ఆ మహానటుడికి సినిమాలంటేనే భయం అట !

ఆ రోజుల్లో నటులు తక్కువమంది ఉండేవారు, మహానటులు ఎక్కువగా ఉండేవారు. కానీ ఇప్పుడు గొప్ప నటులు బహు అరుదు. నటన అంటే జీవించడం, నటుడు అంటే నవరసాలూ పండించడం అని తెలిసిన నటులు కూడా అతి తక్కువమంది ఉన్నారు. ఐతే, తెలుగు తెరకు లభించిన గొప్ప నటుల జాబితాలో కోట శ్రీనివాసరావు కూడా ఒకరు. ఒక నటుడు ఒక ఎమోషన్ ను బాగా పలికించగలరు ఏమో, కానీ ఒక నటుడు రౌద్రం, కపటత్వం, ఆవేదన, హాస్యం, మందహాసం […]

Written By: admin, Updated On : April 24, 2021 1:44 pm
Follow us on

ఆ రోజుల్లో నటులు తక్కువమంది ఉండేవారు, మహానటులు ఎక్కువగా ఉండేవారు. కానీ ఇప్పుడు గొప్ప నటులు బహు అరుదు. నటన అంటే జీవించడం, నటుడు అంటే నవరసాలూ పండించడం అని తెలిసిన నటులు కూడా అతి తక్కువమంది ఉన్నారు. ఐతే, తెలుగు తెరకు లభించిన గొప్ప నటుల జాబితాలో కోట శ్రీనివాసరావు కూడా ఒకరు. ఒక నటుడు ఒక ఎమోషన్ ను బాగా పలికించగలరు ఏమో, కానీ ఒక నటుడు రౌద్రం, కపటత్వం, ఆవేదన, హాస్యం, మందహాసం ఇలా ఒకటి ఏమిటి ? కోట చేయని పాత్ర లేదు, కోట పండించని భావోద్వేగం లేదు. నటుడిగా కోట ఎప్పటికీ తరగని కోటగానే నిలిచిపోతారు.

ఒకవిధంగా కోట శ్రీనివాసరావుకి దకాల్సిన గౌరవం దక్కలేదేమో అనిపిస్తోంది. అందుకు ఆయన వ్యవహార శైలి కూడా ఒక కారణం అంటుంటారు. ఆయన మనసులో ఎలాంటి కల్మషం లేకుండా ఉంటారు. ఏమున్నా పైకే అంటారు. అందుకే ఆయన అంటే కొంతమందికి పడదు. అయినా కోట తానూ అనుకున్నదే మాట్లాడతారు. అసలు కోట ఇంత దైర్యంగా ఎలా మాట్లాడుతున్నారు అంటూ ఆశ్చర్యపోతుంటారు ఆయన గురించి తెలిసిన వాళ్ళు. ఏది ఏమైనా నటన కోసమే మూర్తీభవించిన మనిషి ఆయన. తెరపై ఎన్ని వందల సజీవ పాత్రలలో జీవించినా.. ప్రతి పాత్రకు ఒక ప్రత్యేకతను తీసుకొచ్చిన ఘనత ‘కోట’గారిది.

కోట నలభైయేళ్ళ సినీ కెరీర్‌ ని నల్లేరు మీద బండిలా నడిపించేశారు అంటే అది ఆయన ప్రతిభకు దక్కిన క్రెడిటే. ఇప్పటికీ అగ్ర దర్శకులు కాల్షీట్ల కోసం ఆయనకు ఫోన కాల్స్‌ చేస్తూనే ఉన్నారు అంటే.. కారణం ఆయన నటన పై దర్శకులకు ఉన్న మక్కువే. మరి ఇంత గొప్ప నటుడు అసలు సినిమాల్లోకి రావాలనుకోలేదు అని తెలిస్తే.. నిజంగా షాకింగ్ నే అనిపిస్తోంది. వాస్తవానికి కోట సినిమాల్లోకి వస్తాననిగానీ, ఇండస్ట్రీలో ఇన్నేళ్ళుంటాడని గానీ చిన్నతనంలో ఎప్పుడూ అనుకోలేదట.

అసలు కోటకు చిన్నప్పుడు సినిమాలంటేనే భయం అట. అందుకే ఆయన ఎప్పుడూ నటుడు కావాలని అసలు ఊహించుకున్నే వాడు కాదు అట. కానీ కోట పెరిగి పెద్దయ్యాక అనుకోకుండా సినిమాల పై ఆయనకు ఇంట్రస్ట్ కలిగింది. ఒక విధంగా సినిమా ఆయనను పిలిచింది. అక్కున చేర్చుకుంది. సంవత్సరాలు దాటిపోతోన్న ‘కోట’ అనే కీర్తి మాత్రం ‘కోట’గట్టుకుని కూర్చుంది’’. అయితే వ్యక్తి గత జీవితంలో కొన్ని ఒడిదుడుకులు మాత్రం కోట శ్రీనివాసరావును ఎంతో కలిచివేశాయి.