Mothevari Love Story Trailer Talk: ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో మంచి కంటెంట్ తో సినిమాలు వచ్చి సూపర్ సక్సెస్ లను సాధిస్తున్నాయి. యూట్యూబ్ లో ఫేమస్ అయిన వాళ్లందరూ సినిమాలు చేస్తూ వాళ్ళను వాళ్లు ప్రమోట్ చేసుకోవాలనే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరి ఇలాంటి సందర్భంలోనే మై విలేజ్ షో అనే చానల్ పెట్టి అందులో కామెడీ వీడియోలు చేయడం ద్వారా కొంతమంది ఫేమస్ అయ్యారు. దాంతో వాళ్లు సినిమాల్లో కూడా నటిస్తూ వస్తున్నారు. మై విలేజ్ షో ద్వారా ఫేమస్ అయిన గంగవ్వ, అంజి మామ, అనిల్ జీలా లాంటి వాళ్ళు అందరూ కలిసి చేస్తున్న ‘మోతేవారి లవ్ స్టోరీ’ అనే ఒక వెబ్ సిరీస్ చేశారు. రీసెంట్ గా ఈ వెబ్ సిరీస్ కు సంబంధించిన ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. ఇక ఈ సిరీస్ జీ 5 లో ఆగస్టు 8వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవ్వబోతోంది. ఏడు ఎపిసోడ్లుగా రాబోతున్న ఈ సిరీస్ ప్రేక్షకుడిని ఆకట్టుకుంటుంది అంటూ చాలావరకు కాన్ఫిడెంట్ ను వ్యక్తం చేస్తున్నారు. మురళీధర్ గౌడ్, సదన్న, అనిల్ జీలా మధ్య వచ్చే కామెడీ ఎపిసోడ్లు ఈ సినిమాకి హైలైట్ గా నిలువబోతున్నాయి. ముఖ్యంగా ట్రైలర్ ని కట్ చేసిన విధానం కూడా బాగుంది. ప్రతి పంచ్ అద్భుతంగా పేలబోతోంది. మరి ఇలాంటి క్రమంలోనే ఈ సిరీస్ తో వీళ్ళు ఎలాంటి సక్సెస్ ని సాధిస్తారు. తద్వారా వీళ్ళకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ సుకుంటారా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.
Also Read: కింగ్డమ్’ చిత్రం బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఎన్ని కోట్ల గ్రాస్ రావాలో తెలుసా..?
ఇక అనిల్ జీలా ఇప్పటికే పలు సినిమాల్లో సైడ్ పాత్రలను పోషించి నటుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. మరి మొదటిసారి ఆయన హీరోగా నటించిన ఈ మోతేవారి లవ్ స్టోరీ సినిమా ఎంతటి సక్సెస్ ని సాధిస్తోంది. తద్వారా ఆయనకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ అవుతుందా?
లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే… ప్రస్తుతానికైతే ఈ ట్రైలర్ ని చూసిన ప్రతి ఒక్కరు చాలా ఇంప్రెస్ అవుతున్నారు. ఇందులో కామెడీ నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది అంటూ ఈ సిరీస్ ని చూడడానికి ఆసక్తి చూపిస్తూ ఉండడం విశేషం…
అయితే ఈ సిరీస్ లో కామెడీ బాగున్నప్పటికి ఎమోషన్ పర్ఫెక్ట్ వర్కౌట్ అవుతుందా? లేదా అనేది కొంచెం డౌట్ గా అనిపిస్తోంది…విలేజ్ నేటివిటితో వస్తున్న ఈ సినిమా ఎలాంటి ఇంపాక్ట్ ను క్రియేట్ చేస్తుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకి మంచి ఇమేజ్ వస్తుందా? లేదా అనేది తెలియాల్సి ఉంది…