Allu Arjun Arrested: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ దేశవ్యాప్తంగా ఎంతటి సంచలనం రేపిందో మన అందరికీ తెలిసిందే. ఎన్నో నాటకీయ పరిణామాల మధ్య అసలు రాదు అనుకున్న బెయిల్ నిన్న సాయంత్రం వచ్చింది. కోర్టు ఆదేశాల ప్రకారం అప్పటికప్పుడే విడుదల చేయాలి, కానీ పోలీసులు రాత్రంతా ఆయన్ని చంచల్ గూడా జైలులోనే ఉంచారు. ఒక సాధారణ ఖైదీని ఎలా అయితే ట్రీట్ చేస్తారో, అల్లు అర్జున్ ని కూడా అలాగే ట్రీట్ చేసారు. రాత్రంతా ఆయన భోజనం కూడా చేయలేదట. పడుకోవడానికి ఒక దుప్పటి, డిందు మాత్రమే ఇచ్చారట. అల్లు అర్జున్ నేల మీదనే పడుకొని, ఉదయం 6 గంటల సమయంలో జైలు నుండి విడుదలై బయటకి వచ్చాడు. ఇంటికి రాగానే ఇండస్ట్రీ కి చెందిన ప్రముఖులందరూ అల్లు అర్జున్ ని కలిసేందుకు వచ్చారు. డైరెక్టర్ సుకుమార్ అయితే అల్లు అర్జున్ ని చూసిన వెంటనే కన్నీటి పర్యంతం అయ్యాడు. అతన్ని అల్లు అర్జున్ ఓదారుస్తూ ఉన్న వీడియో సోషల్ మీడియా లో బాగా వైరల్ అయిన సంగతి తెలిసిందే.
అంతకు ముందు అల్లు అర్జున్ కోసం పడిగాపులు కాస్తూ ఎదురు చూస్తున్న అతని సతీమణి స్నేహా రెడ్డి, అల్లు అర్జున్ ని గట్టిగా హత్తుకొని ఏడవడం మనమంతా చూసాము. తన పిల్లల్ని కూడా పైకి ఎత్తుకొని వాళ్ళని కూడా ఓదార్చాడు అల్లు అర్జున్. ఈ సంఘటన జరిగిన తర్వాత ఇండస్ట్రీ మొత్తం అతని కోసం వచ్చింది. చిరంజీవి సతీమణి, అల్లు అర్జున్ మేనత్త సురేఖ కూడా కాసేపటి క్రితమే వచ్చింది. అల్లు అర్జున్ ని చూడగానే కన్నీళ్లు పెట్టుకున్న ఆమె విజువల్స్ సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. అనంతరం అల్లు అర్జున్ ఆమె చెయ్యి పట్టుకొని లోపలకు తీసుకొని వెళ్లడం చూసే అభిమానులకు చాలా బాగా అనిపించింది. అయితే నిన్న సురేఖ గారు చిరంజీవి తో కలిసి అల్లు అర్జున్ ఇంటికి వచ్చిన సంగతి తెలిసిందే.
చిరంజీవి, నాగబాబు తదితరులు నిన్న మొత్తం అల్లు అర్జున్ ఇంట్లోనే ఉన్నారు. బెయిల్ విషయం లో అనేక కోణాల్లో ఆరా తీసిన చిరంజీవి, అల్లు అర్జున్ సేఫ్ అని తేలడంతో ఇంటికి తిరిగి వెళ్ళిపోయాడు. సురేఖ మాత్రం సాయంత్రం వరకు అల్లు అర్జున్ ఇంట్లోనే ఉంది. ఎంతసేపు గడిచినా ఆయనకి బెయిల్ రాకపోవడంతో ఇక ఇంటికి తిరిగి వెళ్ళిపోయింది. మళ్ళీ అల్లు అర్జున్ ఇంటికి తిరిగి వచ్చాడు అనే విషయాన్ని తెలుసుకున్న సురేఖ, చిరంజీవి లేకుండానే అల్లు అర్జున్ ఇంటికి వచ్చింది. ఇదంతా పక్కన పెడితే మెగా కుటుంబానికి చెందిన రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, నిహారిక కొణిదెల తదితరులు దరిదాపుల్లో కూడా కనిపించకపోవడం గమనార్హం. నిన్న ఉదయం పవన్ కళ్యాణ్ హైదరాబాద్ కి బయలుదేరాడని, అల్లు అర్జున్ ఇంటికి వెళ్తున్నాడని వార్తలు వినిపించాయి. అయితే ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని, పవన్ కళ్యాణ్ విజయవాడలోనే ప్రభుత్వ కార్యక్రమాల్లో బిజీ గా ఉన్నాడని తెలిసింది.