https://oktelugu.com/

NTR: అప్పటి ముచ్చట్లు : ‘ఎన్టీఆర్ గారు పిలిస్తే.. రాకుండా ఎలా ఉండగలం ?

NTR: అప్పట్లో తెలుగు సినిమా పరిశ్రమ మద్రాసులో ఉన్న సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాత మురారి ‘గోరింటాకు’ అనే సినిమాను ఆ రోజుల్లో భారీ స్థాయిలో నిర్మించడానికి సన్నాహాలు చేశారు. షూటింగు కోసం యూనిట్‌ అంతా వైజాగ్‌ వెళ్లారు. అయితే, ఆ సమయంలో ఎన్టీఆర్ పోలీసుల కోసం నిధులు సేకరించడానికి రైల్లో వైజాగ్ కి వచ్చారని యూనిట్ కి తెలిసింది. .దాసరి దర్శకత్వంలో సినిమా షూటింగ్ జరుగుతుందని అటు ఎన్టీఆర్ కి కూడా తెలిసింది. నిర్మాతెవరో కనుక్కుని […]

Written By:
  • Shiva
  • , Updated On : January 18, 2022 / 01:55 PM IST
    Follow us on

    NTR: అప్పట్లో తెలుగు సినిమా పరిశ్రమ మద్రాసులో ఉన్న సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాత మురారి ‘గోరింటాకు’ అనే సినిమాను ఆ రోజుల్లో భారీ స్థాయిలో నిర్మించడానికి సన్నాహాలు చేశారు. షూటింగు కోసం యూనిట్‌ అంతా వైజాగ్‌ వెళ్లారు. అయితే, ఆ సమయంలో ఎన్టీఆర్ పోలీసుల కోసం నిధులు సేకరించడానికి రైల్లో వైజాగ్ కి వచ్చారని యూనిట్ కి తెలిసింది. .దాసరి దర్శకత్వంలో సినిమా షూటింగ్ జరుగుతుందని అటు ఎన్టీఆర్ కి కూడా తెలిసింది.

    నిర్మాతెవరో కనుక్కుని ఆర్టిస్టులందరినీ పెరేడ్‌ గ్రౌండ్స్‌ లోని కార్యక్రమానికి తీసుకురమ్మని ఎన్టీఆర్ చెప్పి పంపారు. అది మురారి గారికి నచ్చలేదు. ఆయన ఏదో ప్రోగ్రాం పెట్టాడని మేము మా షూటింగ్ కి బ్రేక్ ఇచ్చి ఎందుకు వెళ్ళాలి ? అయినా షూట్ కాన్సిల్‌ చేసుకుని వెళ్లడమేమిటి ? అని సీరియస్ అవుతుండగా.. మధ్యలో దాసరి స్పందిస్తూ.. ‘ఎన్టీఆర్ గారు పిలిస్తే.. రాకుండా ఎలా ఉండగలం. అందరం వస్తాం’ అని ఎన్టీఆర్ పంపిన మనిషికి చెప్పి పంపారు.

    Also Read: గుండె కొట్టుకోవడం ఆగిపోతే వెంటనే ఇలా చేయండి !

    అది మురారికి అసలు నచ్చలేదు. ‘మీరు వెళ్లండి, నేను రాను’ అని మొండికేశారు. పక్కనున్న సావిత్రి రియాక్ట్ అయి.. ‘అది కాదు మురారి గారు. మేమందరం ఉన్నా.. ఎన్టీఆర్ గారు మీ దగ్గరకే ఎందుకు మనిషిని పంపారు ? మీరు నిర్మాత గనుక. మీకు ఎన్టీఆర్ గారు గౌరవం ఇచ్చారు’. అంతలో.. ‘సాయంత్రం ఫంక్షన్‌ కు దండలు ఏర్పాటు చేయండయ్యా’ అంటూ దాసరి మేనేజర్ కి ఆర్డర్ వేశాడు.

    ఆ మాటతో మురారికి కోపం రెట్టింపు అయింది. ‘దండలు ఊరికే రావయ్యా. అయినా నేను అక్కడకు వచ్చినా ఎన్టీఆర్ కి మాత్రం దండా వేయను’ అంటూ తేల్చి చెప్పాడు. అదంతా చూస్తూ కూర్చున్న శోభన్‌బాబు ఒక్కసారిగా పెద్దగా నవ్వి.. ‘ఇదిగో మురారి, అక్కడ ఉండేది ఎన్టీఆర్ గారు. నువ్వు అక్కడికి వెళ్ళగానే.. నీకు తెలియకుండానే నువ్వు దండ వేసి కాళ్ళ పై పడతావు’ ఆ తర్వాత నీ మాటలు, చేతలు నీ అధీనంలో వుండవు” అని చెప్పారు శోభన్ బాబు.

    సాయంత్రం వేదిక పై ఎన్టీఆర్ ‘గోరింటాకు’ టీమ్ కి ఎదురుగా వచ్చి…’ ‘గోరింటాకు’ టీమ్ అందరికీ ఘన స్వాగతం, ముఖ్యంగా నిర్మాత మురారి గారికి ధన్యవాదాలు’ అని ఎన్టీఆర్ చెప్పగానే మురారి మనసు మనసులో లేదు. ‘రండి మురారిగారూ’ అని ఎన్టీఆర్ మాట వినిపిస్తుంది. మురారికి కాళ్లలో వణుకు, కళ్లల్లో భయం.. ఎవరు దండ యిచ్చారో తెలియదు. ఎన్టీఆర్ కి కాళ్లకు మొక్కి దండ వేయడం మాత్రమే మురారికి అర్ధం అవుతుంది. ఎన్టీఆర్ ని చూడగానే ఎదో తెలియని అనుభూతికి మురారి ఫీల్ అయ్యాడు. అది ఎన్టీఆర్ అంటే !!

    Also Read: రైల్‌టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో జాబ్స్.. భారీ వేతనంతో?

    Tags