https://oktelugu.com/

ఆ.. బ్ర‌ద‌ర్ లేవండీ.. విన్నాం మీ గురించి !

ఆయన విజయం నేటి యువతకు ప్రేరణ. ఆయన విజయోత్సవం భవిష్యత్తు తరాలకు పాఠం. ఆయన విజయమనే గమ్యాన్ని చేరుకోవడానికి ఆయన పడ్డ తపన, ఆయన చేసిన అవిశ్రాంతమైన కృషి, ఆయన అలుపెరగని ఓర్పు ఇలా ఎన్నో అంశాలు ఉన్నాయి కాబట్టే, వ్యాపారవేత్తగా, నటుడిగా, రాజకీయ నాయకుడిగా ఇలా అన్నిటిలోనూ విజయం సాధించారు. ఆయనే ‘మురళీ మోహన్‌’. అయితే ఎన్టీఆర్ తో మురళీమోహన్ కి ఒక విచిత్రమైన సంఘటన ఎదురైనదని ఒక ఇంటర్వ్యూలో చెప్పుకుని ఇప్పటికీ ఆయన ఆశ్చర్యం […]

Written By:
  • admin
  • , Updated On : April 27, 2021 / 03:02 PM IST
    Follow us on

    ఆయన విజయం నేటి యువతకు ప్రేరణ. ఆయన విజయోత్సవం భవిష్యత్తు తరాలకు పాఠం. ఆయన విజయమనే గమ్యాన్ని చేరుకోవడానికి ఆయన పడ్డ తపన, ఆయన చేసిన అవిశ్రాంతమైన కృషి, ఆయన అలుపెరగని ఓర్పు ఇలా ఎన్నో అంశాలు ఉన్నాయి కాబట్టే, వ్యాపారవేత్తగా, నటుడిగా, రాజకీయ నాయకుడిగా ఇలా అన్నిటిలోనూ విజయం సాధించారు. ఆయనే ‘మురళీ మోహన్‌’. అయితే ఎన్టీఆర్ తో మురళీమోహన్ కి ఒక విచిత్రమైన సంఘటన ఎదురైనదని ఒక ఇంటర్వ్యూలో చెప్పుకుని ఇప్పటికీ ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

    అవి 1973 నాటి కాలం.. ఆ రోజుల్లో షూటింగ్ అంటే అంతా హడావుడిగా ఉంటుంది. ఇక షూట్ లో ఉన్న నటీనటులు అయితే చెట్లు కిందే సేద తీరుతూ ఉంటారు.
    అలా తన షూటింగ్ పార్ట్ ముగిసిందని మురళి మోహన్ దూరంగా ఉన్న ఒక చెట్టు కింద పడుకుని విశ్రాంతి తీసుకుంటున్నారు. అంతలో ఎన్టీఆర్ గారి పర్సనల్ మేకప్ మెన్ పీతాంబ‌రం అక్కడికి వచ్చి నిలబడ్డారు. ఏమిటండీ అని చిన్నపాటి షాక్ తో చూస్తూ అడిగారు మురళీమోహన్ గారు. ‘మేం ఓ సినిమా చేస్తున్నామండీ.. ఎన్టీఆర్ గారు హీరో. సినిమాలో ఆయనకు ఇద్ద‌రు తమ్ముళ్లు ఉంటారు. అందులో మీరు ఒక బ్ర‌ద‌ర్‌ గా ఎన్టీఆర్ పక్కన నటించాలి’ అంటూ పీతాంబరంగారు చెప్పుకుంటూ పోతూనే మురళీమోహన్ ను కారు ఎక్కించుకుని ఎన్టీఆర్ వద్దకు తీసుకుపోయారు.

    ఒకపక్క ఎన్టీఆర్ గారి వద్దకు వెళ్తున్నాననే ఉద్వేగం క్షణక్షణానికి పెరుగుతూ ఉంది మురళీమోహన్ కి. ఎప్పుడో చిన్న తనంలో అనుకున్నారు ఎన్టీఆర్ గార్ని ఒక్క‌సారి చూస్తే చాలు అని. అలాంటిది ఇప్పుడు ఆయ‌న‌తో క‌లిసి న‌టించే అవ‌కాశం వచ్చింది. అయితే ఒక్క విషయంలో మాత్రం మురళీమోహన్ గారు చాల స్ట్రాంగ్ గా ఉండేవారు. ఎవ్వరి కాళ్ళకు మొక్కేవారు కాదు. అలాగే న‌మ‌స్కారం పెట్ట‌డం ఆయనకు అసలు అలవాటే లేదు, అందుకే అప్పట్లో ఆయన న‌మ‌స్కారం కూడా పెట్టేవారు కాదు. కానీ, ఎన్టీఆర్ వద్దకు మురళీమోహన్ వెళ్లి ఆయనకు ఎదురుగా నుంచున్నారు. ఒక్కసారి ఎన్టీఆర్ ని రెండు కళ్లతో చూడగానే ఏదో ఒక గొప్ప ఫీలింగ్ వ‌చ్చేసింది మురళీమోహన్ కి. తనకే తెలియ‌కుండా వెళ్లిపోయి ఎన్టీఆర్ పాదాల‌కు న‌మ‌స్కారం పెట్టేశారు. ‘ఆ బ్ర‌ద‌ర్ లేవండీ. విన్నాం మీ గురించి’ అని ఎన్టీఆర్ ఆ తరువాత మురళీమోహన్ ను చాల ప్రోత్సహించారు.