Dr. Sudhakar: డాక్టర్ సుధాకర్.. కరోనా మొదటి వేవ్ లో బాగా వినిపించిన పేరు. ప్రభుత్వ వైద్య సిబ్బందికి మాస్కులు, పీపీఈ కిట్లు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన వ్యక్తి. వైద్యులకు అందాల్సిన మాస్కులను, పీపీఈ కిట్లను రాజకీయ నాయకులు వాడుకుంటున్నారని ఏపీ ప్రభుత్వం పై విరుచుకుపడిన వ్యక్తి. దాంతో మా ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రయత్నించాడంటూ డాక్టర్ సుధాకర్ పై ఏపీ ప్రభుత్వ పెద్దలు సీరియస్ అయ్యారు.

పైగా సుధాకర్ పై సస్పెన్షన్ వేటు వేసేలా జగన్ తగిన చర్యలు తీసుకున్నాడు. కట్ చేస్తే.. కొన్ని నెలల తర్వాత సుధాకర్, రోడ్డు మీద కనిపించడం, ఆయన్ని పోలీసులు చితకబాదడం చూసాం. అత్యంత దారుణమైన పరిస్థితులను తనకు జగన్ ప్రభుత్వం కల్పించింది అని ఏపీ ప్రభుత్వం పై సుధాకర్ తీవ్ర విమర్శలు చేశాడు.
ఆ విమర్శలు అనంతరం.. డాక్టర్ సుధాకర్ తీవ్ర గాయాలపాలైయ్యాడు. నాటకీయ పరిణామాల మధ్య సుధాకర్ ను ఆసుపత్రికి తరలించారు. అక్కడ సుధాకర్ పై కుట్ర జరిగిందనే విమర్శలు కూడా ఆ మధ్య గట్టిగా వినిపించాయి. ఏవేవో మందులు ఇచ్చి ఆయనను పిచ్చివాడిగా మార్చే ప్రయత్నం కూడా చేశారని ఓ సందర్భంలో సుధాకరే స్వయంగా చెప్పారు.
ఈ మొత్తం వ్యవహారం పై రాష్ట్ర హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశాలు ఇచ్చింది. ఆదేశాల అనంతరం డాక్టర్ సుధాకర్ గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడు. ఎంతో జాగ్రత్తగా ఉండే సుధాకర్ కి ఎందుకు సడెన్ గా గుండెపోటు ప్రాణాలు కోల్పోయాడు అనేది అప్పట్లో పెద్ద సంచలనం. అయితే, ‘డాక్టర్ సుధాకర్’ మీద సినిమా తీయాలంటూ, రాష్ట్ర హైకోర్టు తాజాగా సంచలన వ్యాఖ్యలు చేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
Also Read: Akhanda Release: ‘అఖండ’ రిలీజ్ కి ముందే హైకోర్టు నిర్ణయం తీసుకుని ఉండుంటే ?
జస్టిస్ దేవానంద్ ఘాటైన వ్యాఖ్యలు చేస్తూ.. జస్టిస్ చంద్రు, విశాఖ వెళ్ళి డాక్టర్ సుధాకర్ విషయంలో ఏం జరిగిందో లోతైన విచారణ చేయాలని, చేసి సుధాకర్ పై సినిమా తీసేలా చూడాలని చంద్రుకి జస్టిస్ దేవానంద్ సలహా ఇచ్చారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో సుధాకర్ పై సినిమా తీసేంత ధైర్యం ఎవరికి ఉంటుంది ?
Also Read: Bheemla Nayak: భీమ్లా నాయక్ నుంచి “రానా” కు బర్త్ డే గిఫ్ట్ ఇచ్చిన మూవీ యూనిట్…