Homeఎంటర్టైన్మెంట్బుల్లితెర పాపులర్ జంటకు సినిమా అఫర్

బుల్లితెర పాపులర్ జంటకు సినిమా అఫర్


ప్రస్తుతం బుల్లితెరపై ‘సుడిగాలి’ సుధీర్ కి .. రష్మీకి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ‘జబర్దస్త్’ కామెడీ షో ద్వారా పాపులర్ అయిన ఈ జంటకు ఒక సినిమా అవకాశం వచ్చింది. నిజానికి వీళ్ళిద్దరూ వెండితెరపై నటులుగా స్థిరపడటానికి ఎవరి ప్రయత్నాలు వాళ్లు చేస్తున్నారు. అయితే ఈ ఇద్దరినీ కలిసి వెండితెరపై చూపించడానికి ఒక నిర్మాత ముందుకు రావడం జరిగింది. రీసెంట్ గా సుధీర్ హీరోగా ఓ సినిమా తీసిన ఈ నిర్మాత ఇపుడు సుధీర్ , రష్మిల జోడికి వెండి తెరపై కలిసి నటించే అవకాశం కల్పిస్తున్నాడు .

వైన్ షాపులో ఉపాధ్యాయుల డ్యూటీపై పవన్ సీరియస్!

రీసెంట్ గా సుధీర్ హీరోగా ‘సాఫ్ట్ వేర్ సుధీర్’ అనే చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకి శేఖర్ రాజు నిర్మాతగా వ్యవహరించాడు. కాగా ఈ చిత్రం షూటింగ్ సమయంలోనే సుధీర్ – రష్మీ జోడీగా ఒక సినిమా చేయాలనుందని అన్నాడట…ఆయన అన్నట్టుగానే ఇప్పుడు సుధీర్ – రష్మీ కాంబినేషన్లో ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్ సినిమా చేయబోతున్నాడు

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular