Music Director Chakravarthy: సినిమాల్లోకి వెళ్ళు బావ.. అంతే, ఆమె మెడలో తాళి కట్టాడు !

Music Director Chakravarthy:  అలనాటి సంగీత దర్శకుడు చక్రవర్తి అంటే.. ఇప్పటికీ సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు ఉంది. ఆయన అంత గొప్పగా పాటలను అందించాడు. ఆయన పాటల్లో మధురమైన సంగీతం ఉంటుంది. కాగా చక్రవర్తి అసలు పేరు ‘కొమ్మినేని అప్పారావు’. అప్పారావుది గుంటూరు జిల్లా, పొన్నెకల్లు గ్రామం. 1936 సెప్టెంబర్ 8వ తేదీన ఆయన జన్మించారు. తల్లిదండ్రులు అన్నపూర్ణమ్మ, బసవయ్య. వారిది ఉన్నతమైన వ్యవసాయ కుటుంబం. ఆ రోజుల్లో అప్పారావు గారి ఊరిలో చదువుకున్న వ్యక్తి […]

Written By: Shiva, Updated On : February 3, 2022 12:08 pm
Follow us on

Music Director Chakravarthy:  అలనాటి సంగీత దర్శకుడు చక్రవర్తి అంటే.. ఇప్పటికీ సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు ఉంది. ఆయన అంత గొప్పగా పాటలను అందించాడు. ఆయన పాటల్లో మధురమైన సంగీతం ఉంటుంది. కాగా చక్రవర్తి అసలు పేరు ‘కొమ్మినేని అప్పారావు’. అప్పారావుది గుంటూరు జిల్లా, పొన్నెకల్లు గ్రామం. 1936 సెప్టెంబర్ 8వ తేదీన ఆయన జన్మించారు. తల్లిదండ్రులు అన్నపూర్ణమ్మ, బసవయ్య. వారిది ఉన్నతమైన వ్యవసాయ కుటుంబం. ఆ రోజుల్లో అప్పారావు గారి ఊరిలో చదువుకున్న వ్యక్తి ఆయన ఒక్కరే.

Music Director Chakravarthy

అందుకే, ఆయన అంటే.. అందరికీ గొప్ప అభిమానం. ఇక చిన్న తనం నుంచి అప్పారావుకి సంగీతం పై ఆసక్తి ఎక్కువుగా ఉండేది. అతని ఉత్సాహం చూసి తండ్రిగారు గుంటూరులో ఉన్న మహావాది వెంకటప్పయ్య శాస్త్రి దగ్గర సంగీతం నేర్పించారు. అలా సంగీతం నేర్చుకున్న అప్పారావు, ఆ తర్వాత వినోద్ ఆర్కెస్ట్రా అనే బృందాన్ని ఏర్పాటు చేశారు. అప్పట్లో పాటలు, పద్యాలు పాడుతూ ప్రతి గ్రామం తిరుగుతూ ప్రదర్శనలు ఇచ్చేవారు.

అది అప్పారావు తండ్రి బసవయ్య గారికి నచ్చలేదు. బాగా చదువుకుని ఇదేమిటి ? అంటూ ఆయన బాధ పడుతూ ఉండేవారు. తండ్రి బాధను అర్ధం చేసుకున్న అప్పారావు ఇక విజయవాడ ఆల్ ఇండియా రేడియోలో జాయిన్ కావాలని నిర్ణయించుకున్నారు. అలా 1954-58ల మధ్యన అప్పారావు ఆల్ ఇండియా రేడియోలో పని చేశారు. ఆ రోజుల్లో కె.అప్పారావు కంఠంతోనే ఆయన పాటలతో తెలుగు నెల ప్రతిధ్వనించేది.

Also Read: లీక్ అయిన ఐశ్వర్య రాయ్ ఫోటో వైరల్ !

నాటి శ్రోతలకి అప్పారావు కంఠం బాగా పరిచయం కూడా. అయితే, అప్పారావుకి ఎక్కడో బాధ. తెలియని కోపం. నేనేమిటి ? ఏమి చేస్తున్నాను ? అని తనలో తానే నిత్యం అనుకుంటూ ఉండేవారు. అలా ఒకరోజు తన మేనమామ కూతురు రోహిణి ఆ మాటలు వింది. ఆమె అంటే, అప్పారావుకి ప్రేమ. ఆమెనే అప్పారావుకి సలహా ఇచ్చింది, సినిమాల్లోకి వెళ్ళు బావ అని. అంతే, ఆ వెంటనే రోహిణి మెడలో అప్పారావు తాళి కట్టి.. భార్యతో కలిసి మద్రాసు రైలు ఎక్కాడు.

అప్పారావు మద్రాసు వచ్చి హెచ్.ఎమ్.వి. వారికి గ్రామఫోన్ పాటలు పాడటం మొదలు పెట్టాడు. ఒక రికార్డింగ్ లో సంగీత దర్శకులు రాజన్, నాగేంద్రలు కలిశారు. అప్పారావు గొంతు వాళ్లకు నచ్చింది. అవకాశం ఇప్పించి పాడించారు. ఆ తర్వాత బి.విఠలాచార్య అప్పారావుకి తన సినిమా ‘జయ విజయ’లో పాట పాడే అవకాశం ఇచ్చారు. ఆ పాటను చిత్రంలో హాస్యనటుడు బాలకృష్ణ పాడతాడు. ఇదే అప్పారావు సినిమాలో పాడిన మొదటి పాట.

Music Director Chakravarthy

 

అంతలో.. ‘ ఫలోమా’ అనే మలయాళ చిత్రం హిందీ డబ్బింగ్ కి వచ్చింది, దానికి అప్పారావుని సంగీత దర్శకుడిగా తీసుకున్నారు. టైటిల్స్‌ లో అన్నీ హిందీ పేర్లే ఉన్నాయి, వాటి మధ్య అప్పారావు అనే తెలుగు పేరు ఎందుకని ఆ సినిమా వారు అప్పారావుకి చెప్పి చక్రవర్తిగా పేరు వేశారు. ఈ విధంగా అప్పారావు చక్రవర్తిగా మారాడు. ‘మూగ ప్రేమ’లో ఆయన ఇచ్చిన పాటలు బాగున్నాయి అని పేరు వచ్చింది. ఇక అప్పారావుకి అలియాస్ చక్రవర్తికి తిరుగులేకుండా పోయింది.

Also Read:కేసీఆరే టార్గెట్ః బీజేపీ భీమ్ దీక్ష‌ల‌తో చెక్ పెట్టే య‌త్నం?

Tags