https://oktelugu.com/

Actor Surya: చిక్కుల్లో ” జై భీమ్ ” చిత్రం… సూర్యపై ఫైర్ అవుతున్న డిస్ట్రిబ్యూటర్లు

Actor Surya: తెలుగు, తమిళ ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు సూర్య. తనదైన నటనతో ప్రేక్షకులకు మెస్మరైజ్ చేయగలడు సూర్య. గజిని, యముడు, సింగం సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు సూర్య. ఇక ఇటీవల ఆకాశం నీ హద్దురా చిత్రం అమెజాన్ లో విడుదలై బిగ్గెస్ట్ హిట్ ని అందుకున్న విషయం తెలిసిందే. కరోనా సమయంలో… థియేటర్లు మూసివేత కారణంగా అన్ని చిత్రాలు ఓటిటీ బాట పట్టిన విషయం అందరికీ తెలిసిందే. ఇక తాజాగా […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : October 31, 2021 / 10:08 PM IST
    Follow us on

    Actor Surya: తెలుగు, తమిళ ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు సూర్య. తనదైన నటనతో ప్రేక్షకులకు మెస్మరైజ్ చేయగలడు సూర్య. గజిని, యముడు, సింగం సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు సూర్య. ఇక ఇటీవల ఆకాశం నీ హద్దురా చిత్రం అమెజాన్ లో విడుదలై బిగ్గెస్ట్ హిట్ ని అందుకున్న విషయం తెలిసిందే. కరోనా సమయంలో… థియేటర్లు మూసివేత కారణంగా అన్ని చిత్రాలు ఓటిటీ బాట పట్టిన విషయం అందరికీ తెలిసిందే. ఇక తాజాగా సూర్య నటించిన ‘జై భీమ్’ చిత్రం కూడా నవంబర్ 2న అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ కానుంది. ఈ మూవీ కారణంగా ప్రస్తుతం సూర్య చిక్కుల్లో పడ్డాడని చెప్పాలి.

    కరోన కేసులు తగ్గుముఖం పట్టడంతో అన్నీ రాష్ట్రాల్లో ధియేటర్లు ఫుల్ సీటింగ్ తో తెరుచుకుంటున్నాయి. తమిళనాడులో కూడా ధియేటర్లు తెరుచుకున్న విషయం తెలిసిందే. అయితే థియేటర్లు ఓపెన్ అయినా కూడా సూర్య సినిమాను ఓటిటీ లో రిలీజ్ చేయడం పట్ల… పలువురు  డిస్ట్రిబ్యూటర్లు  ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.  దీంతో కోలీవుడ్ లో సూర్యకు వ్యతిరేకంగా నినాదాలు మొదలయ్యాయి. ఇలాగే చేస్తే సూర్యను కోలీవుడ్ బ్యాన్ చేసేలా ఉందని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

    అయితే ‘జై భీమ్’ ఓటిటీ బాట పట్టడానికి కారణం లేకపోలేదని నిర్మాతలు చెబుతున్నారు. సినిమా హక్కులను కరోనా టైమ్ లోనే అమెజాన్ దక్కించుకొందని… ఇప్పుడు రిలీజ్ చేస్తుందని వారు వివరించారు. అయితే ఇప్పుడు ఈ విషయంలో సూర్య తప్పేం లేదని ఆయన అభిమానులు అంటున్నారు.  ప్రస్తుతం ఈ వార్త చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారింది.