన్ అద్భుతంగా నటించింది. వచ్చిన గర్భం ఏం చేయాలో పాలుపోని సాధారణ మహిళగా ఆమె హావభావాలు చాలా బాగున్నాయి. ముఖ్యంగా నటనకు ఆస్కారం ఉన్న పాత్ర కావడంతో కృతి కూడా చాలా బాగా చేసింది. మొత్తానికి ఈ ఏడాది కృతికి ‘మిమి’ గుర్తుండిపోయే సినిమా అని చెప్పవచ్చు. సాయి తమంకర్, మనోజ్ పవా, సుప్రియ పాఠక్ తదితరులు తమ పాత్రల్లో అద్భుతంగా నటించారు.
ప్లస్ పాయింట్స్ :
కృతి సనన్, పంకజ్ త్రిపాఠి నటన,
ఎమోషనల్ సన్నివేశాలు,
కామెడీ టచ్,
నేపథ్య సంగీతం,
సినిమాటోగ్రఫీ వర్క్,
బ్యాక్‌డ్రాప్
మైనస్ పాయింట్స్ :
సెకెండ్ హాఫ్ లో స్లోగా సాగే కథనం
స్క్రీన్ ప్లేలో కొన్ని లొసుగులు.
సినిమా చూడాలా ? వద్దా ?
తప్పకుండా చూడొచ్చు. మంచి కంటెంట్ తో డీసెంట్ కామెడీతో వచ్చిన బ్యూటీఫుల్ సినిమా ఇది. కథలో ఖచ్చితత్వంతో పాటు ఎమోషన్ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. కాకపోతే కొన్ని సీన్స్ బోర్ కొట్టిస్తాయి. అవి తప్ప మిగతా సినిమా మొత్తం బాగుంది.
ఓకే తెలుగు.కామ్ రేటింగ్ : 3