Chiranjeevi Radhika: చిరంజీవి మోసం.. చెంప చెల్లుమనిపించిన రాధిక..!

Chiranjeevi Radhika: స్వయంకృషితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఒక్కో మెట్టు పైకి ఎదిగిన చిరంజీవి ప్రస్థానం నభూతో నా భవిష్యత్. కోట్లాది మంది అభిమానులచేత అన్నయ్య.. మెగాస్టార్ అనిపించుకోవడానికి ఆయన పడిన కష్టం అంతా ఇంతా కాదు. ఎన్టీఆర్, ఎన్నాఆర్, శోభన్ బాబు లాంటి మహామహులు ఇండస్ట్రీని ఎలుతున్న కాలంలోనే చిరంజీవి సినిమాల్లోకి అడుగు పెట్టి తనకుంటూ ఓ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరుచుకున్నాడు. కెరీర్ తొలినాళ్లలో చిన్నపాత్రల్లో కన్పించిన  చిరంజీవి అచిరకాలంలోనే స్టార్ హీరోగా ఎదిగాడు. ఆ తర్వాత […]

Written By: NARESH, Updated On : December 5, 2021 10:46 pm

megastar-radhika

Follow us on

Chiranjeevi Radhika: స్వయంకృషితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఒక్కో మెట్టు పైకి ఎదిగిన చిరంజీవి ప్రస్థానం నభూతో నా భవిష్యత్. కోట్లాది మంది అభిమానులచేత అన్నయ్య.. మెగాస్టార్ అనిపించుకోవడానికి ఆయన పడిన కష్టం అంతా ఇంతా కాదు. ఎన్టీఆర్, ఎన్నాఆర్, శోభన్ బాబు లాంటి మహామహులు ఇండస్ట్రీని ఎలుతున్న కాలంలోనే చిరంజీవి సినిమాల్లోకి అడుగు పెట్టి తనకుంటూ ఓ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరుచుకున్నాడు.

Radhika

కెరీర్ తొలినాళ్లలో చిన్నపాత్రల్లో కన్పించిన  చిరంజీవి అచిరకాలంలోనే స్టార్ హీరోగా ఎదిగాడు. ఆ తర్వాత సుప్రీంహీరోగా, మెగాస్టార్ గా ఎదిగాడు. ‘పునాదిరాళ్లు’, ‘పసివాడి ప్రాణం’తో ప్రారంభమైన చిరంజీవి కెరీర్ నేటికీ అప్రహతీతంగా కొనసాగుతూనే ఉంది. 65ఏళ్ళ వయస్సులోనే చిరంజీవి ఇండస్ట్రీలో రికార్డులను సృష్టిస్తూ కుర్రహీరోలకు సవాల్ విసురుతున్నాడు.

చిరంజీవికి జోడిగా అప్పట్లో రాధిక, రాధ, సుమలత, విజయశాంతి, సుహాసిని, భానుప్రియ వంటి తారలు ఎక్కువగా నటించారు. వీరి కాంబినేషన్లో వచ్చిన సినిమాలన్నీ కూడా సూపర్ హిట్లుగా నిలిచాయి. డాన్సులు, ఫైట్స్, నటనలో చిరంజీవి తనకంటూ ఓ మ్యానరిజం ఏర్పరుచుకోవడంతో ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా అమాంతం పెరిగింది.

చిరంజీవి మెగాస్టార్ అయిన తర్వాత హిట్లు, ప్లాపులతో సంబంధం లేకుండా ఆయన సినిమాలను ఫ్యాన్స్ ఆదరించడం మొదలుపెట్టారు. కెరీర్ తొలినాళ్ల నుంచి ఇప్పటివరకు కూడా చిరంజీవి నటన విషయంలో చాలా డెడికేషన్ తో పని చేస్తుంటారు. ఆ గుణమే ఆయన్ని మెగాస్టార్ చేసింది. అలాంటి సంఘటనే మచ్చుక ఒకటి గుర్తు చేసుకుంటే..!

చిరంజీవి-రాధిక కాంబినేషన్లో చాలా సినిమాలు వచ్చాయి. చిరుకు జోడీగా అత్యధిక సినిమాలు చేసిన హీరోయిన్ గా రాధిక అందరికీ గుర్తుండిపోతారు. వీరిద్దరు కలిసి నటించిన తొలి సినిమా ‘ప్రియ’. కానీ ముందుగా విడుదలైన సినిమా మాత్రం ‘న్యాయంకావాలి’. 1981లో విడుదలైన ఈ మూవీ అప్పట్లో ఘనవిజయం సాధించింది.

ఈ మూవీకి క్రాంతి కుమార్ నిర్మాత కాగా ఏ. కోదండరామిరెడ్డి దర్శకుడు. ఈ మూవీలో చిరంజీవికి, రాధికకు మర్చిపోలేని కొన్ని సంఘటనలు ఉన్నాయి. ఈ సినిమాలో చిరంజీవిది నెగిటివ్ క్యారెక్టర్. హీరోయిన్ రాధికను చిరంజీవి ప్రేమించినట్లు నటించి శారీరకంగా లోబర్చుకొని మోసం చేస్తాడు. ఒక సందర్భంలో రాధిక చిరంజీవితో నన్ను ఎందుకు మోసం చేస్తావు అని నిలదీస్తూ చిరంజీవిని చెంప మీద కొట్టి సుదీర్ఘ డైలాగులు చెప్పాల్సిన సీన్ ఉంటుంది.

Also Read: ‘చిరు’ బాటలో బన్నీ ఎదిగాడు.. ‘ఘరానా మెగుడు’ కేరళలో రిలీజయ్యే ముందు జరిగిన పరిణామాలేంటో తెలుసా..?

అయితే ఈ షాట్ సరిగ్గా రాకపోకపోవడంతో పదేపదే రిటేకులు చేయాల్సి వచ్చిందట. ఇక లాభం లేదని భావించిన చిరంజీవి తన చెంప మీద నిజంగానే కొట్టమని రాధికకు చెప్పాడట. ఇక సన్నివేశంలో లీనమైపోయిన రాధిక చిరంజీవిని చెంప చెల్లుమనేలా నిజంగానే కొట్టింది. షాట్ ఒకే అయింది. అయితే చిరంజీవి చెంప ఎర్రగా వాచిపోయిందట. ఆ తర్వాత రాధిక సారీ చెప్పబోతుంటే చిరంజీవి మాత్రం డైరెక్టర్ తో ఇలాంటి షాట్ మరొకటి ఉందా? అని అంటూ అందరినీ సరదాగా నవ్వించారట.

తొలి సినిమా నుంచే రాధికకు చిరంజీవికి మధ్య మంచి ఫ్రెండ్ షిప్ ఏర్పడింది. ఇది ఇప్పటి కూడా కొనసాగుతూనే ఉంది. ప్రతీ సంవత్సరం జరిగే 80’s క్లబ్ లో అలనాటి తారలు సందడి చేస్తుంటారు. ఇందులో చిరంజీవి, రాధిక చేసే సందడి మరో లెవల్లో ఉంటుంది. ఇక వీరిద్దరి కాంబినేషన్లో చివరగా వచ్చిన మూవీ ‘రాజా విక్రమార్క’. కాగా వీరి కాంబినేషన్లో అభిమానులకు గుర్తుండిపోయే సినిమా మాత్రం ‘అభిలాష’.

Also Read: శ్రీదేవిని కమల్ హాసన్ పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఇదేనా..?